కోహ్లీ ఈజ్ బ్యాక్, కింగ్ కు ఆరెంజ్ కిరీటం

కింగ్ ఎక్కడున్నా కింగే... ఈ కామెంట్ వరల్డ్ క్రికెట్ లో విరాట్ కోహ్లీకి సరిగ్గా సరిపోతుంది... ఎందుకంటే ఫామ్ లో ఉన్న లేకున్నా కోహ్లీ తగ్గేదే లే అన్న రీతిలోనే ఉంటాడు..

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 28, 2025 | 06:00 PMLast Updated on: Apr 28, 2025 | 6:00 PM

Kohli Is Back The King Gets The Orange Crown

కింగ్ ఎక్కడున్నా కింగే… ఈ కామెంట్ వరల్డ్ క్రికెట్ లో విరాట్ కోహ్లీకి సరిగ్గా సరిపోతుంది… ఎందుకంటే ఫామ్ లో ఉన్న లేకున్నా కోహ్లీ తగ్గేదే లే అన్న రీతిలోనే ఉంటాడు.. విమర్శలు వచ్చినా ఏమాత్రం పట్టించుకోని విరాట్ తన బ్యాట్ తోనే వారి నోళ్ళు మూయిస్తుంటాడు. ఆసీస్ పర్యటన తర్వాత కోహ్లీ ఇక రిటైరయితే మంచిదన్న కామెంట్లు వినిపించాయి. కానీ విరాట్ లో ఇంకా పరుగుల దాహం ఉందనేది అతనికే తెలుసు… ప్రపంచంలో అత్యుత్తమ ఫిట్ నెస్ తో ఉన్న క్రికెటర్లలో కోహ్లీ టాప్ ప్లేస్ లో ఉంటాడు. అలాంటి కోహ్లీలో కనీసం మరో మూడేళ్ళు క్రికెట్ ఆడే సత్తా ఉందనేది మాజీల మాట.. తన సత్తా ఇంకా తగ్గలేదని కోహ్లీ మరోసారి నిరూపించాడు. ఐపీఎల్ 2025 సీజన్ లో పరుగుల వరద పారిస్తున్నాడు. ఆర్సీబీ విజయాల్లో కీలకంగా మారిన విరాట్ ఇప్పుడు ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు.

ఐపీఎల్‌ చరిత్రలో ఆరెంజ్ క్యాప్‌ను రెండు సార్లు సొంతం చేసుకున్న విరాట్ కోహ్లి.. టాప్ 5లో ఎన్నో సార్లు నిలిచాడు. ఐపీఎల్ 2024లో క్వాలిఫైయర్స్‌లోనే ఆర్సీబీ వెనుదిరిగినప్పటికీ విరాట్ కోహ్లీనే టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ సీజన్‌లోనూ నిలకడగా ఆడుతున్న విరాట్ కోహ్లి ఆరు హాఫ్ సెంచరీలతో ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్‌ను అందుకుని కింగ్ ఎక్కడున్నా కింగే అని నిరూపిస్తున్నాడు. ఇప్పటి వరకు 10 ఇన్నింగ్స్‌లలో 443 పరుగులు చేశాడు. 63.29 యావరేజ్‌తో 138.87 స్ట్రయిక్ రేట్‌తో 6 హాఫ్ సెంచరీలతో రాణించాడు. ఆర్సీబీ ఈ సీజన్‌లో ఏడు మ్యాచ్‌లలో విజయం సాధిస్తే విరాట్ కోహ్లి ఆరు ఇన్నింగ్స్‌లలో హాఫ్ సెంచరీ చేసాడంటే ఎలా రాణిస్తున్నాడో అర్థమవుతోంది. ఈ సీజన్ లో కోహ్లి ఆడాడంటే ఆ రోజు ఆర్సీబీ విజయం పక్కా అని ఫిక్స్ అయిపోవచ్చు.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆరు మ్యాచ్‌లు ఇతర వేదికలపై కాగా.. నాలుగు మ్యాచ్‌లో హోం గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియంలో జరిగాయి. హోం గ్రౌండ్‌లో నాలుగు ఆడి మూడు ఓడిన ఆర్సీబీ, బయట వేదికలపై ఆరు మ్యాచ్‌లు ఆడి ఆరింటిలోనూ గెలిచింది. ఒక్క సీఎస్కే మ్యాచ్‌లో మినహా ఆర్సీబీ గెలిచిన అన్ని మ్యాచ్‌లలోనూ విరాట్ కోహ్లి హాఫ్ సెంచరీ చేశాడు. ఇదిలా ఉంటే ఐపీఎల్ చరిత్రలో విరాట్ కోహ్లి ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఐపీఎల్ 2011లో 557 పరుగులతో రెండో స్థానంలో నిలిచాడు. 2013 సీజన్ ను 634 పరుగులతో మూడో స్థానంలో ముగించాడు. విరాట్ కెరీర్‌లోనే 2016 ఐపీఎల్ చాలా స్పెషల్. ఈ ఐపీఎల్‌లో విరాట్ కోహ్లి ఏకంగా నాలుగు సెంచరీలు, ఏడు హాఫ్ సెంచరీలతో 973 పరుగులు చేసి హిస్టరీ క్రియేట్ చేశాడు. ఐపీఎల్ 2024లో ఒక సెంచరీ, ఐదు హాఫ్ సెంచరీలతో 741 పరుగులతో ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు.