పూరీ జగన్నాథ్, చార్మి విడిపోయారా..? దాని కోసమే పూరీ ఈ నిర్ణయం తీసుకున్నాడా..!

ఇండస్ట్రీలో కొన్ని రిలేషన్స్ అలా కంటిన్యూ అవుతూ ఉంటాయి. వాటికి ఏ పేరు పెట్టాలో ఎవరికి అర్థం కాదు. అడిగితే మేము స్నేహితులం అంటారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 14, 2025 | 03:20 PMLast Updated on: Mar 14, 2025 | 3:20 PM

Have Puri Jagannath And Charmi Broken Up

ఇండస్ట్రీలో కొన్ని రిలేషన్స్ అలా కంటిన్యూ అవుతూ ఉంటాయి. వాటికి ఏ పేరు పెట్టాలో ఎవరికి అర్థం కాదు. అడిగితే మేము స్నేహితులం అంటారు. కానీ అక్కడ దానికి మించి ఉంటుందని ప్రతి ఒక్కరూ అనుకుంటూనే ఉంటారు. ఎవరు ఏమనుకున్నా కూడా వాళ్ళు చేయాల్సిందే చేస్తూ ఉంటారు కొంతమంది సెలబ్రిటీస్. అందులో పూరి జగన్నాథ్, ఛార్మి జంట కూడా ఉంటుంది. దాదాపు 10 సంవత్సరాల నుంచి వీరిద్దరూ కలిసే ఉంటున్నారు. అలాగని ఇద్దరి మధ్య ప్రేమ ఉందా అంటే లేదు అని చెప్తారు.. పెళ్లి కానీ చేసుకుంటారా అంటే అబ్బే అలాంటిదేమీ లేదు అంటారు. మేం జస్ట్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ రిలేషన్ షిప్ లో ఉన్నామని చెప్తుంటారు. కానీ పూరి జీవితం ఛార్మి కారణంగా చాలా మారిపోయింది అని ఇండస్ట్రీలో ఎన్నో సంవత్సరాలుగా టాక్ నడుస్తూనే ఉంది. ఆయన కెరీర్ ఇంత దారుణంగా పడిపోవడానికి కారణం చార్మి అని చాలామంది చెప్తూ ఉంటారు.

అంతెందుకు పూరీ జగన్నాథ్ కొడుకు ఆకాష్ కూడా ఒకసారి ఆఫీసుకు వచ్చి ఛార్మితో పెద్ద గొడవ పెట్టుకున్నాడు అనేది ఇండస్ట్రీలో అతిపెద్ద రూమర్. అది రూమరా నిజమా అనేది చాలామందికి క్లారిటీ ఉంది కానీ బయటికి చెప్పడానికి ఎవరు ఇష్టపడరు. దానికి తోడు పూరీ జగన్నాథ్ పాత స్టాఫ్ అందరినీ ఒకేసారి తీసేసి.. కొత్త వాళ్లను చార్మి తీసుకుంది అనే రూమర్ కూడా ఉంది. ఇలా ఒకటి రెండు కాదు పూరీ, చార్మి మధ్య గత పది సంవత్సరాలుగా చాలా జరిగింది. ఇద్దరు కలిసి పూరి కనెక్ట్స్ పేరుతో సినిమాలో నిర్మిస్తున్నారు. అందులో ఇస్మార్ట్ శంకర్ మాత్రమే హిట్ అయింది.. మిగిలినవన్నీ డిజాస్టర్స్.

ఇప్పుడు అసలు మ్యాటర్ ఏంటంటే డబుల్ ఇస్మార్ట్ తర్వాత పూరి, చార్మి మధ్య గ్యాప్ పెరిగిందనే ప్రచారం జరుగుతుంది. దానికి తోడు హీరోలకు కథ చెప్ప డానికి వెళ్ళిన పూరీ జగన్నాథ్ కు.. అటువైపు నుంచి వస్తున్న ఒకేఒక్క రిక్వెస్ట్ చార్మి ఉంటే నీతో సినిమా చేయలేము అని..! ఈ న్యూస్ బయటకి బాగా వస్తుందిప్పుడు. అందుకే కొన్ని రోజులుగా చార్మీకు పూరి డిస్టెన్స్ మైంటైన్ చేస్తున్నాడని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయనకు కొత్త సినిమా ఓకే అయ్యేలా కనిపిస్తుంది. ఈ మధ్య నాగార్జునను కలిసి ఒక కథ చెప్పాడు పూరి జగన్నాథ్. ఈ ప్రాజెక్టు దాదాపు కన్ఫర్మ్ అయ్యేలా కనిపిస్తుంది. ఒకవేళ ఇది వర్కౌట్ సినిమా గానీ ఆడింది అంటే మాత్రం పూరి, ఛార్మి రిలేషన్ కు ఇక ఫుల్ స్టాప్ పడ్డట్టే అంటున్నారు ఇండస్ట్రీ జనాలు. చూడాలి మరి ఏం జరగబోతుందో..!