Top story: అరేబియా సముద్రంలో క్షిపణి గర్జన విక్రాంత్ పాకిస్తాన్ అంతు చూస్తుందా?
ఓవైపు ఉగ్రవేట.. మరోవైపు కాల్పుల కవ్వింపులు.. ఇంకోవైపు యుద్ధ ట్యాంకుల తరలింపు.. భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో యుద్ధ పరిస్థితులే ఇవన్నీ. కానీ, అంతకుమించిన యాక్షన్ అరేబియా సముద్రంలో జరుగుతోంది.

ఓవైపు ఉగ్రవేట.. మరోవైపు కాల్పుల కవ్వింపులు.. ఇంకోవైపు యుద్ధ ట్యాంకుల తరలింపు.. భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో యుద్ధ పరిస్థితులే ఇవన్నీ. కానీ, అంతకుమించిన యాక్షన్ అరేబియా సముద్రంలో జరుగుతోంది. రెండు దేశాలూ పోటాపోటీగా క్షిపణి పరీక్షలు నిర్వహిస్తున్నాయి. అంతే కాదు, ఇండియాస్ మోస్ట్ పవర్‌ఫుల్ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ INS విక్రాంత్ రంగంలోకి దిగిపోయింది. యుద్ధవిమానాలు, క్షిపణులతో పాకిస్తాన్ దిశగా పయనం మొదలుపెట్టింది. 1971 యుద్ధంలో శత్రువు అంతు చూసిన విక్రాంత్ సీన్‌లోకి వచ్చేసరికి ప్రపంచం అటెన్షన్ అరేబియా సముద్రానికి షిఫ్ట్ అయి పోయింది. ఇంతకూ, సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పీక్స్‌కు చేరుకుంటున్న వేళ.. అరేబియా సముద్రంలో విక్రాంత్ ఏం చేస్తోంది? పాకిస్తాన్‌తో యుద్ధం అంటూ మొదలైతే 1971 నాటి సీన్ రిపీట్ అవుతుందా?
అరేబియా సముద్రంలో భారత్, పాకిస్తాన్ పోటాపోటీగా క్షిపణి పరీక్షలు నిర్వహించాయి. తాము క్షిపణి పరీక్షలు చేపడతామంటూ పాకిస్తాన్ మిలటరీ నోటమ్ జారీ చేసిన క్రమంలో.. భారత నౌకాదళం సైతం అరేబియా సముద్రంలో క్షిపణి పరీక్షను విజయవంతంగా చేపట్టింది. నేవీకి చెందిన స్వదేశీ గైడెడ్ క్షిపణి విధ్వంసక నౌక ఐఎన్‌ఎస్ సూరత్ నుంచి సీ స్కిమ్మింగ్ టార్గెట్లను ఛేదించే సత్తా కలిగిన క్షిపణిని పరీక్షించింది. 70 కిలోమీటర్ల పరిధిలో టార్గెట్లను ఛేదించగలిగిన మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్‌ను పరీక్షించారు. ఈ సందర్భంగా లక్ష్యాన్ని అది అత్యంత కచ్చి తత్వంతో ఛేదించిందని భారత నౌకాదళం వెల్లడించింది. ఐఎన్ఎస్ సూరత్‌ను ఇటీవలే ప్రధాని మోడీ ముంబైలోని నేవల్ డాక్ యార్డులో ప్రారంభించారు. ఇది పీ15బీ క్షిపణి విధ్వంసక యుద్ధనౌక.
అసలు విషయం ఏంటంటే అరేబియా సముద్రంలో మాన్‌స్టర్ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ ఐఎన్ఎస్ విక్రాంత్ సైతం ఎంట్రీ ఇవ్వడం. ఐఎన్ఎస్ సూరత్ యుద్ధ నౌక.. విక్రాంత్ పటాలంలోనిదే.
నిజానికి.. పహల్గాం ఉగ్రదాడి అనంతరం తాము ఉపరితలంపై నుంచి ఉపరితలంపైకి ప్రయోగించే క్షిపణి పరీక్షలను చేపడతామని పాకిస్తాన్ మిలటరీ నోటమ్ జారీ చేసింది. గురు, శుక్ర వారాల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తామని అందులో పేర్కొంది. కానీ.. అదే సమయంలో ఐఎన్‌ఎస్ సూరత్ నుంచి భారత నౌకాదళం సీ స్కిమ్మింగ్ టార్గెట్లను ఛేదించే మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్‌ను పరీక్షించారు. ఆ వెంటనే విమాన వాహక యుద్ధనౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్‌ను రంగంలోకి దించారు. ఇది కర్ణాటకలోని కార్వార్ నావల్ బేస్ నుంచి పాకిస్తాన్ దిశగా వెళుతోంది. అత్యాధునిక యుద్ధ విమానాలు, క్షిపణులతో విక్రాంత్ పూర్తి స్థాయిలో సిద్ధమైనట్టు తెలుస్తోంది. సరిహద్దులు, తీర ప్రాంతాల్లో పహారా విషయంలో అప్రమత్తంగా ఉండాలంటూ త్రివిధ దళాలకు కీలక ఆదేశాలు అంది నట్టు చెబుతున్నారు. అదే నిజమైతే పాకిస్తాన్ వెన్నులో వణుకు మొదలవ్వడంఖాయం. ఎందుకంటేఐఎన్ఎస్ విక్రాంత్ ఒకప్పుడు పాకిస్తాన్ నేవీకి చుక్కలు చూపించింది కాబట్టి.
