బ్రేకింగ్:ఇరాన్‌లో భారీ పేలుడు, స్పాట్‌లో 400 మంది
దక్షిణ ఇరాన్‌లోని బందర్ అబ్బాస్ నగరంలో ఉన్న షహీద్ రాజయీ పోర్టులో భారీ పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఏకంగా 400 మంది గాయపడ్డట్టు తెలుస్తోంది. ఇరాన్, అమెరికాల మధ్య ఒమన్‌లో మూడో విడత అణు చర్చలు ప్రారంభమైన

దక్షిణ ఇరాన్‌లోని బందర్ అబ్బాస్ నగరంలో ఉన్న షహీద్ రాజయీ పోర్టులో భారీ పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఏకంగా 400 మంది గాయపడ్డట్టు తెలుస్తోంది. ఇరాన్, అమెరికాల మధ్య ఒమన్‌లో మూడో విడత అణు చర్చలు ప్రారంభమైన సమయంలోనే ఈ పేలుడు జరిగడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ ప్రమాదానికి అసలు కారణం ఏంటనేదానిపై ఎలాంటి స్పష్టత రాలేదు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలిస్తున్నారు. షహీద్ రాజయీ పోర్టులో నిల్వ ఉన్న కొన్ని కంటైనర్లు పేలడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.
భారీగా మంటలు చెలరేగిన కారణంగా పోర్ట్ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశారు. అక్కడ పనిచేసే ఉద్యోగుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో గాయపడిన వాళ్లతో పాటు మరణించే వారి సంఖ్య పెరిగే అవకాశం ఉంది. పేలుడు తీవ్రతతో దాదపు కిలో మీటర్ పరిధిలో గల భవనాల కిటికీలు ధ్వంసమయ్యాయి. పేలుడుకి సంబంధించిన వీడియోల్లో పెద్ద ఎత్తున పొగ ఆకాశాన్ని కమ్ముకోవడం కనిపించింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. ఇది ప్రమాదమా ? లేదా ఎవరైనా దాడి చేశారా.? అన్న వివరాలు తెలియాల్సి ఉంది.