Top story: బొందలో 200 కోట్లు, లక్షన్నర జనం కోసం 200 కోట్లు బొందలో పోసారా?
వెనకటికి ఎవడో కొండంత రాగం తీసి అదేదో పాట పాడాడంట. బి ఆర్ ఎస్ వరంగల్ రజతోత్సవ సభ చూస్తే అలాగే అనిపించింది. టిఆర్ఎస్ పాతికేళ్ల పండగ పేరిట రేవంత్ సర్కార్ మీద యుద్ధం ప్రకటించే వేదిక గా

వెనకటికి ఎవడో కొండంత రాగం తీసి అదేదో పాట పాడాడంట. బి ఆర్ ఎస్ వరంగల్ రజతోత్సవ సభ చూస్తే అలాగే అనిపించింది. టిఆర్ఎస్ పాతికేళ్ల పండగ పేరిట రేవంత్ సర్కార్ మీద యుద్ధం ప్రకటించే వేదిక గా కెసిఆర్ కుటుంబం చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. చివరికి సభకు వచ్చిన జనం…. కెసిఆర్ స్పీచ్ చూశాక 200 కోట్లు బొందలో పోశారు కదరా అని మాట్లాడుకోవాల్సి వచ్చింది. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతని క్యాష్ చేసుకోవడానికి 200 కోట్లు ఖర్చుపెట్టి సిల్వర్ జూబ్లీ సభ చేస్తే…. వచ్చిన జనం లక్షన్నర దాటలేదు. జనం రాకపోతే పాయె… కెసిఆర్ సార్ స్పీచ్ ఇరగదీస్తాడేమో అనుకుంటే… పాడిందే పాట పాచిపల్ల దాసరి లాగా చెప్పిందే చెప్పి బోర్ కొట్టిచ్చాడు కేసీఆర్.
వరంగల్ రజతోత్సవ సభకి పాతిక లక్షలు జనం వస్తారని బి ఆర్ ఎస్ అంచనా వేసింది. కాంగ్రెస్ పై ఉన్న వ్యతిరేకత మొత్తం సభలో కనిపించవచ్చని చాలా ఆశలు పెట్టుకుంది. బ్లాక్ అండ్ వైట్ కలిపి ఈ సభ కోసం 200 కోట్లు రూపాయలు ఖర్చుపెట్టి ఉంటారని ఒక అంచనా. పార్టీ సొమ్ము కాకుండా ప్రతి జిల్లాస్థాయి లీడర్ కి, ఎమ్మెల్యే కి టార్గెట్ పెట్టారు. దేశంలోనే అత్యధికంగా పార్టీ అకౌంట్లో 1450 కోట్లు ఉన్న బి ఆర్ఎస్ పార్టీ ఈ మీటింగ్ కోసం 30 కోట్లు అధికారికంగా చెల్లించింది.
ఇది దేశంలోనే అతిపెద్ద బహిరంగ సభ కానుందని ఊదరగొట్టారు బిఆర్ఎస్ నేతలు. రైతుల దగ్గర రిలీజ్ తీసుకున్న 1200 ఎకరాల్లో చదును చేయడం ,బారికేడ్లు, రోడ్లు వేయడం, స్టేజి ,గెస్ట్ ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు …..వీటి కోసమే 25 కోట్లు ఖర్చు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 500 మంది ఆర్టిస్టులతో వాల్ రైటింగ్ ,గులాబీ జెండాలు ,ఫ్లెక్సీలు ,హోర్డింగులు, పేపర్లు ,టీవీలో ప్రకటనలు దీనికోసం మరో 25 కోట్లు ఖర్చు పెట్టారు. ఇక జన సమీకరణం కోసం అయితే ఆర్టీసీ కే 9 కోట్లు చెల్లించారు. ప్రైవేట్ వాహనాలు…… ప్రయాణం మధ్యలో వారికి భోజనాలు ,మందు షరా మామూలే. వీటన్నిటికీ మరో పాతిక కోట్లు ఖర్చు అయినట్లు సమాచారం. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి జనం దగ్గర కొట్టేసిన సొమ్ము జనానికి ఖర్చు పెట్టడంలో కెసిఆర్ ఏ మాత్రం వెనకడుగు వేయరని మరోసారి నిరూపించారు. బస్సుల్లో టిఆర్ఎస్ కార్యకర్తలు మందు బాటిల్స్ తాగుతూ విలాసంగా నినాదాలు చేస్తుంటే…. ఇది కదా గులాబీ పార్టీ హవా అనిపించింది. స్పాట్
ఇదంతా బానే ఉంది. ఇన్ని వందల కోట్లు ఖర్చుపెట్టి రెండు నెలలు హంగామా చేస్తే మొత్తం వచ్చిన జనం లక్షన్నర. వేసిన కుర్చీలు 75 వేలు. నిలబడిన వాళ్లు మరో 75 వేలు. సరే కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకుంది రాలేకపోయారు …చాలామంది జనం అని అనుకుంటే వాళ్లు 50 వేలు ఉంటారు అనుకున్నా… మొత్తం కలిసి కూడా రెండు లక్షలు నిండలేదు. మనిషికి 500 ఇచ్చి, బిర్యానీ ప్యాకెట్లు, మందు బాటిల్స్ ఇన్ని సప్లై చేసినా కూడా జనాన్ని తీసుకురావడం కష్టం అయిపోయింది. ప్రతి బి ఆర్ఎస్ నాయకుడికి టార్గెట్లు పెట్టిన ఒకరిద్దరు మినహా మిగిలిన వాళ్ళు ఎవరు టార్గెట్ రీచ్ కాలేకపోయారు. ఈ మాత్రం దాని కోసమా రెండు నెలల నుంచి 200 కోట్లు ఖర్చుపెట్టి ఇంత హంగామా చేసింది అని అనిపించింది బి ఆర్ ఎస్ సభ చివరికి.
