రాజ్యసభ ఎంపీగా పాకా సత్యనారాయణ
ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ స్థానానికి అభ్యర్థి ఖరారు అయ్యారు. బీజేపీ నేత, భీమవరానికి చెందిన పాక వెంకటసత్యనారాయణను ఎంపిక చేసింది ఆ పార్టీ.

ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ స్థానానికి అభ్యర్థి ఖరారు అయ్యారు. బీజేపీ నేత, భీమవరానికి చెందిన పాక వెంకటసత్యనారాయణను ఎంపిక చేసింది ఆ పార్టీ. ఈ మేరకు బీజేపీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. కూటమి అభ్యర్థిగా రేపు ఆయన నామినేషన్ వేయబోతునున్నారు. విజయసాయిరెడ్డి రాజీనామాతో ఈ సీటు ఖాళీ అయిన స్థానాన్ని వెంకటసత్యనారాయణతో భర్తీ చేయబోతున్నారు.
మొదట తమిళనాడు బీజేపీ మాజీ చీఫ్ అన్నామలైకు అవకాశం దక్కవచ్చనే ప్రచారం జరిగింది. ఆయనతో పాటు మంద కృష్ణ మాదిగ పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. కానీ చివరకు ఏపీ నేతకే ఆ అవకాశం దక్కింది. 1983లో అతి చిన్న వయసులోనే భీమవరం కౌన్సిలర్‌గా గెలిచారు వెంకటసత్యనారాయణ. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా కూడా పని చేశారు. ప్రస్తుతం ఏపీ బీజేపీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ ఉన్నారు పాక వెంకటసత్యనారాయణ.