బ్రేకింగ్: వివాహేతర సంబంధం నేరం కాదు, ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు
వివాహేతర సంబంధాల విషయంలో ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం నైతికతకు సంబంధించిన విషయం కానీ.. ఇది నేరం కాదంటూ ఓ కేసు కొట్టి వేసింది.

వివాహేతర సంబంధాల విషయంలో ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం నైతికతకు సంబంధించిన విషయం కానీ.. ఇది నేరం కాదంటూ ఓ కేసు కొట్టి వేసింది. ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి తన భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని కేసు వేశాడు. ఆ కేసును మేజిస్ట్రేట్ కోర్టు కొట్టివేసింది. కానీ మెజిస్ట్రేట్ కోర్టు తీర్పును సెషన్స్ కోర్టు కొట్టేసింది. పిటిషనర్‌కు సపోర్ట్ చేస్తూ నిందితుడికి సమన్లు పంపింది.
ఈ సమన్లను ఢిల్లీ హైకోర్టులో ఛాలెంజ్ చేశాడు ఆ వ్యక్తి. ఈ కేసు విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి మీనా బన్సల్ కీలక వ్యాఖ్యలు చేశారు. 497 సెక్షన్ చట్టంబద్ధం కాదని గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు గుర్తు చేశారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం.. వివాహేతర సంబంధాలు నైతికతకు సంబంధించిన విషయాలే తప్ప నేరాలు కాదని చెప్పారు. దీంతో ఈ కేసులో నిందితుడిగా ఉన్న రిలీజ్ అయ్యాడు. ఢిల్లీ హైకోర్టు చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.