Top story:భారత్‌తో పెట్టుకుంటే అంతే అడుక్కు తింటున్న పాకిస్తాన్

దారుణంగా పెరిగిన అప్పులు.. రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణం.. రెచ్చిపోతున్న ఉగ్రవాదులు, వేర్పాటువాదులు.. రాజకీయ సంక్షోభం గురించి అయితే ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 28, 2025 | 02:12 PMLast Updated on: Apr 28, 2025 | 2:12 PM

Pakistan Is Begging For More Than It Deserves If It Is Pitted Against India

దారుణంగా పెరిగిన అప్పులు.. రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణం.. రెచ్చిపోతున్న ఉగ్రవాదులు, వేర్పాటువాదులు.. రాజకీయ సంక్షోభం గురించి అయితే ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఒక దేశానికి ఇన్ని సమస్యలుంటే.. రాజనీతి తెలిసిన ఏ లీడరైనా.. సమస్యలకు పరిష్కారం వెదుకుతాడు. కానీ, పాకిస్తాన్‌లో అలా కాదు.. గాయానికి మందు వేయాల్సింది పోయి.. విద్వేషమనే మత్తు ఎక్కిస్తున్నారు. దేశ సంక్షోభాన్ని పక్కన పెట్టి.. పొరుగు దేశంతో కయ్యానికి కాలు దువ్వుతున్నారు. సింపుల్‌గా చెప్పాలంటే పాకిస్తాన్‌ను అక్కడి పాలకులు గాలికొదిలేశారు? ప్రజల సంక్షేమం కంటే భారత్‌తో యుద్ధమే ముఖ్యం అన్నట్టు వ్యవహరిస్తున్నారు. మరి ఈ వ్యవహారం ఆ దేశాన్ని ఎక్కడికి తీసుకెళ్లబోతోందో తెలుసా? టాప్ స్టోరీలో చూద్దాం..

పహల్గామ్ ఉగ్ర దాడి జరిగిన తరువాత.. పాకిస్తాన్‌, భారత్ మధ్య ఉద్రిక్తతలు పీక్స్‌కు చేరుకున్నాయి. రెండు దేశాల మధ్య యుద్ధం ముప్పు పొంచి ఉండడంతో పాక్‌లో ద్రవ్యోల్బణం ఉన్నట్టుండి పెరిగిపోయింది. పాక్‌లో నిత్యావసరాల ధరలు రికార్డు స్థాయికి పెరిగాయి. తాజా నివేదికల ప్రకారం.. బియ్యం, పిండి, కూరగాయలు, పండ్లు, చికెన్‌ వంటి నిత్యావసరాల ధరలు విపరీతంగాపెరుగుతున్నాయి. దీనికి కారణం.. పహల్గాం దాడికి ప్రతీకార చర్యగా ప్రధాని మోడీ ప్రభుత్వం భారత్‌-పాకిస్తాన్‌ ద్వైపాక్షిక వాణిజ్యాన్ని నిలిపేసింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇరుదేశాల ద్వైపాక్షిక వాణిజ్యం విలువ 3వేల 838 కోట్ల రూపాయలుగా ఉంది. ఈ వాణిజ్యంలో ఎక్కువ భాగం పంజాబ్‌లో అమృత్‌సర్‌లోని అట్టారి-వాఘా బార్డర్‌ నుంచే సాగుతోంది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా అట్టారి-వాఘా బార్డర్‌ను భారత్ మూసేసింది. ఈ పరిణామం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్తాన్‌కు పుండు మీద కారం చల్లినట్టు అయ్యింది.

భారత్‌ ద్వైపాక్షిక వాణిజ్యాన్ని నిలిపేయడంతో.. పాకిస్తాన్‌ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. అంతే కాదు.. దాయాది దేశంలో ఔషధాలు, ఆహార పదార్థాలతో సహా నిత్యావసరాల కొరత ఏర్పడు తుంది. భారత్ నుంచి జిప్సం, రాక్ సాల్ట్‌తో పాటు కీలకమైన ఔషధాలు, రసాయనాలు, పండ్లు, కూరగాయలు, కోళ్ల దాణా వంటివి పాకిస్తాన్‌కు భారీ మొత్తంలో భారత్ ఎగుమతి చేస్తుంది. ఇప్పుడు అవి పాకిస్తాన్‌లో దొరకడం కష్టమే. దీంతో ధరలు విపరీతంగా పెరిగి.. అక్కడి ప్రజలను మరింతగా బాధపెడతాయి. ఇప్పటికే పాకిస్తాన్‌ ఔషధాల విషయంలో ఎమర్జెన్సీని ప్రకటించింది. పాక్ తన ఔషధ ముడి పదార్థాల్లో 30 నుంచి 40 శాతం భారత్‌ నుంచే దిగుమతి చేసుకుంటోంది. భారత్‌ ఎగుమతులు నిలిపేసిన తరువాత.. పాకిస్తాన్‌లో ధరలు విపరీతంగా పెరిగాయి. బియ్యం కిలో 340 రూపాయలు, గుడ్లు డజను 332, యాపిల్స్ కిలో 300, పాలు లీటరు 224, అరటి పళ్లు కిలో 176, టమాటా కిలో 150 రూపాయలు పలుకుతున్నాయి. రాబోయే రోజుల్లో ఈ ధరలు మరింతగా పెరిగుతాయని పాకిస్తానీయులు ఆందోళన చెందుతున్నారు. ఒకప్పుడు ధనిక దేశంగా ఉన్న పాకిస్తాన్‌ ఇప్పుడు ఆసియా పేద దేశాల జాబితాలో చేరింది. ఇటీవ ప్రపంచ బ్యాంగ్‌ ఓ భయంకరమైన అంచనాను వేసింది. కోటి మందికి పైగా పాకిస్తానీలు ఆకలి కేకలతో అలమటిస్తున్నట్టు వెల్లడించింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల పరిస్థితి మరీ అధ్వానంగా ఉన్నట్టు ప్రపంచ బ్యాంక్ నివేదిక వెల్లడించింది.

