ఆట మొదలు పెట్టిన తాలిబన్లు పాకిస్తాన్‌కు ఇక రక్త కన్నీరేనా?
జాఫర్ ఎక్స్‌ప్రెస్ హైజాక్ ఎపిసోడ్‌లో ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల హస్తముందా? కాబూల్ నుంచే హైజాక్ మిషన్‌ను ఆపరేట్ చేశారా? త్వరలో ఇదే సీన్ ఖైబర్ ఫఖ్తుంఖ్వా, సింధ్ ప్రావిన్సుల్లోనూ రిపీట్ కానుందా?

జాఫర్ ఎక్స్‌ప్రెస్ హైజాక్ ఎపిసోడ్‌లో ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల హస్తముందా? కాబూల్ నుంచే హైజాక్ మిషన్‌ను ఆపరేట్ చేశారా? త్వరలో ఇదే సీన్ ఖైబర్ ఫఖ్తుంఖ్వా, సింధ్ ప్రావిన్సుల్లోనూ రిపీట్ కానుందా? ఈ ప్రశ్నలకు సమాధానం ఔననే వినిపిస్తోంది. జాఫర్ ఎక్స్‌ప్రెస్ హైజాక్ వ్యవహారంలో బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఫైటర్లు శాటిలైట్ ఫోన్లు ఉపయోగించారట. కాబూల్ నుంచే కమాండ్స్ తీసుకుంటున్నట్టు పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రకటించాయి. అదే నిజమైతే జాఫర్ ఎక్స్‌ప్రెస్ హైజాక్ అనేది అసలు విషయమే కాదు.. ఇస్లామాబాద్‌కు అసలు సమస్యలన్నీ ముందే ఉంటాయి. ఎందుకంటే ఆఫ్ఘాన్ తాలిబన్ల వ్యూహాలను పసిగట్టడం ఇంపాజిబుల్. సింపుల్‌గా చెప్పాలంటే ఇస్లామాబాద్‌కు అసలు సిసలు సవాళ్లు ఇప్పటినుంచే మొదలు కాబోతున్నాయి. ఇంతకూ, ఆఫ్ఘాన్ తాలిబన్లకు బలూచ్ లిబరేషన్ ఆర్మీకి అండగా నిలవాల్సిన అవసరం ఏముంది? ఈ మద్దతు వెనుక ఖైబర్ ఫఖ్వుంఖ్వాను ఆక్రమించుకునే స్ట్రాటజీ ఉందా? ఇవాల్టి టాప్ స్టోరీలో చూద్దాం..
ఇప్పటికిప్పుడు పాకిస్తాన్, చైనా తమ ప్రాంతాన్ని విడిచివెళ్లిపోవాలన్నదే బలూచ్ లిబరేషన్ ఆర్మీ కమాండర్ వార్నింగ్ సారాంశం. బలూచిస్తాన్ స్వతంత్రం ప్రకటించుకుంది అనడానికి ఇంతకంటే ఎగ్జాంపుల్ అవసరం లేదు. వాస్తవానికి.. ఇస్లామాబాద్ పాలనకి వ్యతిరేకంగా బీఎల్ఏ దశాబ్దాలుగా పోరాటంచేస్తోంది. కానీ, ఈ స్థాయిలో దాడులు చేయడం మాత్రం ఇదే తొలిసారి. దీనికి కారణం ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల మద్దతే అని పాకిస్తాన్ నిఘా వర్గాలు చెబుతున్నాయి. బీఎల్ఏ ఫైటర్లు ఉపయోగించిన శాటిలైట్ ఫోన్ల లొకే షన్ ఆఫ్ఘాన్‌లో గుర్తించినట్టు కూడా ప్రకటించింది. కానీ, బలూచ్ లిబరేషన్ ఆర్మీకి మద్దతిస్తే ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్లకు వచ్చే లాభమేంటి? అక్కడే ఉంది అసలు మెలిక.
