బ్రేకింగ్: అడ్డంగా దొరికిన వెంకటరామి రెడ్డి
ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకటరామి రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసారు. రాష్ట్ర సచివాలయ క్యాంటీన్ ఎన్నికల నేపధ్యంలో ఉద్యోగులను ప్రలోభపెట్టేందుకు మందు, విందు పార్టీలు ఇవ్వడంతో ఎక్సైజ్ పోలీసులు మఫ్టీలో దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకటరామి రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసారు. రాష్ట్ర సచివాలయ క్యాంటీన్ ఎన్నికల నేపధ్యంలో ఉద్యోగులను ప్రలోభపెట్టేందుకు మందు, విందు పార్టీలు ఇవ్వడంతో ఎక్సైజ్ పోలీసులు మఫ్టీలో దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. ఉద్యోగులను ప్రలోభపెట్టేందుకు పార్టీ ఏర్పాటు చేసిన సచివాలయ ఉద్యోగుల సంఘం నేత వెంకట్రామి రెడ్డితో పాటుగా కీలక ఉద్యోగులు కూడా పాల్గొన్నారు. ఈ విషయంపై పక్కా సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి వెంకట్రామిరెడ్డిని నిన్న అర్థరాత్రి అదుపులోకి తీసుకున్నారు.
ఉద్యోగులను ప్రభావితం చేయడానికి గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని కొండపావులూరి గార్డెన్స్ లో ఉద్యోగులకు మందు పార్టీ ఏర్పాటు చేసినట్టు గుర్తించారు. ఎక్సైజ్ నిబంధనల ప్రకారం… ఇటువంటి మందు పార్టీలు ఏర్పాటుకు ముందుగా ఎక్సైజ్ శాఖ నుంచి అనుమతి కావాల్సి ఉంటుంది. కాని ఎటువంటి అనుమతులేవీ లేకుండానే విందు జరుగుతోందన్న సమాచారం అందుకున్న ఎక్సైజ్ అధికారులకు గురువారం రాత్రి 11 గంటలకు దాడి చేసి పలువురుని అదుపులోకి తీసుకున్నారు.
అక్కడ ఐదు ఫుల్ బాటిళ్ల మద్యం ఉండడంతో అది నిబంధనలకు విరుద్ధమని అధికారులు స్పష్టం చేసారు. తమకు ఆ విషయం తెలియదని వెంకట్రామిరెడ్డి ఆహ్వానిస్తే వచ్చామని కొందరు ఉద్యోగులు సమాచారం ఇవ్వగా… పోలీసులు వెంకట్రామి రెడ్డిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఏఈఎస్ సూర్యనారాయణ, గుంటూరు ఎక్సైజ్ ఏఈఎస్ మరియబాబు పాల్గొన్నారు.