అదొక చెత్త సినిమా.. ఒప్పుకుని అనవసరంగా బుక్ అయ్యా.. ప్రియదర్శి సంచలనం..!
కమెడియన్ గా ఇండస్ట్రీకి వచ్చి హీరోగా మారడమే గొప్ప విషయం అనుకుంటే.. తనకంటూ ప్రత్యేకంగా ఒక మార్కెట్ క్రియేట్ చేసుకోవడం ఇంకా పెద్ద విషయం.

కమెడియన్ గా ఇండస్ట్రీకి వచ్చి హీరోగా మారడమే గొప్ప విషయం అనుకుంటే.. తనకంటూ ప్రత్యేకంగా ఒక మార్కెట్ క్రియేట్ చేసుకోవడం ఇంకా పెద్ద విషయం. ఇందులో సక్సెస్ అయ్యాడు ప్రియదర్శి. పెళ్లిచూపులు సినిమాతో తొమ్మిదేళ్ల కింద ఇండస్ట్రీకి వచ్చాడు ఈయన. దానికి ముందు కూడా కొన్ని సినిమాలు చేసిన ఎవరు ఈయనను గుర్తు పట్టలేదు. పెళ్లిచూపులు తర్వాత ప్రియదర్శి ఒక్కసారిగా బిజీ అయిపోయాడు. కెరీర్ మొదటి నుంచి కేవలం కమెడియన్ మాత్రమే కాదు మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఉండిపోవాలని ప్రయత్నిస్తున్నాడు ఈ నటుడు. అందుకు తగ్గట్టుగానే మంచి మంచి క్యారెక్టర్స్ ఎంచుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఆయన దగ్గరికి మల్లేశం, బలగం, కోర్ట్ లాంటి అద్భుతమైన సినిమాలు వచ్చాయి. అందులో బలగం, కోర్ట్ కమర్షియల్ గా కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఇందులో నాని నిర్మించిన కోర్ట్ చిత్రం ఏకంగా 60 కోట్లకి పైగా వసూళ్లు రాబట్టింది.
ఇది వచ్చిన 50 రోజుల లోపే ఏప్రిల్ 25న ప్రియదర్శి మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన సారంగపాణి జాతకంతో వస్తున్నాడు దర్శి. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే తన పాత సినిమాల గురించి గుర్తు చేసుకున్నాడు ఈ నటుడు. ఈ క్రమంలోనే తన కెరీర్ లో ఒక సినిమా అనవసరంగా ఒప్పుకున్నానని.. కమిట్ అయిన తర్వాత తప్పు చేశాను అనిపించింది అన్నాడు. ఆ సినిమా పేరు మిఠాయి. అసలు ఇలాంటి ఒక సినిమా వచ్చినట్టు కూడా ప్రేక్షకులకు ఐడియా లేదు. అందుకే ప్రియదర్శి కూడా తన కెరీర్ లో ఈ సినిమా చేసి తప్పు చేశాను అని చెప్పాడు. ఇదొక్కటే కాదు తన కెరీర్ లో ఇంకా కొన్ని సినిమాలు నచ్చకుండా చేశాను అని చెప్పాడు ఈయన. తాను కమెడియన్ అవుదాం అని ఇండస్ట్రీకి రాలేదనీ.. ఎందుకంటే సత్య, వెన్నెల కిషోర్ తరహాలో తాను కామెడీ పండించలేను అని చెప్పాడు దర్శి.
అందుకే కోట శ్రీనివాసరావు, ప్రకాష్ రాజ్ లాంటి నటులను తాను ఆదర్శంగా తీసుకున్నానని.. అలా అవ్వాలని ఆశతోనే ఇండస్ట్రీకి వచ్చినట్టు చెప్పాడు ప్రియదర్శి. తన 9 ఏళ్ళ కెరీర్ లో తీసుకున్న మంచి నిర్ణయం కోర్ట్ సినిమా ఒప్పుకోవడం అని.. ఆ చిత్రం తన కెరీర్ లోనే బెస్ట్ సినిమా అన్నాడు ఈయన. ఇక తన కెరీర్లో ఒప్పుకున్న చెత్త సినిమా మిఠాయి అని ప్రియదర్శి గుర్తు చేసుకున్నాడు. ఆ సినిమాని తాను మనస్ఫూర్తిగా ఒప్పుకోలేదనీ.. దర్శకుడు కూడా ఆ చిత్రాన్ని సీరియస్ గా తీసుకోలేదన్నాడు. మిఠాయి చిత్రం నుంచి తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదని తెలుసుకున్నా.. ఎలాంటి సినిమాలు చేయకూడదనే క్లారిటీ మిఠాయి చిత్రం నుంచి వచ్చిందనీ చెప్పుకొచ్చాడు ప్రియదర్శి. అలాగే తాను గతంలో స్మోకింగ్ చేసేవాడిని అని.. కానీ దాని వల్ల ఇబ్బందులు వస్తాయని తెలిసి మానేసినట్లు ప్రియదర్శి తెలిపాడు.