బ్రేకింగ్: నన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు ?
కంచ గచ్చిబౌలి విషయంలో IAS స్మితా సబర్వాల్ ఎపిసోడ్ కంటిన్యూ అవుతోంది. HCUకు మద్దతుగా ఆమె పెట్టిన ట్వీట్ విషయంలో ఇప్పటికే పోలీసులకు వివరణ ఇచ్చిన స్మిత..

కంచ గచ్చిబౌలి విషయంలో IAS స్మితా సబర్వాల్ ఎపిసోడ్ కంటిన్యూ అవుతోంది. HCUకు మద్దతుగా ఆమె పెట్టిన ట్వీట్ విషయంలో ఇప్పటికే పోలీసులకు వివరణ ఇచ్చిన స్మిత.. మరోసారి ట్వీట్‌తో హాట్‌టాపిక్‌గా మారారు. తాను ఏ వీడియో అయితే షేర్ చేసిందో అదే వీడియోను మరో 2 వేల మంది కూడా షేర్ చేశారు.
ఇప్పుడు వాళ్లందరినీ విచారణకు పిలుస్తారా అంటూ పోస్ట్ చేశారు స్మితా. ఒకే ప్లాట్‌ఫాంలో వీడియో షేర్ చేసిన అందరినీ విడిచిపెట్టి తనను మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారో చెప్పాలంటూ పోస్ట్ చేశారు. ఇలా టార్గెట్ చేసి నోటీసులు పంపిస్తే చట్టం ముందు అంతా సమానమే అనే మాటకు అర్థం ఏముందంటూ ట్వీట్ చేశారు.