Top story: భారత్‌కు మద్దతుగా రంగంలోకి మొస్సాద్, పాకిస్తాన్‌కు కౌంట్‌డౌన్ స్ట్రార్ట్ అయినట్టేనా?
పహల్గామ్ ఉగ్రదాడి వెనుక హమాస్ హస్తం ఉందా? ఫిబ్రవరి 5నే భారత్‌పై దాడికి వ్యూహ రచన చేశారా? భారత్‌కు మద్దతుగా మొస్సాద్ సీన్‌లోకి దిగనుందా?

పహల్గామ్ ఉగ్రదాడి వెనుక హమాస్ హస్తం ఉందా? ఫిబ్రవరి 5నే భారత్‌పై దాడికి వ్యూహ రచన చేశారా? భారత్‌కు మద్దతుగా మొస్సాద్ సీన్‌లోకి దిగనుందా? ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే ఔననే సమాధానమే వినిపిస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడి, అక్టోబర్ 7 దాడికి దగ్గర ఉందని భారత్‌లోని ఇజ్రాయెల్ రాయబారి చెప్పారు. ఇదే సమయంలో మోడీ, నెతన్యాహు ఫోన్‌లో మాట్లాడుకున్నారు. ఆ సమయంలో మీరు ఏ నిర్ణయం తీసుకున్నా తమ పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. ఇక్కడే మొస్సాద్ సీన్‌లోకి రాబోతోందన్న చర్చ మొదలైంది. ఇంతకూ, ఫిబ్రవరి 5వ తేదీన పీవోకేలో ఏం జరిగింది? పహల్గామ్ దాడి వెనుక హమాస్ హస్తముందని అంత కాన్ఫిడెంట్‌గా ఎలా చెబుతున్నారు? ఈ మొత్తం ఎపిసోడ్‌లో మొస్సాద్ ఏం చేయబోతోంది? టాప్ స్టోరీలో చూద్దాం..
పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని రావల్‌కోట్‌లో జరిగిన కశ్మీర్ సొలిడారిటీ అండ్ అల్ అక్సా ఫ్లడ్స్ సభలో ఖలీద్ చేసిన కన్నింగ్ కామెంట్స్ ఇవి. పాలస్తీనా ముజాహిదీన్‌లు, కశ్మీర్‌లోని ముజాహిదీన్‌లు ఇప్పుడు ఏకమయ్యారనీ.. న్యూఢిల్లీలో రక్తం చిందించాల్సిన సమయం వచ్చిందనీ.. కశ్మీర్‌ను భారత్ నుంచి వేరు చేయాలని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇదే సభ సాక్షిగా జైషే మహమ్మద్, లష్కరే తోయిబా, హమాస్ సంస్థలు ఒక్కటైనట్టు ప్రకటించాడు. పాక్ ఏటా ఫిబ్రవరి 5న కశ్మీర్ సంఘీభావ దినోత్సవాన్ని పాటిస్తుంది. ఈ కార్యక్రమం అసలు లక్ష్యం భారత వ్యతిరేక అజెండాయే. కానీ, ఈసారి హమాస్‌ను ఆహ్వానించి భారత్‌ను సవాల్ చేసింది. పైగా ఆ కార్యక్రమానికి అల్ అక్సా ఫ్లడ్స్ అని పేరు పెట్టి 145 కోట్ల భారత పౌరులను బెదిరించే ప్రయత్నం చేసింది. హమాస్ నేత ఖలీద్ కశ్మీర్‌లో పోరాటాన్ని పాలస్తీనాతో ముడిపెట్టి మాట్లాడొచ్చని ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానించాయి. చివరకు ఖలీద్ అదే చేశాడు. ఇది జరిగి రెండు నెలలు పూర్తి కాకుండానే కశ్మీర్‌లో రక్తపాతం జరిగింది. అది కూడా అక్టోబర్ 7 దాడిని గుర్తు చేసేలా. ఇక్కడే సీన్‌లోకి ఇజ్రాయెల్ ఎంటరైంది.
