Top story:భారత్‌పై అణు దాడి బెదిరింపులు పాక్ దగ్గర అణ్వస్త్రాలుంటే… భారత్ దగ్గరున్నవి దీపావళీ టపాసులా?
అరిచే కుక్క కరవదన్న సామెత పాకిస్తాన్‌కు తెలుసో లేదో కానీ, ఇండియాపై రోజుకో కుక్క అరుస్తూనే ఉంటోంది. నిన్నటికి నిన్న సింధూ నదిలో రక్తం పారిస్తామంటూ బిలావల్ భుట్టో రెచ్చిపోతే..

అరిచే కుక్క కరవదన్న సామెత పాకిస్తాన్‌కు తెలుసో లేదో కానీ, ఇండియాపై రోజుకో కుక్క అరుస్తూనే ఉంటోంది. నిన్నటికి నిన్న సింధూ నదిలో రక్తం పారిస్తామంటూ బిలావల్ భుట్టో రెచ్చిపోతే.. ఇప్పుడు హనీఫ్ అబ్బాసీ అణు హెచ్చరికలు చేసి రెచ్చిపోయాడు. 130 అణ్వాయుధాలను భారత్‌వైపు తిప్పి రెడీగా ఉంచాడట. ఒక్క బటన్ నొక్కితే భారత్ ధ్వంసమైపోతుందట. పాక్ దగ్గర ప్రపంచంలోనే పవర్ ఫుల్ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయట. పాకిస్తాన్ దగ్గర అణ్వాయుధాలుంటే మరి భారత్ దగ్గర ఉన్నవి ఏంటి.. దీపావళి టపాసులా? ఇంత చిన్న లాజిక్ పాకిస్తాన్ రైల్వే మంత్రి ఎలా మిస్ అయ్యాడు? అసలు ఇదంతా కాదు.. పాకిస్తాన్ దగ్గర నిజంగా న్యూక్లియర్ బాంబులు ఉన్నాయా? లేదంటే చైనా డమ్మీ బాంబులను అణ్వస్త్రాలుగా భ్రమపడుతోందా? టాప్ స్టోరీలో చూద్దాం..
ఇతడి పేరు హనీఫ్ అబ్బాసి, నవాజ్ పార్టీ ‘పాకిస్తాన్ ముస్లిం లీగ్’ నేత, జమాతే ఇ ఇస్లామీ సభ్యుడిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి ప్రస్తుతం పాకిస్తాన్ రైల్వే మంత్రిగా పదవి వెలగబెడుతున్నా డు. 2012లో 500 కిలోల ఎఫెడ్రిన్ డ్రగ్స్‌ను దుర్వినియోగం చేశాడనే ఆరోపణలతో ఎఫ్ఐఆర్ కూడా నమోదైన క్రిమినల్ పొలిటీషియన్. ఇక హనీఫ్ ఏమన్నాడు అన్న అంశానికొస్తే.. భారత్ సింధు జలాలను నిలిపివేస్తే, తాము తగిన సమాధానం ఇస్తామనేది ఇతగాడి ఆవేశపూరిత ప్రసంగానికి అర్ధం. అక్కడే హద్దుమీరాడు. తమ దగ్గర అణ్వస్త్రాలు ఉన్నాయనీ, భారత్‌వైపు వెళుతున్నాయనీ.. మోడీ సర్కార్ ఏదైనా సాహసోపేత నిర్ణయం తీసుకుంటే దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందనీ హెచ్చరించాడు.
పాకిస్తాస్తాన్ దగ్గర ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అణు బాంబులు ఉన్నాయట.. గోరీ, షాహీన్, ఘజ్నవి వంటి క్షిపణులతో పాటు 130 అణు బాంబులను భారతదేశం కోసమే ఉంచుకున్నామని హనీఫ్ అబ్బాసి రెచ్చిపోయాడు. పాకిస్తాన్ సరిహద్దులను రక్షించుకోవడానికి తమ దేశ ప్రభుత్వం పూర్తి సన్నాహాలు చేస్తున్నట్లు పేర్కొన్నాడు. పహల్గామ్ దాడి, భారత్ సింధు జల ఒప్పందాన్ని రద్దు చేయాలని ఎప్పటి నుంచో ప్లాన్ చేసిన కారణంగా జరిగిన ఒక సాకు మాత్రమేనని ఆయన ఆరోపించాడు. అంతేకాదు, పాకిస్తాన్ రైల్వేలు, సైన్యానికి అవసరమైనప్పుడు సాయం చేయడానికి ఎప్పటికైనా సిద్ధంగా ఉంటాయని ప్రకటించాడు. పాకిస్తాన్ సైన్యానికి అవసరమైనప్పుడు రైల్వేలను ఉపయోగించుకోవచ్చన్నాడు. నిజం ఏంటంటే ఇటీవల జాఫర్ ఎక్స్‌ప్రెస్ హైజాక్ తర్వాత పాకిస్తాన్ సైనికులు రైలు ప్రయాణాలంటేనే వణికి పోతున్నారు. సరే ఆ వాదన పక్కనపెడితే.. పాకిస్తాన్ లీడర్లు అణ్వాయుధాలను చూపించి బెదిరించడం ఇదే తొలిసారి కాదు.. గతంలోనూ హద్దుమీరారు. అందుకే, ప్రధాని మోడీ ఒక సందర్భంలో మీ దగ్గర అణు ఆయుధాలుంటే మరి మా దగ్గర ఉన్నవేంటని ప్రశ్నిస్తూ పాక్ ఇజ్జత్ తీసేశారు.
