యుద్ధానికి సిద్ధం అవుతున్న భారత్..!
పహల్గాం దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ మీద భారత్ యుద్ధానికి సిద్ధమవుతోంది. సెలవుల్లో ఉన్న పారామెలిటరీ బలగాలకు ఇప్పటికే సెలవులు రద్దు చేశారు ఉన్నతాధికారు.

పహల్గాం దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ మీద భారత్ యుద్ధానికి సిద్ధమవుతోంది. సెలవుల్లో ఉన్న పారామెలిటరీ బలగాలకు ఇప్పటికే సెలవులు రద్దు చేశారు ఉన్నతాధికారు. బలగాలు వెంటనే బార్డర్లో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. పాకిస్తాన్ తో ఈ క్షణమైన యుద్ధం మొదలయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో మిలిటరీ బలగాలను మోహరిస్తోంది భారత్.
ఇప్పటికే ఆర్మీ చీఫ్ ద్వివేది శ్రీనగర్ చేరుకున్నారు. LOC దగ్గర పరిస్థితులను ఆయన సమీక్షిస్తున్నారు. వివిధ దళాలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. అరేబియా సముద్రం నుంచి INS యుద్ధ నౌక ఇప్పటికే పాకిస్తాన్ వైపు ప్రయాణం మొదలుపెట్టింది. రాఫెల్, సుఖోయ్ యుద్ధ విమానాలు పాకిస్తాన్ వైపు వెళ్తున్నాయి. అటు పాకిస్తాన్ కూడా భారత్ దాడిని ఎదుర్కొనేందుకు సన్నహాలు చేస్తోంది. దీంతో ఏ క్షణమైనా పాకిస్తాన్ భారత్ మధ్య యుద్ధ భేరి మోగే అవకాశం కనిపిస్తోంది.