బ్రేకింగ్: భర్తను చం*పి.. సైలెంట్‌గా పూడ్చేసి, KPHBలో ప్రాణం తీసిన ఎఫైర్
ఓ నిండు ప్రాణాన్ని వివాహేతర సంబంధం బలిగొన్న ఘటన హైదరాబాద్ KPHBలో ఆలస్యంగా వెలుగు చూసింది. పాత లింగయ్యపల్లి గ్రామానికి చెందిన సాయిలు అనే వ్యక్తి KPHBలో వాచ్‌మెన్‌గా పని చేస్తున్నాడు.

ఓ నిండు ప్రాణాన్ని వివాహేతర సంబంధం బలిగొన్న ఘటన హైదరాబాద్ KPHBలో ఆలస్యంగా వెలుగు చూసింది. పాత లింగయ్యపల్లి గ్రామానికి చెందిన సాయిలు అనే వ్యక్తి KPHBలో వాచ్‌మెన్‌గా పని చేస్తున్నాడు. HIVతో బాధపడుతున్న సాయిలుకు తన భార్య కవితతో 15 ఏళ్లుగా గొడవలు ఉన్నాయి. ఇద్దరూ వేరే వేరుగానే ఉంటున్నారు. ఇద్దరూ వేరు వేరుగా వివాహేతర సంబంధాలు పెట్టుకున్నారు. రీసెంట్‌గానే సాయిలు హైదరాబాద్‌కు షిఫ్ట్ అయ్యాఆడు. అయితే సాయిలును పూర్తిగా అడ్డు తొలగించుకోవాలి అనుకున్న కవిత రీసెంట్‌గా భర్త దగ్గరకు వచ్చింది.
తన చెల్లెలు ఆమె భర్త సాయంతో సాయిలు మర్డర్‌కు ప్లాన్ చేసింది. ప్లాన్ ప్రకారం ముగ్గురూ కలిసి సాయిలునను కరెంట్ షాక్ ఇచ్చి చంపేశారు. గుట్టు చప్పుడు కాకుండా శవాన్ని సమీపంలో పూడ్చేశారు. కవిత ఏం తెలియనట్టు స్వగ్రామానికి వెళ్లి సాయిలు కనబడంటేదని సర్పంచ్‌కు ఫిర్యాదు చేసింది. కానీ కవిత మీద అనుమానంతో ఆమెను గట్టిగా నిలదీయడంతో అసలు విషయం బయటికి చెప్పింది. దీంతో KPHB పోలీస్ స్టేషన్‌లో కవిత మీద ఫిర్యాదు చేశారు ఆ గ్రామ సర్పంచ్.