రెమ్యూనరేషన్ ఎవడు పెంచమన్నాడు.. కోట్లు ఇస్తున్న నిర్మాతలదే తప్పు.. నాని సంచలనం..!

సినిమా ఇండస్ట్రీలో నెవెర్ ఎండింగ్ ఇంట్రెస్టింగ్ టాపిక్ రెమ్యూనరేషన్. ఆ హీరో అన్ని కోట్లు తీసుకుంటున్నాడంట.. ఈ హీరో అన్ని కోట్లు తీసుకుంటున్నాడంట అంటూ ఇండస్ట్రీలో విడిపించే కామెంట్స్ భలే ఆసక్తికరంగా అనిపిస్తాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 28, 2025 | 01:00 PMLast Updated on: Apr 28, 2025 | 1:00 PM

Hero Nani Sensational Comments

సినిమా ఇండస్ట్రీలో నెవెర్ ఎండింగ్ ఇంట్రెస్టింగ్ టాపిక్ రెమ్యూనరేషన్. ఆ హీరో అన్ని కోట్లు తీసుకుంటున్నాడంట.. ఈ హీరో అన్ని కోట్లు తీసుకుంటున్నాడంట అంటూ ఇండస్ట్రీలో విడిపించే కామెంట్స్ భలే ఆసక్తికరంగా అనిపిస్తాయి. మరీ ముఖ్యంగా స్టార్ హీరోల రెమ్యూనరేషన్ గురించి ఎప్పుడు ఒక గ్రూప్ చర్చిస్తూనే ఉంటుంది. నిజంగా వాళ్ళు ఎంత తీసుకుంటారు తెలియదు కానీ బయట మాత్రం వాళ్ళ పారితోషకం మీద చర్చ మాత్రం బాగా జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకు తెలుగు ఇండస్ట్రీని తీసుకుంటే.. ఒకప్పుడు మన హీరోలు 50 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటే చాలా పెద్ద విషయం. కానీ ఇది ఇప్పుడు చాలా మామూలు విషయంగా మారిపోయింది. మన సినిమాలకు మొదటి రోజే దాదాపు 150 నుంచి 200 కోట్ల ఓపెనింగ్స్ వస్తున్నాయి. ఫుల్ రన్ లో వెయ్యి కోట్లు కూడా వసూలు చేసిన సినిమాలు ఉన్నాయి. అందుకే మన హీరోలు పారితోషికం విషయంలో అసలు తగ్గడం లేదు. మార్కెట్ ఇలా ఉంది కాబట్టి తమ రెమ్యూనరేషన్ కూడా అలాగే ఉండాలి అంటున్నారు. ప్రభాస్ లాంటి హీరోలు ఒక్కొక్క సినిమాకు 150 నుంచి 220 కోట్లకు మధ్యలో తీసుకుంటున్నారు.

ఇక తమిళ హీరో విజయ్ తన చివరి సినిమా జన నాయగన్ కోసం 250 కోట్లు తీసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతుంది. మన దగ్గర అల్లు అర్జున్ కూడా పుష్ప 2 కోసం 300 కోట్లు తీసుకున్నాడు అని స్వయంగా ఫోర్బ్స్ లెక్కలు చెప్పాయి. ఇప్పుడు అట్లీ సినిమా కోసం కూడా 200 కోట్ల వరకు ఈయన తీసుకుంటున్నాడు. అయితే ఒక్కో హీరో ఇన్నిన్ని వందల కోట్లు తీసుకుంటున్నప్పుడు బయట చర్చ జరగకుండా ఎందుకు ఉంటుంది చెప్పండి..? తాజాగా ఇదే విషయం మీద హీరో నాని స్పందించాడు. ఈ రోజుల్లో సినిమాలు తీయడం అంత ఈజీ కాదు.. బడ్జెట్లో సగానికి పైగా హీరోల రెమ్యూనరేషన్ కే సరిపోతుంది అంటూ కొంతమంది నిర్మాతలు కామెంట్ చేస్తున్నారు. దీని మీద చాలా సీరియస్ గా కౌంటర్ ఇచ్చాడు నాని. ఇచ్చేవాడు లేనప్పుడు అడిగేవాడు ఉండడు కదా.. హీరో ఎంతైనా అడుగుతాడు.. కానీ మార్కెట్ లెక్కలు వేసుకుని ఆయనకు డబ్బులు ఇవ్వాల్సిందే నిర్మాత.. మరి ఆయన సరిగ్గా లెక్కలు వేసుకుంటే ఈ తిప్పలు ఎందుకు వస్తాయి అంటున్నాడు నాని.

ఒకడు నిన్ను అన్ని కోట్లు అడుగుతున్నాడు అంటే.. నీకు వర్కౌట్ అయితేనే కదా ఇస్తావ్.. లేకుంటే ఎందుకు ఇస్తావు.. అలా ఇస్తున్నప్పుడు తప్పు నీదే కదా అంటున్నాడు నాచురల్ స్టార్. హీరోల రెమ్యూనరేషన్ పెరగడంలో నిర్మాతల తప్పే ఎక్కువగా ఉంది అంటున్నాడు నాని. వాళ్లు ఇవ్వకపోతే వీళ్ళు అడగరు.. వాళ్లు ఇస్తున్నారు కాబట్టే వీళ్ళు ఎంత కావాలంటే అంత అడుగుతున్నారు అంటున్నాడు ఈయన. బయట మార్కెట్ ఎంత ఉందో చూసుకోకుండా హీరోలకు అడిగినంత ఇస్తే నష్టపోయేది నిర్మాత.. కాబట్టి ముందు ఆయన తన జాగ్రత్తలో ఉండి సినిమా చేసుకోవాలి అంటున్నాడు. అయినా ఈ డిస్కషన్ మొత్తం సినిమాలు నిర్మించని వాళ్ళు మాత్రమే చేస్తారు.. నిజంగా సినిమా నిర్మాణంలో ఉన్న వాళ్ళు ఎవరు ఈ లెక్కలు మాట్లాడరు.. బయట మాట్లాడుకునేలా ఇండస్ట్రీలో పరిస్థితులు ఉండవు.. అందరి లెక్కలు కరెక్ట్ గా ఉంటాయి అంటున్నాడు నాని. ఏదేమైనా ఒక విషయం మీద కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడాలి అంటే నానిని మించిన వాళ్ళు లేరు.