గోరంట్లకు ముసుగేసి పోలీసుల థర్డ్‌ డిగ్రీ

తమ విధులకు ఆటంకం కలిగించాడని మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను అరెస్ట్‌ చేసిన పోలీసులు కస్టడీలో ఆయనపై చేయిజేసుకున్నట్టుగా తెలుస్తోంది. వైఎస్‌ భారతి మీద అసభ్యకర వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్‌ను నిన్న గుంటూరు పోలీసులు అరెస్ట్‌ చేశారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 12, 2025 | 10:32 AMLast Updated on: Apr 12, 2025 | 10:32 AM

Police Third Degree For Hiding Behind Gorantla

తమ విధులకు ఆటంకం కలిగించాడని మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను అరెస్ట్‌ చేసిన పోలీసులు కస్టడీలో ఆయనపై చేయిజేసుకున్నట్టుగా తెలుస్తోంది. వైఎస్‌ భారతి మీద అసభ్యకర వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్‌ను నిన్న గుంటూరు పోలీసులు అరెస్ట్‌ చేశారు. కిరణ్‌ను తనకు అప్పగించాలంటూ గోరంట్ల మాధవ్‌ తన అనుచరులతో గుంటూరు ఎస్పీ కార్యాలయానికి వెళ్లాడు. ఆఫీస్‌లో నానా హంగామా చేశాడు. అప్పటికే కిరణ్‌ను వేరే పీఎస్‌కు తరలిస్తున్నా పోలీసులు. దీంతో తన అనుచరులతో పోలీస్‌ కాన్వాయ్‌ని అడ్డుకున్నాడు మాధవ్‌. మంగళగిరి వరకూ ఫాలో చేసి కాన్వాయ్‌ని ఆపాడు. కిరణ్‌ను తనకు అప్పగించాలటూ హంగామా చేశాడు. మాధవ్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించిన డ్రైవర్‌ మీద దాడి చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో ఓ పోలీస్‌ అధికారి మాధవ్‌ చెంప చెల్లుమనిపించి అదుపులోకి తీసుకున్నాడు. పోలీసులు విధులకు ఆటంకం కలిగించినందుకు మాధవ్‌తో పాటు ఆయన అనుచరుల మీద కేసు నమోదు చేశారు.