ఇక పాకిస్తాన్‌ ఆర్థిక వృద్ధి అంచనాను 2.7 శాతానికి ప్రపంచ బ్యాంక్‌ తగ్గించింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ మాత్రం వృద్ధి రేటును 2.6 శాతానికే పరిమితం చేసింది. అంటే.. పాకిస్తాన్‌లో మరిన్ని గడ్డు పరిస్థితులు తప్పవని ఈ సూచికలు వెల్లడిస్తున్నాయి. తాజా భారత్ నిర్ణయాలతో పాకిస్తాన్‌లో 19 లక్షల మంది తీవ్ర పేదరికంలో నెట్టేయబడుతారన్న అంచనాలను ప్రపంచ బ్యాంక్ వెల్లడించింది. కృంగిపోతున్న ఆర్థిక వ్యవస్థ, పెరుగుతున్న ఆకలి కేకలతో పాలకులపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రజలను డైవర్ట్ చేయడానికి పాకిస్తాన్‌ పాలకులు పాపపు పనులకు దిగుతారు. భారత్‌పై ఉగ్రదాడులకు దిగడం ఆ పాపాల్లో భాగమే. దశాబ్దాలుగా ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌ నాయకులు.. ప్రజల దారుణ పరిస్థితులను అస్సలు పట్టించుకోవడం లేదు. ప్రజలు ఏమైనా.. వాళ్లకు కావాల్సింది మాత్రం అధికారమే. అధికారం కోసం ఎవరు ఏమైనా పర్లేదన్న మాట. ఇలాంటి దుర్మార్గపు కుయుక్తుల కారణంగానే.. భారత్‌పై యుద్ధానికి దిగి.. పాకిస్తాన్‌ చేతులు కాల్చుకుంది. మూడు సార్లు భారత్‌పై యుద్దానికి దిగిన దాయాది దేశం.. భారత్‌ చేతిలో చిత్తుగా ఓడిపోయింది.

అసలే పేదరికంతో అల్లాడుతున్న ప్రజల్ని పాకిస్తాన్‌‌ రాజకీయ సంక్షోభం మరింత క్రుంగదీస్తోంది. మాజీ ప్రధానమంత్రి, పీటీఐ చీఫ్ ఇమ్రాన్‌ ఖాన్‌ను జైలులు పెట్టడంతో.. అతడి మద్దతుదారులు సర్కార్‌కి, ఆర్మీకి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. దీనికి తోడు ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో టీటీపీ, బలూచిస్తాన్‌లో బీఎల్‌ఏ పెద్ద ఎత్తున ఆర్మీని టార్గెట్ చేసుకుని దాడులు చేస్తున్నాయి. ఒక వైపు ఉగ్రవాదులు, మరొక వైపు తిరుగుబాటుదారులు.. దేశంలో రాజకీయ సంక్షోభం, ఆర్థిక వ్యవస్థ క్రుంగుబాటుతో పాకిస్తాన్‌ అల్లాడుతోంది. గతంలో ఎన్నడూ లేనంత దారుణ పరిస్థితుల్లోకి పాకిస్తాన్‌ కూరుకుపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఏ దేశమైనా సంస్కరణలకు ఉపక్రమిస్తుంది. కానీ.. పాపాల పాకిస్థాన్ నాయకులు మాత్రం అందుకు విరుద్ధం. దేశం గురించి ఆలోచించడం మానేసి.. కశ్మీర్‌ గురించి అక్కడి పాలకులు కలలు కంటారు. భారత్‌ను దెబ్బ తీసేందుకు ఉగ్ర ప్లాన్లపైనే నిత్యం దృష్టి సారిస్తారు. ఫలితంగా.. దేశం అథోగతి పాలయ్యింది. ఒకరకంగా పాకిస్తాన్‌కు ఇప్పుడు చివరి రోజులు నడుస్తున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే, భారత్ కొట్టే దెబ్బ ఆ దేశానికి కొలుకునే అవకాశం ఇవ్వదు.