గుప్త నిధుల కోసం తవ్వకాలు, శివాలయంలో దారుణం
సంగారెడ్డి జిల్లా నారాయణ్‌ఖేడ్‌లో బరితెగించారు కొందురు గుర్తు తెలియని వ్యక్తులు. ఏకంగా కాశీ విశ్వనాథ ఆలయంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపట్టారు.

సంగారెడ్డి జిల్లా నారాయణ్‌ఖేడ్‌లో బరితెగించారు కొందురు గుర్తు తెలియని వ్యక్తులు. ఏకంగా కాశీ విశ్వనాథ ఆలయంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపట్టారు. నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతం కావడంతో ఎవరికీ తెలియకుండా గుడి లోపల తవ్వకాలు చేపట్టారు. ఎవరైనా చూస్తే కొడతారనే భయం కూడా లేకుండా తవ్వకాలు జరిపారు.
ఉదయం 10 నుంచి సాయంత్రం 6 వరకూ అక్కడ తవ్వకాలు జరిగినట్టు జ్ఞానమ్మ అనే స్థానికురాలు చెప్తోంది. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే సంజీవరెడ్డి ఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే విచారణ చేపట్టాలని పోలీసులను ఆదేశించారు.