ఐఎన్‌ఎస్ విక్రాంత్ అంటేనే ఓ ఎమోషన్. విజయానికీ, శౌర్యానికీ గుర్తు. భారత గౌరవానికి ప్రతీక. మన తొలి విమాన వాహక నౌక. బ్రిటన్ నుంచి 1961లో కొనుగోలు చేసిన ఈ నౌక ఎన్నో యుద్ధాల్లో కీలకపాత్ర పోషించింది. మరపురాని విజయాలందించింది. ముఖ్యంగా 1971 ఇండో-పాక్ వార్‌లో విక్రాంత్ వీరోచిపోరాటాలు అన్నీ ఇన్నీ కావు. ఓ దశలో పాకిస్తాన్ విక్రాంత్‌ను టార్గెట్ చేసినా శత్రువులను ముప్పు తిప్పలు పెట్టి, చివరికి తరిమి తరిమి కొట్టింది. నాటి యుద్ధంలో విక్రాంత్ పాత్ర ఒక చరిత్ర. ఇలా సుదీర్ఘ సేవలందించిన విక్రాంత్ చివరికి 1997లో రిటైరైంది. కట్ చేస్తే.. 2022లో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి నౌక ఐఏసీ-1కు కూడా ఐఎన్ఎస్ విక్రాంత్ పేరునే పెట్టారు. అంతేకాదు, నాటి నేవీ హీరో విక్రాంత్‌కు మించిన మెరుగైన సాంకేతికతతో రూపొందించారు. ఇందుకే ఐఎన్ఎస్ విక్రాంత్ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ భారత్ నేవీ చేతిలో ఒక బ్రహ్మాస్త్రంగా మారింది.
ఐఎన్ఎస్ విక్రాంత్ సత్తా తెలిస్తే శత్రువుల వెన్నులో వణుకు పుట్టడం ఖాయం. ఎందుకంటే ఈ వార్‌షిప్‌లో 34 యుద్ధ విమానాలుం ఉంటాయి. వీటిలో మిగ్-29కే, కమోవ్-31, ఏఎల్‌హెచ్ హెలికాప్టర్లు, ఎంహెచ్-60ఆర్‌సీ హాక్ మల్టీరోల్ హెలికాప్టర్లతో పాటూ దేశీయంగా తయారు చేసిన తేలికపాటి హెలికాప్టర్లుకూడా ఉన్నాయి. అంటే ఓ మినీ యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు అవసర
మైన డిఫెన్స్ సిస్టం ఐఎన్ఎస్ విక్రాంత్‌లోనే ఉన్నట్టన్నమాట. ఐఎన్ఎస్ విక్రాంత్‌లో మొత్తం 14 అంతస్తులు 2వేల 300 కంపార్ట్‌మెంట్స్ ఉంటాయి. దాదాపు 1600 మంది సిబ్బంది ఉంటారు. ఐఎన్ఎస్ విక్రాంత్ 262 మీటర్ల పొడవు 62 మీటర్ల వెడల్పు ఉంటుంది. ఈ మొత్తం రెండు హాకీ మైదానాలతో సమానం. ఇక ఐఎన్ఎస్ విక్రాంత్ బరువు 43 వేల టన్నులు ఉంటుంది. గంటకు 28 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణించే సత్తా విక్రాంత్ సొంతం. అన్నింటికీమించి ఈ యుద్ధనౌక స్ట్రైక్ ఫోర్స్ పరిధి 1500 కిలోమీటర్లు. అంటే పాకిస్తాన్‌ను ధ్వంసం చేయడానికి ఈ ఒక్క యుద్ధనౌక చాలు.
ఇక.. రక్షణపరంగా, రవాణాపరంగా ఎంతో కీలకమైన హిందూ సముద్రంలో పైచేయి సాధించేందుకు ఐఎన్‌ఎస్ విక్రాంత్ భారత్‌కు బ్రహ్మాస్త్రంలా ఉపయోగపడుతుంది. ఏ దేశానికైనా యుద్ధ విమానాలను మోసుకెళ్లే సామర్థ్యం ఉన్న నౌకలు ఉంటేనే నావికాశక్తి పటిష్టంగా ఉంటుంది. దీంతో సముద్ర జలాల్లోనూ, గగనతలంపైనా పట్టు సాధించేందుకు వీలవుతుంది. మన దగ్గర విక్రాంత్ తో పాటు విక్రమాదిత్య కూడా ఉంది. మూడో విమాన వాహక నౌక తయారీ కూడా మొదలైంది. పాకిస్తాన్ దగ్గర ఇలాంటి పవర్‌ఫుల్ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్లు ఒక్కటంటే ఒక్కటికూడా లేదు. అందుకే అరేబియా సముద్రంలో విక్రాంత్‌ను రంగంలోకి దించారు. భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం అంటూ మొదలైతే విక్రాంత్ యాక్షన్ ఇస్లామాబాద్ ఊహకందని రీతిలో ఉంటుంది.