నాకు ఎదురొచ్చినా.. నేను ఎదురెళ్ళినా వాళ్లకే రిస్క్ తొక్కిపడేస్తా.. వాళ్లకు బాలయ్య మాస్ వార్నింగ్..!

నందమూరి బాలకృష్ణ.. ఇప్పుడిది పేరు కాదు ఒక బ్రాండ్. కరోనా తర్వాత బాలయ్య మారిన విధానం చూస్తుంటే ఏ హీరోకైనా కుళ్ళు రాక మానదు. అంతకు ముందు వరకు కనీసం 30 కోట్ల మార్కెట్ కూడా లేని బాలకృష్ణ ఇప్పుడు ఏకంగా 100 కోట్లు ఈజీగా వసూలు చేసే స్థాయికి వెళ్లిపోయాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 26, 2025 | 08:30 PMLast Updated on: Apr 26, 2025 | 8:30 PM

Balakrishna Serious Mode

నందమూరి బాలకృష్ణ.. ఇప్పుడిది పేరు కాదు ఒక బ్రాండ్. కరోనా తర్వాత బాలయ్య మారిన విధానం చూస్తుంటే ఏ హీరోకైనా కుళ్ళు రాక మానదు. అంతకు ముందు వరకు కనీసం 30 కోట్ల మార్కెట్ కూడా లేని బాలకృష్ణ ఇప్పుడు ఏకంగా 100 కోట్లు ఈజీగా వసూలు చేసే స్థాయికి వెళ్లిపోయాడు. ఆయన సినిమాలకు టాక్ తో పని లేకుండా తొలి మూడు నాలుగు రోజుల్లోనే 100 కోట్లు గ్రాస్ వచ్చేస్తోంది. సినిమా బాగుంది అంటే మరో 50 కోట్లు అదనం. అఖండ తర్వాత బాలయ్య కెరీర్ పూర్తిగా మారిపోయింది. అప్పటి నుంచి చిన్న కూతురు తేజస్విని కథల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడంతో.. 60 తర్వాత అసలైన ఉగ్రరూపం చూపిస్తున్నాడు బాలయ్య. ప్రస్తుతం ఈయన ఫ్యాన్స్ ఆశలన్నీ అఖండ 2పైనే ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుంది. నెక్స్ట్ షెడ్యూల్ జార్జియాలో ప్లాన్ చేస్తున్నాడు బోయపాటి. అక్కడే కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించబోతున్నాడు. బాలయ్యతో పాటు మిగిలిన కీలక నటీనటులు కూడా ఈ షెడ్యూల్ కోసం జార్జియా వెళ్తున్నారు.

సింహా, లెజెండ్, అఖండ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత బోయపాటి-బాలయ్య కాంబినేషన్లో వస్తున్న 4వ సినిమా ఇది. దీనిపై ఉన్న అంచనాలు చూస్తుంటే మొదటి రోజే ఈజీగా 100 నుంచి 150 కోట్లు వసూలు చేసేలా కనిపిస్తుంది. ఈ సినిమా బడ్జెట్ 150 కోట్లు.. ఆలోచన కూతురు తేజస్వినితో కలిసి 14 రీల్స్ అఖండ 2ను అత్యంత భారీగా నిర్మిస్తున్నారు. ఇందులో మరీ ముఖ్యంగా 3 సీక్వెన్స్ ల గురించి గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. అందులో మొదటిగా చెప్పుకోవాల్సింది బాలయ్య ఎంట్రీ సీన్.. దీనికోసం రామోజీ ఫిలిం సిటీలో దాదాపు 1000 మంది అఘోరాల మధ్య ఈ సీన్ షూట్ చేశాడు బోయపాటి. అఖండ 2లో మరో హైలెట్ సీక్వెన్స్ ఇంటర్వెల్. మామూలుగానే తన ఇంటర్వెల్ బ్లాక్స్ చాలా భారీగా ప్లాన్ చేస్తుంటాడు బోయపాటి. అఖండ 2 కోసం కుంభమేళా వెళ్లి అక్కడ ఈ సీన్స్ షూట్ చేశాడు ఈ దర్శకుడు. అలాగే ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ఎపిసోడ్ గురించి కూడా మరో 10 ఏళ్ల పాటు మాట్లాడుకుంటారని నమ్మకంగా చెప్తున్నారు దర్శక నిర్మాతలు.

అఖండలో చిన్న పాపను వదిలి వెళ్ళేటప్పుడు.. నీకు ఏ సమస్య వచ్చినా నన్ను పిలిస్తే వెంటనే వచ్చేస్తాను అని మాట ఇచ్చి వెళ్తాడు బాలయ్య. సీక్వెల్ కథ కూడా ఇదే. ఆ పాపకు వచ్చిన సమస్యను బాలకృష్ణ వచ్చి ఎలా తీరుస్తాడు అనేది కథ. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ మీద కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. సెప్టెంబర్ 25న ఈ సినిమా విడుదల కావడం కష్టమని.. ఇంకా షూటింగ్ చాలా బ్యాలెన్స్ ఉండడంతో సంక్రాంతికి వెళ్లిపోయింది అని ప్రచారం జరిగింది. కానీ అలాంటిదేం లేదు.. చెప్పినట్టుగానే సినిమా సెప్టెంబర్ 25న విడుదల కానుంది అంటూ మరోసారి కన్ఫర్మ్ చేశారు దర్శక నిర్మాతలు. అదే రోజు సాయి ధరమ్ తేజ్ సంబరాల ఏటిగట్టు విడుదల కానుంది. ఇక పవన్ కళ్యాణ్ ఓజీ కూడా అదే సమయంలో రానుంది. ఒకవేళ పవన్ వస్తే మేనల్లుడు సైడ్ ఇస్తాడు.. కానీ బాలయ్య మాత్రం అస్సలు తగ్గేదేలే అంటున్నాడు. ఎవరిచినా అఖండ 2 మాత్రం అనుకున్న టైంకి విడుదల అవుతుంది అని గట్టిగా చెప్తున్నారు మేకర్స్. ఈ లెక్కన సినిమా మీద వాళ్లకు ఎంత నమ్మకం ఉందో అర్థమవుతుంది.