Top story: రంగంలోకి RAW, పాకిస్థాన్ కూసాలు కదిలి పోవడమే..!
ఒక వైపు ఇండియా హెచ్చరికలు.. మరోవైపు పాక్ మేకపోతు గాంభీర్య ప్రకటనలు.. ఇంకోవైపు టెర్రరిస్టుల బరితెగింపు ప్రకటనలు.. వీటన్నిటి నేపథ్యంలో ఆల్ మోస్ట్ వార్ నడుస్తున్నట్లే అనిపిస్తోంది.

ఒక వైపు ఇండియా హెచ్చరికలు.. మరోవైపు పాక్ మేకపోతు గాంభీర్య ప్రకటనలు.. ఇంకోవైపు టెర్రరిస్టుల బరితెగింపు ప్రకటనలు.. వీటన్నిటి నేపథ్యంలో ఆల్ మోస్ట్ వార్ నడుస్తున్నట్లే అనిపిస్తోంది. ప్రస్తుతానికి మాటల యుద్ధం నడుస్తోంది. ఒకరిపై ఒకరు మైండ్ గేమ్ ఆడుతున్నట్లు కనిపిస్తోంది. ఏం చేస్తానో చెప్పకుండా ఏదో ఒకటి అయితే చేయక తప్పదనే సిగ్నల్ ఇస్తూ ఇండియా పాకిస్తాన్ ను అయితే వణికిస్తోంది. ఎటు నుంచి ఎలాంటి దాడి జరుగుతుందో తెలియక పాక్ నిజంగానే వణుకుతోంది. అయితే ఇండియా ఎలాంటి దాడి చేయాలన్నా.. ముందు దానికి రంగం సిద్ధం చేసేది మాత్రం రా.. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్. అమెరికాకు సీఐఏ, రష్యాకు కేజీబీ ఎలాగో భారత్ కు రా అలాగా. మోస్ట్ పవర్ ఫుల్ డిపార్ట్ మెంట్ ఆఫ్ ఇండియా. అసలైతే మనల్ని ఎవరైనా టచ్ చేయక ముందే .. అవతలివాడు విసిరిన పంజా తాలుకా గాలి పీల్చేది ముందు రా అధికారులే. ఎక్కడ చీమ చిటుక్కుమన్నా సరే ముందు వారి చెవుల్లోనే పడేది.
ఒక విధంగా మొన్ని ఉగ్రదాడిని పసిగట్టలేకపోవడం వీరి వైఫల్యమే అని చెప్పాలి. కాని అన్నిసార్లు సక్సెస్ కాలేకపోవచ్చు గాని.. చాలాసార్లు.. లెక్కలేనన్ని సార్లు మన ఇండియాను అనేక దాడుల నుంచి కాపాడింది మాత్రం ఈ రా అధికారులే.
రా అనేది 1968లో ఏర్పాటైంది. మొదట్లో మనకు ఇంటెలిజెన్స్ బ్యూరో మాత్రమే ఉండేది. 1966లో పాక్ తో జరిగిన యుద్ధం సమయంలో అది అంత ఎఫెక్టివ్ గా పని చేయలేదని గుర్తించి.. దాని బలం సరిపోదని.. ఈ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం దీని అధినేత రవి సిన్హా ఐపీఎస్. ఈయన పోస్టు ఎంత పవర్ ఫుల్ అంటే.. ఈయన కేవలం ప్రధానమంత్రికి మాత్రమే రిపోర్ట్ చేస్తాడు. ఆఫ్ కోర్స్ హోంమంత్రి కూడా ఉంటారు. ప్రధానమంత్రి, హోంమంత్రి మాత్రమే ఈ పోస్టుకు కావాల్సిన అధికారిని సెలెక్ట్ చేస్తారు. ఇదో కేబినెట్ కమిటీ.. అంటే ఈ కమిటీలో ప్రధాని, హోంమంత్రి మాత్రమే ఉంటారు. వీరే సెలెక్ట్ చేస్తారు. రా చీఫ్ ను ఈ కేబినెట్ కమిటీ సెక్రటరీగా వ్యవహరిస్తారు. ఈయన కింద అడిషనల్ సెక్రటరీ, స్పెషల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీలు, ఇతర స్టాఫ్ అంతా టీమ్ ఉంటారు.