ఇక కెసిఆర్ స్పీచ్ విషయానికొస్తే. అంతఅన్నాడు ఇంత అన్నాడు… గంగరాజు అయినాక వగ్గిస్తాడే గంగరాజు అన్నట్లు… అసలు కెసిఆర్ వస్తే భూకంపం పుట్టిస్తాడు అన్నట్టుగా బిల్డప్ ఇచ్చారు. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే…. ఈ సభలో ఒక్క నాయకుడు కూడా మాట్లాడలేదు. కెసిఆర్ స్పీచ్ కి మళ్ళీ ఎక్కడ ఆటంకం కలుగుతుందో అన్నట్లు సభ మొత్తం వన్ అండ్ ఓన్లీ కెసిఆర్ స్పీచ్ తో అదిరిపోవాలి అనుకున్నారు. కెసిఆర్ హెలికాప్టర్ లో దిగి సభ పైకి రావడానికి చాలా సేపు వేచి ఉండాల్సి వచ్చింది. సరే వచ్చిన తర్వాత అయినా ఇరగదీసాడా అంటే మళ్లీ పాడిన పాటే పాడాడు. అవే పిల్లి శాపనార్థాలు… అవే తిట్లు. కెసిఆర్ స్పీచ్ లో కనీసం కొత్త తిట్లు కూడా లేవు. పోనీ ఏదైనా సంచలన ప్రకటన ఉంటదా అన్న అంటే అది లేదు. కాంగ్రెస్…. రేవంతు టార్గెట్ గానే కెసిఆర్ స్పీచ్ మొత్తం సాగింది.
రాబోయే రోజుల్లో బిజెపితో మాకు సంబంధాలు ఉంటాయి అని చెప్పడానికి అనుకుంటా ఒక్కచోట తప్ప మోడీని పల్లెత్తు మాట అనలేదు. బిజెపిని ఎక్కడ విమర్శించలేదు. ఈ విషయంలో కేసీఆర్ ముందుచూపునీ కచ్చితంగా మెచ్చుకోవాలి. ఏతవాతా కెసిఆర్ స్పీచ్ మాత్రం అట్టర్ ప్లాప్. ఈ ఒక్క విషయంలో కాంగ్రెస్ వాళ్ళు సంతోషించవచ్చు. మొత్తం మీద రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై ఇంత వ్యతిరేకత ఉంటే…. ఆ వ్యతిరేకతని క్యాష్ చేసుకోవడంలో బి ఆర్ఎస్ అట్టర్ ప్లాఫ్ అయింది.200 కోట్ల రూపాయలు వందలో పోసినట్లయింది. ఇంత చేసి పాపం హరీష్ రావు చివరికి సభలో ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉద్యోగం కూడా చేశాడు. కానీ ఎక్కడ హరీష్ రావు బొమ్మ కనపడకుండా వేదిక మీద చాలా జాగ్రత్త పడ్డారు కేసీఆర్ కేటీఆర్. పాపం హరీష్ కి ఇదొక విషాదం. మొత్తం మీద కెసిఆర్ భూకంపం పుట్టించడం మాట నుంచి, టిఆర్ఎస్ భ్రమలో ఉంది అనే విషయం మాత్రం ఈ సభ ద్వారా అందరికీ తెలిసింది.