పాక్ మీడియాలో సిద్దరామయ్యపై కథనాలు, ఉగ్రదాడిపైనా రాజకీయాలు చేస్తోంది ఎవరు?

ఒకరు 26 మంది హిందువులను అత్యంత దారుణంగా చంపిన ఉగ్రవాదుల్ని అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులో విచారించాలంటారు. ఇంకొకరు పాక్‌పై యుద్ధం చేయాల్సిన అవసరమే లేదంటారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 28, 2025 | 11:20 AMLast Updated on: Apr 28, 2025 | 11:20 AM

Who Is Doing Politics Over Articles Against Siddaramaiah And Terror Attacks In Pakistani Media

ఒకరు 26 మంది హిందువులను అత్యంత దారుణంగా చంపిన ఉగ్రవాదుల్ని అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులో విచారించాలంటారు. ఇంకొకరు పాక్‌పై యుద్ధం చేయాల్సిన అవసరమే లేదంటారు. మరొకరు కాల్పులు జరిపిన వ్యక్తి కులం, మతం అడుగుతాడా అని ప్రశ్నిస్తారు. వీరంతా ఒకే పార్టీ నేతలు. ఔను.. వందేళ్లకు పైగా హిస్టరీ ఉన్న హస్తం పార్టీ లీడర్ల స్టేట్మెంట్లే ఇవి. ఆ ఓపెన్ స్టెట్మెంట్లే ఇప్పుడు తీవ్ర వివాదానికి దారి తీస్తున్నాయి. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య వ్యాఖ్యలను పాకిస్తాన్ మీడియా హైలైట్ చేసి చూపిస్తోందంటేనే శత్రువులకు ఎంత అలుసిస్తున్నామో అర్ధం చేసుకోవచ్చు. ఇంతకూ, పహల్గామ్ ఉగ్ర దాడిపై 140 కోట్ల మంది భారతీయులు ఒకే మాట మీద ఉన్న వేళ.. వ్యక్తిగత అభిప్రాయతాలతో కాంగ్రెస్ లీడర్లు వివాదాలు ఎందుకు కొనితెచ్చుకుంటున్నారు? సిద్దరామయ్య వ్యాఖ్యల్ని పాక్ మీడియా ఎందుకు

2023 అక్టోబర్ 7.. హమాజ్ ఉగ్రమూకలు ఇజ్రాయెల్‌లో చొరబడి విధ్వంసం సృష్టించిన రోజు. 2023 అక్టోబర్ 8.. ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకునే అంశంపై టెల్‌అవీవ్‌లో అఖిల పక్ష సమావేశం నిర్వహించారు. దానికి ఇజ్రాయెల్‌లోని అన్ని రాజకీయ పార్టీల లీడర్లూ హాజరయ్యారు. వారందరూ ఒకే మాట మీద నిలబడ్డారు. శత్రువు ఇంతకింత అనుభవించాల్సిందే అని తేల్చి చెప్పారు. ఇజ్రాయెల్ ఎక్స్ పీఎం స్వయంగా తుపాకీ చేతపట్టి యుద్ధంలోకి దిగాడు. రిజల్ట్ ఏంటో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. గాజా ధ్వంసమైంది, హమాస్ ఆల్మోస్ట్ అంతమైపోయింది. దేశానికి కష్టం వచ్చినప్పుడు అందరి చేతులు కలిస్తే రిజల్ట్ ఇలా ఉంటుంది. పహల్గామ్ ఉగ్రదాడి రూపంలో ఇప్పుడు మన దేశానికీ అలాంటి కష్టమే వచ్చింది. ఢిల్లీలో అఖిల పక్ష సమావేశం కూడా జరిగింది. అన్ని పార్టీలూ మా మద్దతు ఉంటుందని కేంద్రానికి తెలి పాయి కూడా. కానీ, సింధు ఒప్పందంపై అసదుద్దీన్ ఓవైసీ అప్పుడే ప్రశ్నలు మొదలుపెట్టారు. కాంగ్రెస్ లీడర్ల ముగరించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. దానికి కర్ణాటక సీఎం సిద్దరామయ్య తీరే ఉదాహరణ.

26 మంది హిందువులను ఊచకోత కోశారు. దీనికి ప్రతీకారంగా 140 కోట్ల మంది భారతీయులు పాకిస్తాన్‌ను నామరూపాలు లేకుండా చేయాలని కోరుకుంటున్నారు. కానీ, కన్నడ సీఎం సిద్దరామయ్యకు మాత్రం పహల్గామ్ ఉగ్రదాడికి అంతపెద్ద ప్రతీకారం అవసరం లేదు. పాకిస్తాన్‌పై యుద్ధం చేయాల్సిన అవసరం లేదని స్వయంగా ప్రకటించాడు. సకఠినమైన భద్రతా చర్యలుచేపట్టాలి. మేం యుద్ధానికి అనుకూలం కాదు. శాంతి ఉండాలి. ప్రజలు సురక్షితంగా ఉండాలి. కేంద్ర ప్రభుత్వం సమర్థవంతమైన భద్రతా ఏర్పాట్లు చేయాలన్నారు. సిద్దు వ్యాఖ్యలు ఇప్పుడు పాకిస్తాన్ వరకూ వెళ్లాయి. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య వ్యాఖ్యలను జియో న్యూస్‌తో సహా పాకిస్తాన్ మీడియా కవర్ చేసింది. ‘భారత్‌లో యుద్ధానికి వ్యతిరేకంగా స్వరాలు’ అన్న హెడ్డింగ్‌తో వార్తలు ప్రసారం చేశాయి.