ఈ రా పని ఏంటంటే.. దేశంలో జరుగుతున్నవి, దేశం బయట.. మన భారత్ పై జరుగుతున్న కుట్రలు, టెర్రరిజం యాక్టివిటీస్, ఇతర దేశాల కదలికలు.. అన్నిటినీ గమనిస్తూ ఉంటుంది. ఎప్పుడు మనకు ప్రమాదం ఏ రూపంలో వస్తుందో కనిపెట్టి.. వెంటనే కౌంటర్ స్ట్రాటజీని రూపొందిస్తుంది. వీరి నివేదికల బట్టే మన దేశ రక్షణ వ్యూహాలు రూపొందించబడతాయి. దీనిలో నాలుగు టీమ్స్ ఉంటాయి.. వీరిలో ఫస్ట్ టీమ్ చూసేది పాకిస్తాన్ ని.. రెండోది చూసేది చైనాని.. మూడోది ఆఫ్రికా లాంటి దేశాలను.. నాలుగోది మిగతా దేశాలను.. అంటే మన శత్రదేశాలపై నిఘానే మనకు ప్రధానం. ఈ రా కింద స్పెషల్ ఆపరేషన్స్ వింగ్ అని ఉంటుంది. ఈ వింగ్ విదేశాల్లో మనకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్న టెర్రరిస్ట్ గ్రూపులను అంతం చేయడం.. మనకు ప్రమాదకరంగా తయారవుతారని అనుమానం ఉన్న గ్రూపులను కూడా లేపేయడమే వీరి ఆపరేషన్స్ యొక్క ప్రధాన లక్ష్యం. ఇప్పటివరకు పాక్ తో జరిగిన యుద్ధాల్లో గాని, కార్గిల్ యుద్ధంలో గాని రా పోషిచిన పాత్ర చాలా కీలకమైంది. అందుకే పాకిస్తాన్ గూఢచార సంస్ధ ఐఎస్ఐ గాని, టెర్రరిస్టు గ్రూపులు గాని ఈ రా అధికారులు, టీమ్ పైనే ఫోకస్ పెడుతుంటారు.
ప్రాణాలకు తెగించి మరీ పని చేయాల్సిందే. ఎప్పుడు ఎటు నుంచి దాడి చేస్తారో తెలియదు. ఎంతోమంది స్పెషల్ ఆఫరేషన్స్ పై అండర్ కవర్ విదేశాలకు వెళ్లి చనిపోయారు. చాలామంది వివరాలు కూడా బయటకు రావు. వారు దేశం కోసం ప్రాణాలిచ్చినా.. వారిని గుర్తించరు. ఎందుకంటే విదేశాల్లో అనుమతి లేకుండా చేసే ఆపరేషన్లను నిబంధనలు ఒప్పుకోవు. అందుకే సీక్రెట్ గా చేస్తారు. ఆ సీక్రెట్ ఆపరేషన్ లో ఒకవేళ చనిపోతే వారి దేశభక్తి కేవలం ఆ టీమ్ కి తప్ప మనకు తెలియదు. అందుకే ఇప్పుడున్న యుద్ధ వాతావరణంలో అందరూ రా వైపే చూస్తున్నారు. రా చీఫ్ రవి సిన్హా ఛత్తీస్ గడ్ రాష్ట్రానికి చెందినవారు. ఈయన 1988 బ్యాచ్. భారత్ చేసిన సర్జికల్ స్ట్రయిక్ ఎపిసోడ్ లో కూడా ఈయన పాత్ర కీలకమైంది. దీనికి ముందు రా లోనే ఈయన స్పెషల్ సెక్రటరీగా పని చేశారు. 2023లో సెక్రటరీగా ప్రమోట్ అయ్యారు.