జూనియర్ ఎన్టీఆర్, నెల్సన్ సినిమా స్టోరీ లైన్ తెలుసా.. తారక్ క్యారెక్టర్ నెక్స్ట్ లెవెల్ అంతే..!

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆల్రెడీ బాలీవుడ్ లో వార్ 2 సినిమా షూటింగ్ పూర్తి చేసి.. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సినిమా వైపు వచ్చేసాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 26, 2025 | 07:33 PMLast Updated on: Apr 26, 2025 | 7:33 PM

Do You Know The Story Line Of Junior Ntr And Nelsons Movie Taraks Character Is Next Level

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆల్రెడీ బాలీవుడ్ లో వార్ 2 సినిమా షూటింగ్ పూర్తి చేసి.. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సినిమా వైపు వచ్చేసాడు. ఈ సినిమా షెడ్యూల్ కర్ణాటకలో వేగంగా జరుగుతుంది. మే 8 వరకు షెడ్యూల్ అక్కడే జరగనుంది. జూనియర్ ఎన్టీఆర్ తో పాటు పలువురు కీలక నటీనటులు కూడా ఈ షూటింగ్ లో పాల్గొంటున్నారు. జూలై వరకు నాన్ స్టాప్ షూట్ చేస్తూ డ్రాగన్ సినిమాతోనే బిజీగా ఉండబోతున్నాడు తారక్. ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ లోపు పూర్తి చేసి సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. జులై చివరి వారం నుంచి ఆగస్టు 15 వరకు వార్ 2 ప్రమోషన్స్ కోసం డేట్స్ ఇచ్చాడు జూనియర్. ఈ రెండు సినిమాలు తర్వాత దేవర 2 సెట్స్ మీదకు రానుంది. ప్రస్తుతం సీక్వెల్ కథ సిద్ధం చేసే పనిలో బిజీగా ఉన్నాడు కొరటాల శివ. నిజం చెప్పాలంటే దేవర చేస్తున్నప్పుడే పార్ట్ 2 స్టోరీ కూడా సిద్ధమైంది.. కాకపోతే ఫస్ట్ పార్ట్ పెద్ద హిట్ కావడంతో సెకండ్ పార్ట్ స్టోరీ లైన్ కాస్త మారుస్తున్నాడు కొరటాల. దానికి తోడు దేవర మీద కొన్ని విమర్శలు కూడా వచ్చాయి.

కథ అస్సలు లేదు.. ఇంకాస్త ఆసక్తికరంగా ఉండుంటే బాగుండు అని చాలామంది చెప్పారు. ఈ విమర్శలను సీరియస్ గా తీసుకున్న కొరటాల శివ.. దేవర 2 కోసం అద్భుతమైన కథ సిద్ధం చేస్తున్నాడు. డిసెంబర్ నాటికి డ్రాగన్ పూర్తి చేసుకుని కొరటాల దగ్గరికి రానున్నాడు జూనియర్ ఎన్టీఆర్. దేవర 2 ఉండదు అని చాలా రోజులుగా ప్రచారం జరిగింది.. అలాంటి అనుమానాలు అక్కర్లేదని ఇటు హీరో ఎన్టీఆర్ తో పాటు నిర్మాత కళ్యాణ్ రామ్ కూడా క్లారిటీ ఇచ్చాడు. మీరు ఊహించిన దానికంటే భారీ స్థాయిలో దేవర 2 ఉండబోతుంది అని క్లారిటీ ఇచ్చారు వాళ్ళిద్దరూ. వీటి తర్వాత తమిళ దర్శకుడు నెల్సన్ తో సినిమా చేయనున్నాడు జూనియర్. సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాను నిర్మించబోతుంది. ప్రస్తుతం రజనీకాంత్ జైలర్ 2 సినిమా తెరకెక్కిస్తున్నాడు నెల్సన్ దిలీప్ కుమార్. దీని తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.

ఇక ఈ సినిమా స్టోరీ లైన్ విషయానికి వస్తే ఇందులో తారక్ మాఫియా డాన్ గా నటించబోతున్నట్టు తెలుస్తుంది. గతంలో బాద్షా సినిమాలో మాఫియా బ్యాక్ డ్రాప్ చేశాడు జూనియర్. ఆ తర్వాత మళ్లీ అటువైపు వెళ్ళలేదు. ఇన్నేళ్ల తర్వాత నెల్సన్ కోసం మరోసారి మాఫియా బ్యాక్ డ్రాప్ స్టోరీలో నటించబోతున్నాడు తారక్. కచ్చితంగా ఈ సినిమా ఎవరు ఊహించని స్థాయిలో ఉండబోతుంది అంటున్నారు మేకర్స్. అంతేకాదు సినిమా సినిమా కోసం పూర్తిగా మేకోవర్ అవుతున్నాడు జూనియర్ ఎన్టీఆర్. గతేడాది దేవర కోసం కొన్ని కేజీలు తగ్గిన తారక్.. వార్ 2 కోసం మరింత బరువు తగ్గాడు. అంతేకాదు సిక్స్ ప్యాక్ కూడా చేశాడు. ఇక ఇప్పుడు డ్రాగన్ కోసం ఏకంగా 18 కేజీలు తగ్గుతున్నట్టు తెలుస్తోంది. తర్వాత దేవర 2 కోసం బరువు పెరగాలని ఫిక్స్ అయ్యాడు జూనియర్. ఇలా సినిమాకు కొత్తగా కనిపించడానికి ఆసక్తి చూపిస్తున్నాడు ఈయన.