ప్రాణాలు కావాలంటే పారిపోండి, పాకిస్థానీలకు రేవంత్‌ వార్నింగ్‌

ఇండియాలో ఉంటున్న పాకిస్థాన్‌ పౌరులంతా వెంటనే తమ దేశానికి వెళ్లిపోవాలంటూ భారత ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో ఎంత మంది పాకిస్థానీలు ఉన్నారో వాళ్ల లిస్ట్‌ రెడీ చేసింది

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 25, 2025 | 07:27 PMLast Updated on: Apr 25, 2025 | 7:27 PM

Revanth Warns Pakistanis To Flee If They Want To Save Their Lives

ఇండియాలో ఉంటున్న పాకిస్థాన్‌ పౌరులంతా వెంటనే తమ దేశానికి వెళ్లిపోవాలంటూ భారత ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో ఎంత మంది పాకిస్థానీలు ఉన్నారో వాళ్ల లిస్ట్‌ రెడీ చేసింది. ఈ క్రమంలో తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డితో అమిత్‌ షా మాట్లాడారు.

దీంతో సీఎం ఆదేశాల మేరకు తెలంగాణ డీజీపీ కీలక ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణలో ఉన్న పాకిస్థాన్‌ పౌరులు వెంటనే తమ దేశానికి వెళ్లిపోవాలని నోటీస్‌ జారీ చేశారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఉన్నా.. పాకిస్థాన్‌ పౌరులు తమ దేశానికి వెళ్లేందుకు అట్టారి బోర్డర్‌ ఓపెన్‌గానే ఉందని తెలిపారు. ఎలాంటి సమస్య రాకుండా ఉండాలి అంటే పాకిస్థానీలు వెంటనే వెళ్లిపోవాలని హెచ్చరించారు.