ఎన్టీఆర్ ఇంత ఫాస్ట్ అనుకోలేదు.. దేవర 2 మీద ఇంత పెద్ద అప్డేట్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు..!
జూనియర్ ఎన్టీఆర్ జోరు చూసి మిగిలిన హీరోలకు నిద్ర కూడా రావట్లేదు. అంత వేగంగా సినిమాలు పూర్తి చేస్తున్నాడు తారక్. ఆల్రెడీ వార్ 2 ఆగస్టు 14న విడుదల కానుంది.

జూనియర్ ఎన్టీఆర్ జోరు చూసి మిగిలిన హీరోలకు నిద్ర కూడా రావట్లేదు. అంత వేగంగా సినిమాలు పూర్తి చేస్తున్నాడు తారక్. ఆల్రెడీ వార్ 2 ఆగస్టు 14న విడుదల కానుంది. ఇది సెట్స్ మీద ఉండగానే ప్రశాంత్ నీల్ తో డ్రాగన్ సినిమా మొదలుపెట్టాడు ఎన్టీఆర్. దీని షూటింగ్ కూడా వేగంగా జరుగుతుంది. భారీ షెడ్యూల్ కర్ణాటకలో తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్. తారక్ తో పాటు మిగిలిన కీలక నటీ నటులు కూడా ఈ షెడ్యూల్లో పాల్గొంటున్నారు. ఇదిలా ఉంటే నెక్స్ట్ ప్లానింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేస్తున్నాడు తారక్. డ్రాగన్ పూర్తయిన తర్వాత వెంటనే దేవర 2 వైపు వెళ్ళనున్నాడు జూనియర్. తాజాగా ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తయినట్టు ప్రచారం జరుగుతుంది. కొన్ని రోజులుగా నాన్ స్టాప్ గా దేవర సీక్వెల్ కోసం కథ రాస్తూనే ఉన్నాడు కొరటాల శివ. నిజానికి దేవర చేస్తున్నప్పుడే పార్ట్ 2 కథ కూడా చాలా వరకు పూర్తి చేశాడు ఈయన. కాకపోతే దేవరకు చాలావరకు విమర్శలు వచ్చాయి.
సినిమా అసలు బాగోలేదు.. కేవలం ఎన్టీఆర్ క్రేజ్ వల్ల ఆడింది అంతే అంటూ నేరుగానే అటాక్ చేసారు. నిజం చెప్పాలంటే రాజమౌళి తర్వాత సినిమాతో ఇప్పటివరకు ఒక్క హీరో కూడా హిట్టు కొట్టలేదు. దేవరతో అది చేసి చూపించాడు జూనియర్. అది కూడా నెగిటివ్ టాక్ వచ్చిన సినిమాతో..! దీన్ని బట్టి ఆయన రేంజ్ ఏంటి అనేది అర్థమవుతుంది. ముఖ్యంగా మాస్ సర్కిల్స్ లో తారక్ కు ఉన్న ఫాలోయింగ్ మాటల్లో చెప్పలేము. అందుకే వరుసగా యాక్షన్ సినిమాలతో వస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్. డ్రాగన్ లాంటి హై వోల్టేజ్ ఎమోషనల్ యాక్షన్ సినిమా తర్వాత దేవర 2తో మరోసారి అదే మ్యాజిక్ చేయాలని చూస్తున్నాడు ఎన్టీఆర్. కథ విషయంలో కూడా చాలా అంటే చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు కొరటాల శివ. ఈ సినిమా కోసం గ్రూప్ ఆఫ్ రైటర్స్ పని చేస్తున్నారు. అంతేకాదు ఎన్టీఆర్ కూడా తనకు ఛాన్స్ ఉన్న ప్రతిసారి వెళ్లి స్టోరీ సిటింగ్స్ లో కూర్చుంటున్నాడు.
పార్ట్ 1 కంటే 2లో సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఇంకా చాలా వరకు ఉంటాయి అంటున్నారు మేకర్స్. ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్ మీద చూడని విధంగా యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కించే ప్లాన్ చేస్తున్నాడు కొరటాల శివ. అంతేకాదు సముద్రం మీద నెవర్ బిఫోర్ యాక్షన్ సీన్స్ చిత్రీకరించబోతున్నాడు. దేవర సినిమాలోనే సముద్రం మీద చాలా మంచి సీక్వెన్స్ లు ఉంటాయి. ఇప్పుడు సీక్వెల్ లో వాటిని మించి యాక్షన్ సీన్స్ ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు కొరటాల. బడ్జెట్ దగ్గర కూడా ఎలాంటి కాంప్రమైజ్ లేదు. దేవర సినిమాను 180 కోట్లతో నిర్మిస్తే.. సీక్వెల్ కోసం 300 కోట్లు అంటున్నారు. ఎలాగో ఆ క్రేజ్ ఉంటుంది కాబట్టి కచ్చితంగా ఈ సినిమా 500 కోట్లకు పైగానే వసూలు చేస్తుందని బలంగా నమ్ముతున్నారు దర్శక నిర్మాతలు. వాటికి ముందు వార్ 2, డ్రాగన్ కూడా ఎన్టీఆర్ 500 కోట్ల కలను నెరవేర్చేలా కనిపిస్తున్నాయి. మొత్తానికి డ్రాగన్ పూర్తయ్యే టైంకు బౌండెడ్ స్క్రిప్ట్ తో సిద్ధంగా తారక్ కోసం వెయిట్ చేయబోతున్నాడు కొరటాల శివ. 2026 లోనే దేవర 2 కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.