3000 యోధులతో ఫైట్.. నీరు, నిప్పుతో 10000 కోట్ల చలగాటం..

రాజమౌళి టీం షాక్ ఇస్తోంది. సూపర్ స్టార్ మహేశ్ బాబు, ప్రియాంక చోప్రా, ఫ్రుథ్వీరాజ్ తో పాటు ఏకంగా 3000 మంది స్టంట్ మాస్టర్లకు భారీ ట్రైనింగ్ సెషన్ రన్ చేస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 21, 2025 | 02:50 PMLast Updated on: Apr 21, 2025 | 2:50 PM

Fight With 3000 Warriors 10000 Crores Of Money With Water And Fire

రాజమౌళి టీం షాక్ ఇస్తోంది. సూపర్ స్టార్ మహేశ్ బాబు, ప్రియాంక చోప్రా, ఫ్రుథ్వీరాజ్ తో పాటు ఏకంగా 3000 మంది స్టంట్ మాస్టర్లకు భారీ ట్రైనింగ్ సెషన్ రన్ చేస్తోంది. 350 కోట్ల ఖర్చుతో కూడిన సింగిల్ ఫైట్ సీన్ కోసం ఇంత కసరత్తు జరుగుతోంది. ఆల్రెడీ మూడు షెడ్యూళ్ల షూటింగ్ పూర్తి చేసిన ఫిల్మ్ టీం, నాలుగో షెడ్యూల్ ని స్టార్ట్ చేసింది. ఇంతలో నీరు, నిప్పు, ఇసుక తో చెలగాటానికి రెడీ అయ్యింది. హిందూ మైథాలజీ కనెన్షన్ తో కథని సిద్దం చేసిన టీం, ఇప్పుడు ఆ కథ ఆయువు పట్టులాంటి ఫైట్ సీన్ ని మైండ్ బ్లాంక్ చేసేలా తీయబోతోందట. వంద ఎకరాల్లో ఆర్టిఫీషియల్ అడవిని సిద్దం చేస్తూ ఫిల్మ్ టీం గిన్నీస్ రికార్డు క్రియేట్ చేస్తూనే, 150 కోట్ల సెట్ ని భారీ బాంబ్ తో పేల్చేయబోతోంది. ఇదంతా లీక్ అవ్వద్దనకుంటూనే, లీకయ్యేలా చేసింది ఫిల్మ్ టీం. ప్రపంచ వ్యాప్తంగా 10 వేల కోట్లని ఒకేరోజులో రాబట్టాలంటే, అందులో కంటెంట్ మతిపోగొట్టేలా ఉండాలి…. ఇంతకి 3 వేల స్టంట్ మాస్టర్లతో 10 వేలకోట్లకి ఉన్న లింకేంటి? ఇంత వేగంగా, ఇంత హడావిడిగా రాజమౌలి ఏం చేస్తున్నాడు..? హావేలుక్

రాజమౌళి సినిమా అంటేనే లార్జర్ దేన్ లైఫ్ అనిపించే సీన్లు, సెట్లు, ఫైట్లు… అలాంటి తాను ఇప్పడా లార్జర్ దేన్ లైఫ్ అనే సైజునే మారిస్తే, డెఫినేషనే మారిపోతుంది. అదే పని చేస్తున్నాడు. సూపర్ స్టార్ మహేశ్ బాబు 29వ మూవీ కోసం ఇండియన్ సినిమా ఎన్నడూ కని విని ఎరుగని ఫైట్ సీన్ డిజైన్ చేశాడు. షూటింగ్ కి కూడా అందర్ని ప్రిపేర్ చేస్తున్నాడు.ఇందులో భారీ బోట్లు తో ఫైట్లు, భారీ ఎక్స్ ప్లోజివ్స్, అలానే వాటర్ ఫైట్ సీన్స్ హాలీవుడ్ ని తలదన్నేలా ప్లాన్ చేశాడట. వన్ ఆఫ్ యాంబీషియస్ ఫైట్ సీన్ ని మే, జూన్ నెలల్లో పూర్తి చేయబోతున్నాడట. ఇది సినీ టీం లీక్ చేసిందో, కావాలనే బయటికి వదిలిందో, కాని సాలిడ్ సోర్స్ నుంచే ఈ విషయం బయటికి పొక్కింది.

ఈనెలాఖరి నుంచి మహేశ్ బాబు, ప్రియాంక చోప్రా, ఫ్రుథ్వీ రాజ్ సుకుమారన్ కి ఈ ఫైట్ కోసం ఫిజికల్ ట్రైనింగ్ ఇవ్వబోతున్నారట. వాళ్లే కాదు 3000 మంది స్టంట్ మ్యాన్ లో అలానే కెమెరామెన్ తోపాటు టోటల్ క్రూ ఈ ట్రైనింగ్ కి సిద్ధమైంది. అసలే, నీరు నిప్పుతో చెలగాటం కాబట్టి , గ్రాండియర్ సీన్ కోసం ఈ రేంజ్ ప్రిపరేషన్ తప్పదు.ఈ మోస్ట్ యాంబీషియస్ ఫైట్ సీక్వెన్స్ ని హైద్రబాద్ లోనే 100 ఎకరాల్లో ఏర్పాటు చేసే క్రుత్రిమ అడవి సెట్ లో తీయబోతున్నారు. 70శాతం ఇక్కడ, 30 శాతం బంగాలా ఖాతంలో షూట్ చేస్తారని తెలుస్తోంది. ట్రైనింగ్, షూటింగ్ రెండూ ఈనెలాకరి నుంచి మే, జూన్ వరకు కొనసాగబోతున్నాయి.

అంతర్జాతీయ స్థాయిలో ఈ ఫైట్ సీన్ ని తెరకెక్కించబోతున్నారని తెలుస్తోంది. 55 వేల థియేటర్స్ లో ఒకరోజు ఈమూవీ ఆఢితేనే 10 వేల కోట్లు వచ్చేలా ఉన్నాయంటున్నారు. అలాంటి సీన్ ఉన్నప్పుడు, మరి సినిమాలో ఫైట్ సీన్ ఏరేంజ్ లోఉండాలి.. అందుకే గూస్ బంప్స్ వచ్చేలా ఇంటర్నేషనల్ స్టాండర్ట్స్ లో ఈ యాక్షన్ సీక్వెన్స్ ని ప్లాన్ చేశారు. ముందుగా ప్రియాంక చోప్రా తో ఈ ఫైట్ సీన్స్ షూట్ చేస్తారట. తర్వాత మహేశ్, ఆతర్వాత ఫ్రుత్వీ రాజ్ సుకుమారన్ షూట్ లో జాయిన్ అయ్యే ఛాన్స్ ఉంది. టెక్నాలజీ అప్ గ్రేడ్ అవటంతో, అంతా విడివిడిగా నటించినా, ఫైనల్ కట్ లో కలిసి ఉన్నట్టు చూపించే ఛాన్స్ ఉండటంతో, ఎవరికి వాళ్లు విడివిడిగా ఫైట్ సీన్స్ చేయబోతున్నారు.