బ్రేకింగ్: 30 ఏళ్లుగా టెర్రరిస్టులను పెంచుతున్నాం, పూర్తిగా సిగ్గు వదిలేసిన పాక్‌

దిక్కుమాలిన పనులకు కేరాఫ్‌ అడ్రస్‌గా ఉండే పాకిస్థాన్‌.. మీడియా సాక్షిగా పూర్తిగా సిగ్గూ ఎగ్గూ వదిలేసింది. టెర్రరిస్టులకు తాము ఫండింగ్‌ ఇస్తున్నామంటూ ఓపెన్‌గానే ఒప్పుకుంటోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 25, 2025 | 04:59 PMLast Updated on: Apr 25, 2025 | 4:59 PM

Pakistan Has Completely Lost Its Shame After Nurturing Terrorists For 30 Years

దిక్కుమాలిన పనులకు కేరాఫ్‌ అడ్రస్‌గా ఉండే పాకిస్థాన్‌.. మీడియా సాక్షిగా పూర్తిగా సిగ్గూ ఎగ్గూ వదిలేసింది. టెర్రరిస్టులకు తాము ఫండింగ్‌ ఇస్తున్నామంటూ ఓపెన్‌గానే ఒప్పుకుంటోంది.

ఏకంగా పాకిస్థాన్‌ డిఫెన్స్‌ మినిస్టర్‌ ఖవాజా అసిఫ్ ఈ కామెంట్స్‌ చేశాడు. ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏమాత్రం సిగ్గు లేకుండా తాము టెర్రరిస్ట్‌ ఆర్గనైజేషన్స్‌కు ఫండింగ్‌ ఇస్తున్నామంటూ చెప్పాడు. ఒకటి రెండూ కాదు ఏకంగా 30 ఏళ్ల నుంచి పాకిస్థాన్‌ ఈ పని చేస్తోందంటూ చెప్పాడు.