మెగా కోడలు మళ్లీ మొదలుపెట్టిందా..? వైరల్ అవుతున్న వరుణ్ తేజ్ వైఫ్ ఫోటోలు..!

హీరోయిన్లు సింగిల్ గా ఉన్నప్పుడు ఎంత హాట్ ఫోటోషూట్ చేసిన ఎవరూ పట్టించుకోరు.. అలా ఎందుకు చేసావు అని ఎవరు క్వశ్చన్ చేయరు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 14, 2025 | 03:51 PMLast Updated on: Mar 14, 2025 | 3:51 PM

Photos Of Varun Tejs Wife Are Going Viral

హీరోయిన్లు సింగిల్ గా ఉన్నప్పుడు ఎంత హాట్ ఫోటోషూట్ చేసిన ఎవరూ పట్టించుకోరు.. అలా ఎందుకు చేసావు అని ఎవరు క్వశ్చన్ చేయరు. పైగా కెరీర్ కోసం తప్పట్లేదేమో.. అందుకే అలా చేస్తుందని అర్థం చేసుకుంటారు. కానీ ఒకసారి పెళ్లి అయిన తర్వాత కూడా అలాగే హాట్ ఫోటో షూట్ చేస్తే మాత్రం చాలా మందికి సమాధానం చెప్పాల్సిన ఆవశ్యకత వస్తుంది. అందులోనూ పెళ్లి చేసుకున్నది ఒక పెద్దింటి హీరోయిన్ అయితే ఆ హీరోయిన్ పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి..! గతంలో సమంత ఇలాంటి సమాధానాలు చాలామందికి చెప్పాల్సి దానికి కారణం అప్పుడు ఆమె అక్కినేని కోడలు కావడమే. పెళ్లికి ముందు హాట్ గా కనిపించినా సమంతను ఎవరూ ఏంటిది అని ప్రశ్నించలేదు. కానీ చైతును పెళ్లి చేసుకున్న తర్వాత సమంత ఫోటోషూట్ చేస్తే.. అక్కినేని కోడలు ఇలా చేస్తుంది అని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి.

తాజాగా ఇదే పరిస్థితి లావణ్య త్రిపాఠీకి వచ్చేలా కనిపిస్తుంది. అందాల రాక్షసి సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన లావణ్య.. ఆ తర్వాత దాదాపు డజన్ సినిమాలకు పైగాని నటించింది. కానీ స్టార్ హీరోయిన్ గా మాత్రం ఎదగలేకపోయింది. కెరీర్ డల్ అవుతుంది అనుకుంటున్న టైంలో.. ఏడాదిన్నర కింద కింద మెగా హీరో వరుణ్ తేజ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది లావణ్య. పెళ్లికి ముందు ఫోటోషూట్స్ బాగానే చేసిన ఈ ముద్దుగుమ్మ.. మెగా కోడలు అనే ట్యాగ్ వచ్చిన తర్వాత మాత్రం వాటికి దూరంగానే ఉంది. సినిమాలు కూడా పెద్దగా చేయడం లేదు. డిజిటల్ మీడియాలో వెబ్ సిరీస్ లు మాత్రం చేస్తుంది లావణ్య. ఈ మధ్య ఒక లేడీ ఓరియంటెడ్ సినిమాకు సైన్ చేసింది. ఇక్కడి వరకు ఎవరికీ ఎలాంటి అభ్యంతరాలు లేవు కానీ.. ఈ మధ్య సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోషూట్స్ చేస్తుంది లావణ్య త్రిపాఠి. ఇక్కడే అసలు సమస్యలు మొదలయ్యేలా కనిపిస్తున్నాయి.

మెగా కోడలు మళ్లీ మొదలు పెట్టింది అంటూ లావణ్య ఫోటోషూట్స్ మీద చర్చ బాగా జరుగుతుంది. ఒకవేళ అవకాశాల కోసం లావణ్య గ్లామర్ షోకు రెడీ అని హింట్ ఇస్తుంది అనుకుంటే.. మెగా కోడలు అనే ట్యాగ్ మన దర్శక నిర్మాతలు మర్చిపోవాల్సిందే. మరోవైపు లావణ్యకు సపోర్ట్ చేస్తున్న బ్యాచ్ కూడా సోషల్ మీడియాలో ఉంది. పెళ్లయితే మాత్రం ఫోటో షూట్ చేయకుండా ఉండాలని ప్రశ్నిస్తున్నారు వాళ్ళు. అంతేకాదు నిహారిక పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేసింది.. విడాకుల తర్వాత గ్లామర్ షో కూడా చేస్తుంది.. ఆమెకు లేని కండిషన్స్ లావణ్య త్రిపాటికి ఎందుకు అంటున్నారు. ప్రస్తుతానికి ఈ మ్యాటర్ బాగా వేడి మీద ఉంది. మరి ఇది ఎక్కడికి వచ్చే ఆకుతుందో చూడాలి.