బ్రేకింగ్:ఉక్రెయిన్ మీద యుద్ధం ఆపేస్తున్నాం, పుతిన్ సంచలన నిర్ణయం…!
రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం విషయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఉక్రెయిన్‌పై మూడు రోజుల పాటు యుద్ధం ఆపివేస్తున్నట్టు ప్రకటించాడు.

రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం విషయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఉక్రెయిన్‌పై మూడు రోజుల పాటు యుద్ధం ఆపివేస్తున్నట్టు ప్రకటించాడు. మే8 నుంచి మే11 వరకూ సీజ్ ఫైర్ ప్రకటించాడు. రెండవ ప్రపంచ యుద్ధంలో సోవియట్ యూనియన్ నాజీ జర్మనీపై సాధించిన విజయానికి 80వ వార్షికోత్సవం సందర్భంగా పుతిన్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నాడు.
దాదాపు మూడేళ్ల నుంచి ఉక్రెయిన్ రష్యా మధ్య ఈ యుద్ధం కొనసాగుతోంది. ఈ యుద్ధంలో ఇప్పటికే వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో పాటు చాలా దేశాల అధ్యక్షులు ప్రయత్నిస్తున్నప్పటికీ యుద్ధం మాత్రం ఆగడంలేదు. ఇలాంటి యుద్ధంలో పుతిన్ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు సంచలనంగా మారింది.