ఖైబర్ ఫఖ్తుంఖ్వా.. పాకిస్తాన్‌లోని వాయువ్య రాష్ట్రమిది. బలూచిస్తాన్‌లాగే చాలా కాలంగా పాక్ నుంచి స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న ప్రాంతం కూడా. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఫస్తూన్ జాతీయవాదం బలంగా ఉంది. ఆఫ్ఘనిస్తాన్‌లోనూ వీరిసంఖ్య మెజార్టీగా ఉంది. రెండు దేశాల మధ్య డ్యూరండ్ రేఖ ఉన్నా సన్నిహిత సంబంధాలు, బంధుత్వాలు్డేవి. అవన్నీ ఆఫ్ఘాన్ తాలిబన్లతో సంబంధాలు బాగున్నప్పుడు. ఎప్పుడైతే టీటీపీ విషయంలో ఇరు దేశాల మధ్య వివాదం చెలరేగిందో అప్పుడే ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో సీన్ మారింది. దీంతో ఖైబర్ ఫఖ్తుంఖ్వా తమదే అని ఆఫ్ఘాన్ తాలిబన్లు సంచలన ప్రకటన చేశారు. ఇప్పటికే ఆ ప్రాంతం తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్తాన్ ఆధానంలోకి వెళ్లిపోయింది. అక్కడి గిరిజన ప్రాంతాల్లో పాకిస్తాన్ చట్టాలకు విలువే లేదు. తాలిబన్లు చేసిందే చట్టం, చెప్పిందే న్యాయం. ఆ ప్రాంతాన్ని పూర్తిగా హస్తగతం చేసుకోవాలని ఆఫ్ఘాన్ తాలిబన్లు చాలా కాలంగా ట్రై చేస్తున్నారు. ఇందులో భాగంగానే బీఎల్ఏకు మొదట మద్దతిచ్చి తర్వాత ఖైబర్ ఫఖ్తుంఖ్వా కోసం వారి మద్దతు తీసుకోవాలని ప్లాన్ చేశారనుకోవచ్చు. అయితే, ఇక్కడితో అంతా అయిపోయినట్టు కాదు.. ఎందుకంటే, బలూచ్ లిబరేషన్ ఆర్మీ మరో ప్రాంతానికీ మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ప్రాంతం పేరు సింధ్..!
బ్రిటిష్ వారు తాము ఆక్రమించిన సింధూ రాజ్యాన్ని బలవంతంగా పాకిస్తాన్‌లో కలిపారు. కానీ, ఆ ప్రాంత ప్రజలకు ఇది అస్సలు ఇష్టం లేదు. దీంతో నాటి నుంచే పోరాటం కొనసాగుతోంది. బలూచ్‌లో చేసినట్టే పాకిస్తాన్ ఇప్పటివరకూ చాలా మంది సింధ్ దేశ్ నాయకులను హతమార్చింది. వేల మందిని జైళ్లలో నిర్బంధించింది. ప్రభుత్వ అణచివేతకు వ్యతిరేకంగా సింధ్ దేశ్ పీపుల్స్ ఆర్మీ లాంటి సంస్థలు పోరాటం కొనసాగిస్తూ వస్తున్నాయి. ఆ పోరాటానికి బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఊపిరిలూదింది. ఫలితంగా ఓ ఒప్పందం ప్రకారం బలూచ్ వేర్పాటువాద గ్రూపులు, సింధ్ దేశ్ వేర్పాటవాద గ్రూపులు చేతులుకలిపాయి. ఒప్పందం ప్రకారం బలూచిస్తాన్‌కు స్వాతంత్ర్యం సాధించుకున్న తర్వాత సింధ్ దేశ్ కోసం భీకర పోరు మొదలవుతుంది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ సహా బలూచిస్తాన్ వేర్పాటువాద గ్రూపులన్నీ సింధ్ స్వేచ్ఛ కోసం పోరాటం చేస్తాయి. అదే జరిగితే పాకిస్తాన్ కథ ముగిసిపోవడానికి ఎంతో సమయం పట్టదు.
మరోవైపు.. పాక్ ఆక్రమిత కశ్మీర్ కూడా చాలా కాలంగా ఇస్లామాబాద్ నుంచి స్వేచ్ఛ కోసం పోరాడుతోంది. ఇటీవలే రాజ్‌నాథ్ సింగ్, జైశంకర్ వంటి నేతలు పీవోకే విలనం కావడానికి ఎంతో టైం లేదని ప్రకటించారు. కాబట్టి.. త్వరలో పాక్ ఆక్రమిత కశ్మీర్ కూడా భారత్‌లో విలీనం కావచ్చు. వివరంగా చెప్పాలంటే బలూచిస్తాన్ స్వతంత్ర్యం ప్రకటించుకుంటుంది. తర్వాత ఖైబర్ ఫఖ్తుంఖ్వా ఆఫ్ఘనిస్తాన్‌లో విలీనమవుతుంది. ఆ తర్వాత సింధ్ ప్రాంతం సింధు దేశ్‌గా మారుతుంది. వివరంగా చెప్పాలంటే పాకిస్తాన్‌కు మిగిలేది కేవలం పంజాబ్ రాష్ట్రం మాత్రమే. నిజానికి.. ఈ పరిస్థితులకు కారణం పాకిస్తానే. భారత్ నుంచి కశ్మీర్‌ను విడదీయాలనే కుట్రలతో ఉగ్రవాదాన్ని పెంచి పోషించింది. లష్కరే తోయిబా, జైషే మహ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలను సృష్టించి భారత్‌లో విధ్వంసానికి కుట్రలు చేసింది. ఇప్పుడు ఆ దేశంలోని వేర్పాటువాదులు కూడా ఇస్లామాబాద్ ఉగ్ర మార్గాన్నే ఎంచుకున్నారు. అందుకే, కర్మ రిటర్న్స్ అనేది. ఇప్పటికైతే రైలు హైజాక్ ఎపిసోడ్‌లో ఆపరేషన్ ముగించారు. కానీ, అసలైన ఆట మాత్రం త్వరలో నే మొదలవ్వబోతోంది.