హైదరాబాద్‌లో హై అలెర్ట్ ,సిటీలో 200 మంది పాకిస్థానీలు
పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లో ఉన్న పాకిస్థానీలనున వెంటనే వాళ్ల దేశానికి పంపేయాలని నిర్ణయించింది.

పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లో ఉన్న పాకిస్థానీలనున వెంటనే వాళ్ల దేశానికి పంపేయాలని నిర్ణయించింది. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో నివాసముంటున్న పాకిస్థానీల లిస్ట్‌ను కేంద్రం రెడీ చేసింది. ఆయా రాష్ట్రాల సీఎంలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు.
ఇదే క్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో కూడా మాట్లాడారు అమిత్ షా. హైదరాబాద్‌లో 200 మంది పాకిస్థాన్‌కు చెందిన వ్యక్తులు ఉన్నారని.. వెంటనే వాళ్లను వాళ్ల దేశానికి పంపేయాలంటూ ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో పాకిస్థానీలను వాళ్ల దేశానికి పంపే చర్యలు ప్రారంభించింది తెలంగాణ సర్కార్.