TOP STORY:ఎవరీ స్లీపర్ సెల్స్..? వీళ్ళేం చేస్తారు..?

పెద్ద పెద్ద ఈవెంట్స్ కు వెళుతున్నారా.. కేన్సిల్ చేసుకోండి. మీ ఇంట్లో ఫంక్షన్ అయితే భారీగా చేసుకోకండి.. ఎక్కువమందిని పిలవకండి.. లిమిటెడ్ గా చేసుకోండి. టూర్లు, పిక్నిక్ అంటూ పిల్లలను పంపిస్తున్నారా.. పంపకపోవడమే బెటర్.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 26, 2025 | 10:07 PMLast Updated on: Apr 26, 2025 | 10:07 PM

More Attacks With Sleeper Cells

పెద్ద పెద్ద ఈవెంట్స్ కు వెళుతున్నారా.. కేన్సిల్ చేసుకోండి. మీ ఇంట్లో ఫంక్షన్ అయితే భారీగా చేసుకోకండి.. ఎక్కువమందిని పిలవకండి.. లిమిటెడ్ గా చేసుకోండి. టూర్లు, పిక్నిక్ అంటూ పిల్లలను పంపిస్తున్నారా.. పంపకపోవడమే బెటర్. ఎందుకంటే వార్ బెల్స్ తో పాటు.. డేంజర్ బెల్స్ కూడా మోగుతున్నాయి.. వింటున్నారా? సిట్యుయేషన్ సెన్సిటివ్ గా మారిపోతుంది. ప్రతి రోజూ టెన్షన్ పడాల్సిన పరిస్దితి వస్తోంది. ఉగ్రదాడుల వల్ల ఈ పరిస్ధీతి వచ్చింది. భారత్ ఉగ్రవాదాన్ని ఏరిపారేయక తప్పని పరిస్ధితి.. దానిని పోషిస్తున్న పాకిస్తాన్ మీద విరుచుకుపడక తప్పదు. అయితే అది ఎలా చేస్తారు.. ఏంటనేది ఇంకా చెప్పటం లేదు. పాకిస్తాన్ కు అందేవాటన్నిటిని అయితే కట్ చేసేస్తున్నారు. సింధూ జలాలతో పాటు.. ఇతర విషయాల్లోనూ ఆంక్ష విధించారు. కాని పాకిస్తాన్ దీనికి నెగటివ్ గానే స్పందిస్తోంది. ఉగ్రవాది హఫీజ్ సయీద్ అయితే.. సింధు జలాలు ఆపితే నెత్తురు పారిస్తాం అంటూ హెచ్చరించాడు. అంటే ఏం చేస్తాడు? ఏం చేయగలడు? ఇదే చర్చ మొదలైంది.
భారత్ సీరియస్ గా అన్నీ చకచకా చేసుకుంటూ పోతోంది. మరోవైపు పాక్, అలాగే ఉగ్రవాదులు కూడా రెచ్చగొడుతున్నారు. దీంతో భారత్ సరిహద్దుల్లో పాక్ ఆక్రమిత కాశ్మీర్ పై దాడికి సన్నద్ధమవుతుందనే వార్తలు వస్తున్నా… మరోవైపు ఉగ్రవాదులు భారత్ లో మరిన్ని దాడులు ఏమైనా చేస్తారా అనే సందేహం పట్టి పీడిస్తోంది. ఎందుకంటే ఉగ్రవాదులు పాక్ నుంచి చొరబడటం ఒక రకం.. కాని ఆల్రెడీ ఇక్కడే ఉన్నవారిని ఉగ్రవాదులుగా చాలామందిని మార్చేశారన్నది అందరికీ తెలిసిందే. ఇప్పుడు అలాంటి వాళ్లు ఎక్కడ ఎంతమంది ఉన్నారు..? వారిని గుర్తించడం ఎలా? ఇప్పుడు వాళ్లు పాకిస్తాన్ నుంచి వచ్చిన డైరెక్షన్ ప్రకారం యాక్షన్ ప్లాన్ కు దిగితే మన పరిస్దితి ఏంటి?

