కాస్లీ బాటిల్‌లో చీప్ లిక్కర్ పోసి అమ్మేస్తున్నారు…!
కాస్లీ మందు బాటిల్స్‌లో చీప్ లిక్కర్ పోసి అమ్మేస్తున్నారు కేటుగాళ్లు. బార్‌లో మద్యాన్ని కల్తీ చేస్తుండగా బార్ ఉద్యోగిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఎక్సైజ్ అధికారులు.

కాస్లీ మందు బాటిల్స్‌లో చీప్ లిక్కర్ పోసి అమ్మేస్తున్నారు కేటుగాళ్లు. బార్‌లో మద్యాన్ని కల్తీ చేస్తుండగా బార్ ఉద్యోగిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఎక్సైజ్ అధికారులు. లింగంపల్లి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో అయ్యప్ప సోసైటీ ప్రాంతంలో ట్రూప్స్ బార్‌లో అధికారులు తనిఖీలు నిర్వహించారు.
బార్ లైసెన్స్ రెన్యువల్ చేయలేదు, ఫీజు కూడా చెల్లించలేదని తనిఖీలు చేశారు. బార్‌లో 2 వేల 690 రూపాయలు ధర గల జేమ్సన్ బాటిల్లో 1000 రూపాయల ధర కలిగిన ఓక్‌స్మిత్ మద్యాన్ని కలుపుతుండగా పట్టుకున్నారు. 75 కల్తీ బాటిళ్లను, 55 ఖాళీ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. బార్ లైసెన్స్ రద్దు చేసి. ఓనర్ ఉద్యాకుమార్ రెడ్డి, మేనేజర్ వి. సత్యనారాయణ రెడ్డి, బార్‌లో పని చేసే ఉద్యోగి పునిత్ పట్నాయక్‌లపై కేసు నమోదు చేసి లింగంపల్లి ఎక్సైజ్ స్టేషన్‌లో అప్పగించారు.