వాళ్ళిద్దరూ ఆడకుంటే ఇక అంతేనా సన్ రైజర్స్ పై క్లార్క్ విమర్శలు

ఐపీఎల్ 18వ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్ సంక్లిష్టంగా మారాయి. నిజానికి ఈ సీజన్ లో ఘనవిజయంతో ఆరంభించిన ఆరెంజ్ ఆర్మీ తర్వాత చేతులెత్తేసింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 19, 2025 | 01:15 PMLast Updated on: Apr 19, 2025 | 1:15 PM

Former Australian Cricketer Michael Clarke Criticizes Sunrisers Performance

ఐపీఎల్ 18వ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్ సంక్లిష్టంగా మారాయి. నిజానికి ఈ సీజన్ లో ఘనవిజయంతో ఆరంభించిన ఆరెంజ్ ఆర్మీ తర్వాత చేతులెత్తేసింది. ఒకటి కాదు రెండు కాదు వరుసగా నాలుగు మ్యాచ్ లలో పరాజయం పాలైంది. ఐదో మ్యాచ్ లో పంజాబ్ పై రికార్డ్ స్కోరు ఛేజ్ చేసి గెలిచినా మళ్ళీ ముంబై చేతిలో ఓడిపోవడంతో విమర్శలు మూటగట్టుకుంటోంది. ఈ క్రమంలో సన్ రైజర్స్ ఆటతీరుపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైఖేల్ క్లార్క్ విమర్శలు గుప్పించాడు. ఓపెనర్స్ ట్రావిస్ హెడ్, అభిషేక్ వర్మపైనే హైదరాబాద్ అతిగా ఆధారపడుతోందని అదే ఎస్ఆర్‎హెచ్ ఓటములకి ప్రధాన కారణమన్నాడు.

ఓపెనర్స్ విఫలమైతే మిడిల్ ఆర్డర్ ఏ మాత్రం రాణించడం లేదని.. ఇన్సింగ్స్‎ను నిర్మించే బాధ్యతను మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు తీసుకోకపోవడంతోనే హైదరాబాద్‎కు పరాజయాలు ఎదురవుతున్నాయని తెలిపాడు. ప్రతి మ్యాచులో ఓపెనర్స్ రాణించలేరని.. అప్పుడు మిడిల్ ఆర్డర్ బాధ్యత తీసుకుని ఆడాల్సి ఉంటుందని సూచించాడు. గత సీజన్లో ఓపెనర్స్ హెడ్, అభిషేక్ దాదాపు ప్రతి మ్యాచులో రాణించడంతో మిడిల్ ఆర్డర్ లోపం బయటపడలేదని.. కానీ ఈ సీజన్లో అలా కాదన్నాడు. ఈ సీజన్లో ఓపెనర్స్ హెడ్, అభిషేక్ అంచనాల మేర రాణించలేపోతున్నారని.. ఈ సమయంలో జట్టును ఆదుకోవాల్సిన మిడిల్ ఆర్డర్ కూడా చేతులేత్తయడంతో హైదరాబాద్ ఓటములు చవి చూడాల్సి వస్తోందన్నాడు. టాపార్డర్ విలఫమైనప్పుడు తమ సత్తా ఏంటో చూపించుకునేందుకు మిడిల్ ఆర్డర్ బ్యాటర్లకు ఒక మంచి అవకాశం ఉన్నా వారు దానిని ఉపయోగించుకోవడం లేదని క్లార్క్ విమర్శించాడు. ఇకనైనా హెడ్, అభిషేక్ ఇద్దరిపైనే ఆధారపడకుండా.. మిడిల్ ఆర్డర్‎ను సన్ రైజర్స్ మెరుగుపర్చుకోవాలని సూచించాడు.

గత సీజన్ లో దాదాపు ప్రతీ మ్యాచ్ లో దుమ్మురేపిన సన్ రైజర్స్ హైదరాబాద్ తృటిలో టైటిల్ ను చేజార్చుకుంది. విధ్వంసకర బ్యాటర్లను రిటైన్ చేసుకుని ఈ సీజన్ లో కూడా అదరగొడుతుందనుకుంటే నిరాశపరుస్తోంది.సీజన్ మొదటి మ్యాచులో సెంచరీతో దుమ్మురేపిన కిషన్.. ఆ తర్వాత పూర్తిగా విఫలమవుతున్నాడు. ఇక, విధ్వంసకర ప్లేయర్ క్లాసెన్, నితీష్ రెడ్డి కూడా స్థాయి తగ్గ ప్రదర్శన చేయకపోవడం హైదరాబాద్‎కు ఇబ్బందిగా మారింది. ఇక, కమిన్స్ కెప్టెన్సీలో ఇప్పటి వరకు ఏడు మ్యాచులు ఆడిన సన్ రైజర్స్ కేవలం రెండు విజయాలే సాధించింది. మిగిలిన అన్ని మ్యాచ్ లలో గెలిస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్లే ఆఫ్ బెర్త్ ఖాయం చేసుకుంటుంది.