హుస్సేన్ థోకర్ అనేవాడు స్టూడెంట్ వీసా మీద పాక్ వెళ్లి.. ఆరు నెలలు ట్రైనింగ్ తీసుకుని.. తనతో పాటు మరో ఐదుగురిని తీసుకుని ఇండియాలో అడుగుపెట్టాడు. 26 మందిని చంపిన ఆ ఉగ్రదాడికి ప్లాన్ చేసి అమలు చేసింది ఇతనే అంటున్నారు. పాక్ ప్రభుత్వం విచారణకు సహకరిస్తామంటూ సన్నాయి నొక్కులు నొక్కుతోంది. మరోవైపు హఫీజ్ సయీద్ వార్నింగులు ఇస్తున్నాడు. ఈ పరిస్ధితుల్లో భారత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది కీలకంగా మారింది.
గతంలో కూడా హైదరాబాద్, ముంబై, అహ్మదాబాద్, నాగపూర్ ఇలాంటి చోట్ల ఉగ్రదాడులు జరిగాయి. బాంబులు పేల్చారు కూడా. ఇండియాలో స్లీపర్ సెల్స్ కూడా ఎక్కువ. ఇప్పుడు ఆ స్లీపర్ సెల్స్ యాక్టివేట్ అయిపోతే మన సిట్యుయేషన్ ఏంటి? అంటే భారత్ అటు సరిహద్దులతో పాటు.. దేశం లోపల కూడా పోరాడాల్సి ఉంటుంది.స్లీపర్ సెల్స్ యాక్టివేట్ అయితే.. బాంబు పేలుళ్లు జరిగే అవకాశం ఉంది. ఎప్పుడు ఎక్కడ నుంచి విరచుకుపడతారో తెలియదు.

మరోవైపు సింధు జిలాలు ఆగిపోవడం వలన.. పాక్ ప్రజలకు తీవ్రమైన నష్టం జరుగుతుంది. నీళ్లు దొరక్క అల్లాడిపోయే పరిస్ధితి వస్తోంది. అదే జరిగితే.. పాక్ లో ఉన్న సంప్రదాయవాదులు చెలరేగిపోతారు. ఇండియాపై దాడులు జరపాలని పట్టుబడతారు. అప్పుడు ఉగ్రవాదులు స్లీపర్ సెల్స్ ని యాక్టివేట్ చేస్తారు. మన ఖర్మ ఏంటంటే ఈ స్లీపర్ సెల్స్ ఎక్కడ ఉన్నారో తెలియదు. ఇప్పుడు పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చినవాళ్లు అక్రమంగా కొన్నిచోట్ల ఉంటున్నారన్నది వాస్తవం. పాక్ వీసాలు రద్దు చేసేశారు.. వాళ్లని వెనక్కి పొమ్మంటున్నారు. అలా ఎలా అంటూ అప్పుడే కొన్ని గొంతులు వినపడుతున్నాయి. ఇక అక్రమంగా ఉండేవారిని త్వరలోనే ఏరివేత కార్యక్రమంతో గుర్తిస్తారని అంటున్నారు. వీటన్నిటితో ఆ వర్గంలో అసంతృప్తి పెరిగే ఛాన్స్ ఉంది. ఆ అసంతృప్తిని క్యాష్ చేసుకుని ఉగ్రవాద సంస్ధలు.. అమాయకులను సైతం ఉగ్రవాదులుగా మార్చేస్తారు. అప్పుడు స్లీపర్ సెల్స్ మరింత పెరుగుతాయి. ఇలా భారత్ లోపల, సరిహద్దులో వ్యూహ ప్రతి వ్యూహాలతో పాక్ కుట్రలను అణచివేయడం అనే టాస్స్ అంత ఈజీ కాదు. కాని ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అనే మాట వస్తోంది. ఇప్పటికైనా ముందుకు కదిలి.. ఉగ్రవాదుల ఆనవాళ్లను గుర్తించి.. ఏరిపారేయాలనే డిమాండ్ వస్తోంది.