పహల్గామ్ ఉగ్రదాడిని ప్రపంచమంతా ఖండించింది. కానీ, ఇజ్రాయెల్ మాత్రం చాలా లోతుగా విశ్లేషించింది. ఎందుకంటే ఆ దేశం కూడా ఉగ్రవాద బాధిత దేశమే. పైగా పహల్గామ్ దాడి టెల్ అవీవ్‌లో ఎన్నో ప్రశ్నలు రేకెత్తించింది. చివరకు భారత్‌లోని ఇజ్రాయెల్ రాయబారి ఈ దాడిపై తనకున్న అనుమానాలను బయటపెట్టారు. అక్టోబరు 7 నాటి హమాస్ నరమేధానికి, పహల్గామ్‌లో పర్యాటకులపై ఉగ్రదాడికి సారూపత్య ఉందని భారత్‌లోని ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ పేర్కొన్నారు. ఈ రెండు ఘటనలలో అమాయక పౌరులే లక్ష్యంగా ఉండటాన్ని ఆయన ప్రస్తావిస్తూ.. ఉగ్రవాద సంస్థల మధ్య పెరుగుతున్న సమన్వయంపై హెచ్చరికలు జారీ చేశారు. హమాస్ నేతలు పీవోకే పర్యటనలో జైషే మహమ్మద్ ఉగ్రవాదులతో సమావేశమైనట్టు తమకు సమాచారం ఉన్నట్టు తెలిపారు. అంటే ఫిబ్రవరి 5వ తేదీ నాటి పరిణామాలను మొస్సాద్ మానిటర్ చేసిందన్నమాట. కానీ, హమాస్ పాకిస్తాన్‌నే ఎందుకు ఎంచుకుంది? హమాస్, పాకిస్తాన్ స్నేహంతో ఇజ్రాయెల్‌కు ఎదురయ్యే సవాల్ ఏంటి?
హమాస్ ప్రధాన లక్ష్యం ఇజ్రాయెల్‌ను అంతం చేయడం. కానీ 17 నెలల యుద్ధంలో అది సాధించలేకపోయింది. ఇక్కడే అణ్వాయుధాలు ఉన్న పాకిస్తాన్‌పై హమాస్ కన్నుపడింది. హమాస్‌కు పాక్ ఊరికే సాయం చేయదు. భారత్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు సాయ పడితేనే మద్దతిస్తుంది. ఫిబ్రవరి 5న హమాస్, పాకిస్తాన్ మధ్య అలాంటి ఒప్పందమే జరిగి ఉండొచ్చన్నది ఇజ్రాయెల్ దౌత్య వేత్త అనుమానం. పైగా అక్టోబర్ 7 తరహా దాడులు చేసేందుకు పాక్ ఆక్రమిత కశ్మీర్ భూభాగం సరిగ్గా సరిపోతుంది. ఇవన్నీ చూస్తుంటే ఇజ్రాయెల్ రాయబారి అనుమానాలే నిజమై ఉండొచ్చంటున్నారు విశ్లేషకులు. సరిగ్గా ఇలాంటి టైంలోనే ప్రధాని మోడీ, బెంజిమన్ నెతన్యాహు మధ్య టెలిఫోన్ సంభాషణ జరిగింది. ఈ సందర్భంగా తమ పూర్తి మద్దతు భారత్‌కు ఉంటుందనీ, అది పాకిస్తాన్‌పై దాడి విషయం అయినాసరే అని చెప్పినట్టు తెలుస్తోంది. ఇప్పటికే అమెరికా, రష్యా వంటి దేశాలు భారత్‌కు మద్దతు ప్రకటించాయి. అయితే, ఆ దేశాలు మద్దతివ్వడం, ఇజ్రాయెల్ మద్దతు తెలపడం ఒక్కటి కాదు. ఎందుకంటే ఇజ్రాయెల్ అవసరమైతే భారత్‌కు మద్దతుగా రంగం లోకి దిగడానికి కూడా సిద్ధపడుతుంది. అందుకు ఒకే ఒక్క కారణం పాకిస్తాన్‌తో హమాస్ సంబంధాలే.
పాక్, మమాస్ చేతులు కలిపితే ఇజ్రాయెల్‌కు న్యూక్లియర్ టెన్షన్స్ మొదలవుతాయి.ఇప్పుడు కాకపోయినా హమాస్ ఏదో ఒకరోజు పాకిస్తాన్‌ను మభ్యపెట్టో లేక బెదిరించో అణ్వాయుధాలు సొంతం చేసుకుంటుంది. అదే జరిగితే తొలి దాడి టెల్ అవీవ్‌పైనే చేస్తుంది. ఈ విషయం అందరి కంటే ఎక్కువ నెతన్యాహుకే తెలుసు. అందుకే, ఎట్టిపరిస్థితుల్లో పాకిస్తాన్, హమాస్‌ను కలవనీయరు. కాబట్టి పహల్గామ్ ఉగ్రదాడి ఉద్రిక్తతలు యుద్ధంగా మారితే భారత్‌తో పాటు యాక్షన్‌లోకి దిగడానికి కూడా వెనుకాడరు. అంతకంటే ముందు మొస్సాద్ రంగంలోకి దిగే అవకాశాలున్నాయి. ఫిబ్రవరి 5వ తేదీన పాక్ ఆక్రమిత కశ్మీర్ సమావేశం దగ్గర నుంచీ మినిట్ టు మినిట్ జరిగింది తెలుసుకోవడంలో ఆల్రెడీ బిజీగా ఉన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ పహల్గామ్ ఉగ్రదాడిలో హమాస్ హ్యాండ్ ఉందని తేలితే మాత్రం.. అసలైన ఆట మొదలయ్యేది అప్పుడే.