స్పీడ్ గన్ రీఎంట్రీ ,అదుర్స్ ఆకట్టుకున్న మయాంక్ యాదవ్
లక్నో బౌలింగ్ మిరాకిల్ మయాంక్ యాదవ్ ఐపీఎల్ 2025 ఆరంభ మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో ఎంట్రీ ఇచ్చిన మయాంక్ యాదవ్ తన మార్క్ చూపించాడు.

లక్నో బౌలింగ్ మిరాకిల్ మయాంక్ యాదవ్ ఐపీఎల్ 2025 ఆరంభ మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో ఎంట్రీ ఇచ్చిన మయాంక్ యాదవ్ తన మార్క్ చూపించాడు. ఐపీఎల్ 2024లో ఆడింది నాలుగు మ్యాచ్‌లే అయినప్పటికీ తన సూపర్ ఫాస్ట్ బంతులతో బ్యాటర్లను బెంబేలెత్తించాడు. కనీసం బాల్ టచ్ చేయడానికి కూడా బ్యాటర్లు భయపడ్డారు. 140 కిలోమీటర్లకు పైగా విసరడమే కాకుండా.. లో స్పీడ్ బంతులతో బ్యాటర్లకు జర్క్ ఇచ్చాడు. గాయం కారణంగా ఇంతకాలం లక్నో జట్టుకు దూరమైన మయాంక్ యాదవ్ ముంబై మ్యాచ్‌తో ఎంట్రీ ఇచ్చాడు.
పేస్ బౌలింగ్ వేసిన మయాంక్ తన తొలి రెండు ఓవర్లలోనే వికెట్ దక్కించుకున్నాడు. టెక్నిక్ బౌలింగ్‌తో వరుస సిక్సర్లు బాదిన రోహిత్ శర్మను తెలివిగా అవుట్ చేశాడు. ఆఫ్ సైడ్ 120 కిలోమీటర్ల వేగంతో షార్ట్ బంతి వేసి రోహిత్‌ను బోల్తా కొట్టించాడు. మొదటి ఓవర్ వేసిన మయాంక్ యాదవ్ కేవలం ఆరు పరుగులే ఇచ్చాడు. మూడో ఓవర్‌లో రోహిత్ శర్మ వెంటవెంటనే రెండు పుల్ షాట్స్‌తో రెండు సిక్సర్లు బాదగా.. ఆ తర్వాతి బంతులను స్పీడ్ తగ్గించి వేశాడు. ఐదో బంతిని థర్డ్ మ్యాన్ మీదుగా రోహిత్ బౌండరీ తరలించేందుకు ప్రయత్నించాడు. అయితే 120 కిలోమీటర్ల వేగంతోనే రావడంతో ప్రిన్స్ యాదవ్‌కి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.
గత రెండు మ్యాచ్‌లుగా మంచి ఫామ్‌లో ఉన్న హిట్ మ్యాన్ ఈ మ్యాచ్‌లో మయాంక్ షార్ట్ బంతికి బోల్తా పడి వికెట్ కోల్పోయాడు. రోహిత్ శర్మ ఐదు బంతుల్లో రెండు సిక్సర్లతో 12 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ లో 4 ఓవర్లు వేసిన మయాంక్ రోహిత్ శర్మతో పాటు కీలక మైన హార్థిక్ పాండ్యా వికెట్ కూడా తీసుకున్నాడు. కాగా ఇప్పటివరకు ఐపీఎల్‌లో కేవలం 4 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన యాదవ్.. 7 వికెట్లు పడగొట్టాడు. గాయాలతో సతమతవుతున్నప్పటికి లక్నో మాత్రం అతడిపై నమ్మకం ఉంచింది. ఐపీఎల్-2025 సీజన్‌కు ముందు 11 కోట్లకు అతడిని లక్నో రిటైన్ చేసుకుంది.