వనజీవి రామయ్య కన్నుమూత
పద్మశ్రీ వనజీవి రామయ్య కన్నుమూశారు. 85 ఏళ్ల రామయ్య గుండెపోటుతో కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో ఆయన బాధపడుతున్నారు. తెల్లవారుజామున ఇంట్లో స్పృహ లేకుండా ఉంటే దగ్గర్లోని ఆర్ఎంపీకి చూయించి ప్రభుత్వ ఆసుపత్రికి కుటుంబ సభ్యుల తరలించారు.

పద్మశ్రీ వనజీవి రామయ్య కన్నుమూశారు. 85 ఏళ్ల రామయ్య గుండెపోటుతో కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో ఆయన బాధపడుతున్నారు. తెల్లవారుజామున ఇంట్లో స్పృహ లేకుండా ఉంటే దగ్గర్లోని ఆర్ఎంపీకి చూయించి ప్రభుత్వ ఆసుపత్రికి కుటుంబ సభ్యుల తరలించారు. ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్న సమయంలోనే రామయ్య కన్నుమూశారు. కోటి కి పైగా మొక్కలను ఆయన నాటారు. ఆయన భార్య జానకమ్మ తో కలిసి ఆయన రోడ్ల పక్కన మొక్కలు నాటేవారు.
మొక్కలను పెంచాలని చిన్నతనం నుంచే రామయ్య ప్రచారం చేశారు. మొక్కలు నాటడంతో దరిపల్లి రామయ్య అలియాస్ వనజీవి రామయ్యగా ఆయన పేరు మారింది. వనజీవి రామయ్య కు నలుగురు పిల్లలు ఉన్నారు. వారిలో ముగ్గురు అబ్బాయిలు ఒక అమ్మాయి కాగా… వనజీవి రామయ్య భార్య పేరు జానకమ్మ. రామయ్య చేసిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ పురస్కారంతో 2018లో సత్కరించింది. అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదగా ఆయన పద్మశ్రీ పురస్కారాన్ని దేశ రాజధానిలో అందుకున్నారు.
ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లికి చెందిన రామయ్య.. ప్రభుత్వ, ప్రైవేటు అవార్డులు అలాగే 3000 షీల్డ్ లను తన జీవితంలో అందుకున్నారు. రామయ్య మృతితో ప్రకృతి ప్రేమికుల సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇక ఆయన అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వనజీవి రామయ్య మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ప్రకృతి, పర్యావరణం లేనిదే మానవ మనుగడ లేదని సిద్ధాంతాన్ని బలంగా నమ్మిన వ్యక్తిగా వనజీవి రామయ్య పేరు సంపాదించారని రేవంత్ రెడ్డి కొనియాడారు. ఓ వ్యక్తిగా మొక్కలు నాటడం ప్రారంభించి మొత్తం సమాజాన్ని ప్రభావితం చేశారని అన్నారు. రామయ్య మృతి సమాజానికి తీరని లోటు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివర్ణించారు. ఆయన మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా సంతాపం వ్యక్తం అవుతుంది.