ఉస్తాద్ భగత్ సింగ్ కోసం పవన్ కళ్యాణ్ రికార్డ్ రెమ్యూనరేషన్.. 40 రోజులకు అన్ని కోట్లా.. ఆ హీరోలకు నిద్ర పడుతుందా..?
పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడు కాక ముందే సినిమా హీరో. ఆయనకు ఇక్కడ ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలామంది రాజకీయ నాయకులకు లేని అడ్వాంటేజ్ కూడా అదే.

పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడు కాక ముందే సినిమా హీరో. ఆయనకు ఇక్కడ ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలామంది రాజకీయ నాయకులకు లేని అడ్వాంటేజ్ కూడా అదే. సినిమాతో పాటు పొలిటికల్ మైలేజ్ కూడా ఈయనకు బాగా హెల్ప్ అవుతుంది. అందుకే పవన్ కళ్యాణ్ అంటే ఆ రేంజ్ క్రేజ్ ఉంటుంది. స్వయంగా దేశ ప్రధానమంత్రి కూడా వచ్చి పవన్ కళ్యాణ్ కు నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్ ఇస్తుంటాడు. బహుశా ఇండియన్ పాలిటిక్స్లో కేవలం పవన్ కళ్యాణ్ కు మాత్రమే దక్కిన గౌరవం అది. నరేంద్ర మోడీ లాంటి నాయకుడు పవన్ ను తుఫాన్ అని మెచ్చుకోవడం చిన్న విషయం కాదు. ఇంత ఇమేజ్ ఉంది కాబట్టే సినిమాలలో కూడా ఈయన రేంజ్ అలా ఉంటుంది. తాజాగా రాజకీయాలలో బిజీగా ఉన్నాడు కానీ పవన్ కళ్యాణ్ చేతిలో మూడు సినిమాలు అయితే ఉన్నాయి. ఎప్పుడో సైన్ చేసిన ఈ సినిమాలను ఇప్పుడు పూర్తి చేయాలని చూస్తున్నాడు పవర్ స్టార్. తాను సినిమాలు కేవలం డబ్బుల కోసమే చేస్తున్నాను అని ఇప్పటికే చాలాసార్లు చెప్పిన పవన్ కళ్యాణ్.. రెమ్యూనరేషన్ విషయంలో మాత్రం అసలు తగ్గడం లేదు.
ఆయన అడగక ముందే నిర్మాతలే ఎంత కావాలంటే అంత ఇస్తున్నారు. పవన్ స్థాయి అలా ఉంది కాబట్టి వాళ్లు కూడా ఏమీ మాట్లాడడం లేదు. తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ జూలై నుంచి మొదలు పెట్టాలని ప్లాన్ చేస్తున్నాడు పవన్. ఆలోపు బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధం చేయాలని హరీష్ శంకర్ కు ఇప్పటికే ఆదేశాలు వెళ్లాయి. అన్ని పనులు పక్కనపెట్టి ముందు పవన్ కళ్యాణ్ సినిమా పని మీదే బిజీగా ఉన్నాడు ఈ దర్శకుడు. ఈ సినిమాను పవన్ ఇప్పుడు ఒప్పుకోలేదు.. అప్పుడెప్పుడో మూడేళ్ల కింద సైన్ చేశాడు. అప్పట్లో హడావిడిగా సినిమా పూజ కార్యక్రమాలు మొదలుపెట్టడమే కాదు.. ఒక షెడ్యూల్ కూడా పూర్తి చేశాడు హరీష్ శంకర్. అదే ఊపులో కంటిన్యూ చేసి ఉంటే రెండు నెలల్లో సినిమా పూర్తి అయిపోయి ఉండేది. కానీ పట్టుమని పది రోజులు షూటింగ్ చేశాడో లేదో రాజకీయాలు అంటూ వెళ్లిపోయాడు పవన్ కళ్యాణ్. ఇక తాను మళ్ళీ సినిమాలు చేస్తానో చేయనో క్లారిటీ లేక.. మైత్రి మూవీ మేకర్స్ కు అడ్వాన్స్ తిరిగి ఇచ్చేయాలని చాలాసార్లు ప్రయత్నించాడు పవన్. కానీ మీరు ఖాళీగా ఉన్నప్పుడే మేము సినిమా చేసుకుంటాము అంటూ వాళ్ళు బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఎప్పటికప్పుడు ఉస్తాద్ సెట్స్ మీదకి వస్తుంది అని వాళ్ళు ఆశించారు.. కానీ జరుగుతున్న పరిణామాల దృష్ట్యా ఈ సినిమా ఆగిపోయింది అని ఒక నిర్ణయానికి వచ్చేసారు అభిమానులు.
అయితే ఈ మధ్యే తన నిర్మాతలను మంగళగిరి ఆఫీసుకు పిలిపించుకొని మరీ.. ఒప్పుకున్న సినిమాలను ఎప్పుడు పూర్తి చేస్తానని విషయం మీద క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే జూలై నుంచి మైత్రి మూవీ మేకర్స్ సినిమా పట్టాలెక్కబోతుంది. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది కానీ ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ అందుకుంటున్న పారితోషికం తెలిస్తే మిగిలిన హీరోలకు గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. ఉస్తాద్ సినిమాను కేవలం 40 రోజుల్లో పూర్తి చేయాలి అని పవన్ కళ్యాణ్ కండిషన్ పెట్టాడు. ఈ 40 రోజుల కోసం ఆయన ఏకంగా 160 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. అంటే రోజుకు 4 కోట్లు అన్నమాట. ఈయన ఉప ముఖ్యమంత్రి కాకముందు రోజుకు రెండు కోట్లకు పైగానే పారితోషికం అందుకున్నాడు. ఇప్పుడు డిప్యూటీ సీఎం కూడా అయ్యాడు కాబట్టి ఆ రేంజ్ ఉంటుంది. అందుకే రోజుకు 4, 5 కోట్లు ఇవ్వడానికి కూడా రెడీ అవుతున్నారు నిర్మాతలు. పవన్ కళ్యాణ్ సినిమా అంటే కనీసం 200 కోట్లు బిజినెస్ ఖాయం.. దానికి తోడు నాన్ థియేట్రికల్ మరో 150 కోట్లు వస్తాయి. అందుకే ఆయన అడిగినంత ఇస్తున్నారు నిర్మాతలు.