3 కోట్ల ఖర్చుతో సూపర్ ప్రోమో… 2000 కోట్ల గూస్ బంప్స్..

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ తీస్తున్నమూవీ డ్రాగన్. ఆల్రెడీ హీరోలేని సీన్లను తీసిన తను, ఇప్పుడు హీరో రాకతో, వేగం పెంచబోతున్నాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 21, 2025 | 03:30 PMLast Updated on: Apr 21, 2025 | 3:30 PM

Super Promo At A Cost Of 3 Crores 2000 Crores Goose Bumps

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ తీస్తున్నమూవీ డ్రాగన్. ఆల్రెడీ హీరోలేని సీన్లను తీసిన తను, ఇప్పుడు హీరో రాకతో, వేగం పెంచబోతున్నాడు. ఈ మంగళవారం నుంచే ఎన్టీఆర్ డ్రాగన్ సెట్లో అడుగుపెడుతున్నాడు. ఐతే తను అడుగుపెట్టగానే తన మీద బర్త్ డే బాధ్యతలు పెంచేస్తున్నాడు ప్రశాంత్ నీల్. అంటే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బర్త్ డేకి భారీ సర్ ప్రైజ్ ని ప్లాన్ చేసిన ప్రశాంత్ నీల్, ఆ బాధ్యతంతా ఎన్టీఆర్ మీదే పెట్టాడట. ఇదెలా ఉందంటే, తన బర్త్ డే కి తానే గిఫ్ట్ ఆర్డర్ చేసుకున్నట్టు… కాకపోతే ఇదేనిజం.. ఎందుకంటే తన ఫ్యాన్స్ కి ఊహించని సాలిడ్ సర్ ప్రైజ్ ఇవ్వాలంటే, అది ఎన్టీఆర్ వల్లే సాధ్యమౌతుంది.. ఇంతకి ఏంటా సర్ ప్రైజ్… అది ఎన్టీఆర్ అయితేనే ఎందుకు ఇవ్వగలడు? టేకేలుక్

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ ని, గూస్ బంప్స్ వచ్చే అప్ డేట్ ని రెడీ చేస్తున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. మే 20న ఎన్టీఆర్ బర్త్ డే అవటంతో, డెఫినెట్ గా ఏదో ఒక సర్ ప్రైజ్ ని అభిమానులు ఎక్స్ పెక్ట్ చేస్తారు. ఆ ఎక్స్ పెక్టేషన్స్ నే మించే గిఫ్ట్ రెడీ చేస్తున్నాడు ప్రశాంత్ నీల్.ఇప్పటి వరకు హీరో లేని సీన్లు, చిన్న చిన్న షాట్లు తీస్తూ వచ్చిన ప్రశాంత్ నీల్, ఇక మీదగ మంగళవారం నుంచి అసలైన కథని తెరకెక్కించబోతున్నాడు. ఈనెల 22న అంటే మంగళవారం ఎన్టీఆర్ సెట్లో అడుగుపెట్టబోతున్నాడు. వచ్చి రాగానే 21 రోజులు గ్యాప్ లేకుండా యాక్షన్ సీక్వెన్స్ తో బిజీ కాబోతున్నాడు.

నెవర్ బిఫోర్ అనే రేంజ్ లోతన ఎంట్రీ సీన్ ని యుద్ధట్యాంకర్ ఫైట్ సీన్ తో ప్లాన్ చేసిన ప్రశాంత్ నీల్, మే 20కి ఒకరోజు ముందు అటే మే 19న ఎన్టీఆర్ బర్త్ డే సర్ ప్రైజ్ రెడీ చేయాలంటే, ఈమంగళవారం నుంచి ఎన్టీఆరే బాగా కష్టపడాలి… ఈ 22 నుంచి మే 15 వరకు ఎన్టీఆర్ నటించబోయే ఫైట్ సీన్స్ తోనే ఒక ప్రోమో ప్లాన్ చేస్తున్నాడట ప్రశాంత్ నీల్.అందులోని కొన్ని షాట్లు, డైలాగ్ సీన్స్ తీసుకుని ఒక ప్రోమోలా రెడీ చేయించబోతున్నాడు. దాన్నే ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్ గా ఒకరోజు ముందు రిలీజ్ చేయబోతున్నాడు. ఆల్రెడీ ఎన్టీఆర్ నటించిన హిందీ మూవీ వార్ 2 కూడా ప్రోమో రూపంలో తారక్ ఫ్యాన్స్ కి సర్ ప్రైజ్ కిక్ ఇవ్వబోతోంది. మే 1 న వార్ 2 మూవీ లో ఎన్టీఆర్ లుక్ తాలూకు మోషన్ టీజర్ లాంచ్ చేయబోతున్నారు.

మే 19న ఎన్టీఆర్ పాత్ర తాలూకు విజువల్స్ తో 50 సెకన్ల వార్ 2 ప్రోమోని వదలబోతున్నారు. దానికంటే ముందే డ్రాగన్ ప్రోమోని వదలాలని ఫిక్స్ అయ్యాడట ప్రశాంత్ నీల్. అందుకే గట్టిగానే ప్లాన్ చేశాడు. వరుసగా మూడు వారాలు ఎన్టీఆర్ తో తీసే యాక్షన్ సీక్వెన్స్ లోనే కొంత భాగాన్ని ప్రోమోగా రెడీ చేయించేందుకు అన్నిరకాలుగా ప్రిపేర్ అయినట్టు తెలుస్తోంది.