మేము బతికే ఉన్నాం వీడియో రిలీజ్‌ చేసిన జంట

పహల్గాం దాడిలో చనిపోయిన నేవీ ఆఫీసర్‌ పేరుతో ఓ వీడియో వైరల్‌ అవుతోంది. ఉగ్రదాడి జరగడానికి కాసేపటి ముందు నేవీ ఆఫీసర్‌తన భార్యతో హ్యాపీగా ఓ వీడియో తీసుకున్నాడు..

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 25, 2025 | 12:36 PMLast Updated on: Apr 25, 2025 | 2:51 PM

The Couple Who Released The Video We Are Alive

పహల్గాం దాడిలో చనిపోయిన నేవీ ఆఫీసర్‌ పేరుతో ఓ వీడియో వైరల్‌ అవుతోంది. ఉగ్రదాడి జరగడానికి కాసేపటి ముందు నేవీ ఆఫీసర్‌తన భార్యతో హ్యాపీగా ఓ వీడియో తీసుకున్నాడు.. ఆ వీడియో తీసుకున్న కొన్ని నిమిషాల్లోనే ఉగ్రవాదులు ఆ ఆఫీసర్‌ను చంపేశారు అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

అయితే ఆ వీడియో నేవీ ఆఫీసర్‌ది కాదని ఆ వీడియోలు ఉన్న వ్యక్తులు మరో వీడియో రిలీజ్‌ చేశారు. చూసేందుకు ఒకేలా ఉన్న కారణంగా కొన్ని మీడియా ఛానెల్స్‌ తమ వీడియోను ప్రచారం చేస్తున్నాయని.. తాము బతికే ఉన్నామంటూ వీడియో పెట్టారు ఆ జంట. సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారం కారణంగా తమ కుటుంబ సభ్యులు భయపడుతున్నారని వెంటనే ఈ ప్రచారాన్ని ఆపాలంటూ కోరారు.
https://www.instagram.com/yashikashishsehrawat/reel/DIzKFYCyqkS/