పెహల్గాం ఎటాక్ ప్లాన్ చేసింది వీడే
పహల్గామ్ ఉగ్రదాడి వెనుక లష్కరే తోయిబాకు చెందిన క్రియాశీల శిబిరం ఉందని భారత నిఘా వర్గాలు గుర్తించాయి.

పహల్గామ్ ఉగ్రదాడి వెనుక లష్కరే తోయిబాకు చెందిన క్రియాశీల శిబిరం ఉందని భారత నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ ఉగ్ర శిబిరం నుంచి విదేశీ ఉగ్రవాదులు పహల్గామ్ దాడికి వచ్చారని, వీరికి స్థానిక మిలిటెంట్లు సాయంగా నిలిచారని పేర్కొన్నాయి.
ఆ ఉగ్ర మాడ్యూల్ కు లష్కరే చీఫ్ హఫీజ్ సయీద్, అతడి డిప్యూటీ సైఫుల్లా సూత్రధారులుగా ఉన్నట్లు సమాచారం. పాకిస్థాన్ నుంచి వారు దాన్ని ఆపరేట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.