ఇక్కడే బీజేపీ సీన్‌లోకి వచ్చింది. కర్ణాటక బీజేపీ చీఫ్ బీవై విజయేంద్ర.. సిద్దరామయ్యపై మండిపడ్డారు. ‘సిద్దరామయ్యకు సరిహద్దుల నుంచి పెద్ద చీర్స్! పాకిస్తానీ మీడియా సిద్దరామయ్యను ప్రశంసించింది’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు. పాక్‌ మీడియా వీడియో క్లిప్‌ను షేర్‌ చేశారు. మరోవైపు తన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపడంతో సీఎం సిద్ధరామయ్య స్పందించారు. యుద్ధానికి వెళ్లకూడదని తాను ఎప్పుడూ చెప్పలేదన్నారు. పాకిస్తాన్‌తో మనం యుద్ధం చేయకూడదని తానెప్పుడూ చెప్పలేదనీ.. యుద్ధం పరిష్కారం కాదని మాత్రమే నేను చెప్పినట్టు వివరించారు. పర్యాటకులకు రక్షణ కల్పించాలి అన్న సిద్దరామయ్య.. పహల్గామ్ దాడిలో ఇంటెలిజెన్స్ వైఫల్యం ఉందని విమర్శించారు. యుద్ధానికి సంబంధించినంత వరకు, అది అనివార్యమైతే, మనం యుద్ధానికి దిగాలని అన్నారు. ఇప్పుడు యుద్ధం అనివార్యం అని దేశం మొత్తం భావిస్తోంది. ఒక్క సిద్దరామయ్య తప్ప. ఈ వ్యవహారం ఇక్కడితో అయిపో లేదు. అదే కర్ణాటక నుంచి మరో నేత వివాదాన్ని రేపారు.

ఈయన పేరు ఆర్బీ తిమ్మాపూర్, కర్ణాటక ఎక్సైజ్శాఖ మంత్రి. తుపాకులతో కాల్చుతున్న వ్యక్తి కులం, మతం అడుగుతాడా..? అన్నది ఇతడి వాదన. ఉగ్రవాదులు కాల్చి వెళ్లిపోతారు తప్ప నిలబడి మతాన్ని అడగడు అనే తేల్చేశారు. ఈ దారుణమైన దాడిపై దేశం కలత చెందుతోందంటూనే, దీనిని మతపరమైన సమస్యగా చిత్రీకరించడానికి కుట్ర జరుగుతోందని మంత్రి ఆరోపించాడు. “వారు ఉగ్రవాద దాడి చేస్తున్నప్పుడు మతం అడగలేదని నేను భావిస్తున్నాను. వారు అలా చేస్తే, మతం ఆధారంగా సమస్యను రాజకీయం కాకూడదని చెప్పుకొచ్చాడు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ అధికార ప్రతినిధి సీఆర్ కేశవన్ తీవ్రంగా స్పందించారు. కర్ణాటక కాంగ్రెస్ మంత్రి తిమ్మాపూర్ అనాగరికమైన, దుష్టమై వ్యాఖ్యలు బాధిత కుటుంబాల సమగ్రతను అవమానించాయని అన్నారు. ఇలాంటి సమయంలో కూడా మతపరమైన, తన ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మనస్సాక్షిని తాకట్టు పెట్టి, మతతత్వ కాంగ్రెస్ పార్టీ వ్యాపారం చేస్తుం దని దుయ్యబట్టారు. ఒక్క కర్ణాటక నేతలే కాదు.. ఇటీవల కాంగ్రెస్ సీనియర్ మోస్ట్ లీడర్ కపిల్ సిబల్ సైతం ఉగ్రవాదులను అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులో విచారించాలన్నారు.

2023 అక్టోబర్ 7హమాస్ దాడి, 2025 ఏప్రిల్ 22 పహల్గామ్ దాడి సిమిలర్‌గా ఉన్నాయి. కానీ, రెండు దేశాల పాలకులు ఒకేలాగా లేరు. ఉంటే మన శత్రువులకు చులకన అయ్యే ప్రకటనలు మాని ఎనిమీ అంతుచూసే సలహాలు, సూచనలు ఇచ్చేవారు. ఇజ్రాయెల్‌ లీడర్లకు, ఇండియన్ పొలిటీషియన్లకి ఇదే తేడా.