2019లో పాకిస్తాన్ పాలకులపై మోడీ వేసిన సెటైరే ఇది. పాకిస్తాన్ దగ్గర అణ్వస్త్రాలుంటే మరి మన దగ్గరున్నవేంటి? దీవాలీ టపాసులా? అని ప్రశ్నించారు. నిజానికి.. పాక్ తన స్థాయికి మించి భారత్‌తో కయ్యానికి కాలు దువ్వడానికి కూడా కేవలం అణ్వాయుధాలున్నాయన్న దైర్యమే. కానీ, ఆ అణ్వస్త్రాలకు నిజంగా అంత పవర్ ఉందా అన్న ప్రశ్నలుకూడా ఉన్నాయి. ఎందుకంటే, సొంతంగా ఒక్క మందుగుండు
సామాగ్రి కూడా తయారు చేసుకోలేని పాక్.. అత్యంత కష్టమైన అణ్వాయుధాలను తయారు చేసిందంటే నమ్మడం చాలా కష్టం. భారత్ అణుపరీక్షలు చేసినప్పుడే.. పాకిస్తాన్ కూడా చేసింది. పాకిస్తాన్ చేసిందని చెప్పడం కన్నా.. పాకిస్తాన్ పేరుతో చైనా చేసిందని అనుకోవచ్చు. అంటే చైనా అణ్వాయుధాలే పాకిస్తాన్ వద్ద ఉంటాయి. అప్పట్నుంచి తమది అణ్వస్త్రదేశమేనని పాకిస్తాన్ చెప్పుకుంటోంది.
పాకిస్తాన్ 1998 మే 28న తన మొదటి అణు పరీక్షలను బలూచిస్తాన్‌లోని చాగై హిల్స్‌లో నిర్వహించింది. ఈ పరీక్షలను “చాగై-I”అని పిలిచారు. మే 30న మరో పరీక్ష, “చాగై-II”పేరిట చేశారు. మొత్తం ఐదు అణ్వస్త్ర పరీక్షలు జరిగాయని పాకిస్తాన్ ప్రకటించుకుంది, ఇవి 10-50 కిలోటన్నుల శక్తిని విడుదల చేశాయని చెప్పింది. ఈ పరీక్షలతో పాకిస్తాన్ అధికారికంగా అణ్వాయుధ శక్తిగా అవతరించింది.
2023 నాటికి అంతర్జాతీయ నివేదికల ప్రకారం పాక్ సుమారు 160 నుంచి 170 అణ్వాధాలను కలిగి ఉందని అంచనా. వాటిలో 130 బాంబులను భారత్‌వైపు తిప్పి పెట్టామని అబ్బాసి చెప్పాడు. మిగిలినవి ఎక్కడ పెట్టుకున్నాడో మరి. ఆ సంగతి అటుంచి.. పాకిస్తాన్ అణ్వాయుధాలపై అనుమానాలు ఎందుకు అన్న ప్రశ్నకి వద్దాం. ఈ ప్రశ్నకు సమాధానం చైనాతో లింకై ఉంటుంది. ఎందుకంటే పాకిస్తాన్ అణ్వస్త్ర అభివృద్ధిలో చైనా హస్తం ఉంది కాబట్టి.
1980ల నుంచి పాకిస్తాన్ అణ్వాయుధాలు అభివృద్ధిలో చైనా సాంకేతిక సహకారం అందించింది. అణ్వాయుధ డిజైన్ సమాచారంతో పాటు 1960లలో చైనా పరీక్షించిన కొన్ని అణ్వస్త్ర డిజైన్లను పాకిస్తాన్‌కు బదిలీ చేసిందని నివేదికలు తేల్చాయి. అణు రియాక్టర్ల నిర్మాణంలో, ముఖ్యంగా ప్లూటోనియం ఉత్పత్తికి అవసరమైన సాంకేతికతలో చైనా సహకారం అందించింది. న్యూక్లియర్ వెపన్స్ తయారీకి అవసరమైన మెటీరియల్ సప్లై, మిస్సైల్ టెక్నాలజీ కూడా అందించింది. పాకిస్తాన్ దగ్గరున్న షాహీన్ సిరీస్ బాలిస్టిక్ క్షిపణులను చైనా డాంగ్‌ఫెంగ్ క్షిపణుల ఆధారంగానే తయారు చేశారంటారు. ఇలా పాకిస్తాన్ అణ్వాయుధాల తయారీలో అనధికారికంగా చైనా పాత్ర చాలా పెద్దది. చైనా సాంకేతికతతో అణు బాంబుల తయారీ అంటే అవి డమ్మీ బాంబులతో సమానం అంటారు రక్షణ నిపుణులు. వాటిని చూసుకొని భారత్‌ను బెదిరించడం అంటే కొరివితో తలగోక్కోవడమే. మరి భారత్ దగ్గరున్న అణ్వస్త్రాలో అంటారా.. వాటి పవర్ ఏంటో అందరికంటే మన శత్రువుకే బాగా తెలుసు.