బ్రేకింగ్: పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత
రోమన్ క్యాథలిక్ చర్చ్ లీడర్ పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూశారు. వాటికన్ సిటీలోని తన ఇంట్లో 88 ఏళ్ల వయసులో చనిపోయారు పోప్. చాలా కాలం నుంచి పోప్ శ్వాసకోస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు.

రోమన్ క్యాథలిక్ చర్చ్ లీడర్ పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూశారు. వాటికన్ సిటీలోని తన ఇంట్లో 88 ఏళ్ల వయసులో చనిపోయారు పోప్. చాలా కాలం నుంచి పోప్ శ్వాసకోస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో తీవ్ర అనారోగ్యంతో హాస్పిటల్లో కూడా చేరారు. కానీ కొన్ని రోజుల తరువాత పోప్ ఫ్రాన్సిస్‌ను డిశ్చార్జ్ చేశారు డాక్టర్లు.
వాటికన్ సిటీలోని ఆయన ఇంటికి తరలించారు. అప్పటి నుంచీ పోప్ అక్కడే ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. కానీ పరిస్థితి విషమించడంతో ఇంట్లోనే తుది శ్వాస విడిచారు. 1936లో అర్జెంటినాలో పోప్ జన్మించారు. 2013 మార్జ్ 13న పోప్‌గా ఎన్నికయ్యారు. అమెరికా నుంచి పోప్‌గా ఎన్నికైన మొదటి వ్యక్తి పోప్ ఫ్రాన్సిస్. ఆయన మృతితో యావత్ క్రిస్టియన్ సమాజం శోక సంద్రంలో మునిగిపోయింది.