ధోనీ మార్క్ అదిరిందిగా, బ్యాలెన్సింగ్ గా చెన్నై టీమ్

ఐపీఎల్ మెగావేలంలో ఫ్రాంచైజీల మనీ పర్స్ పెరిగినా ఈ సారి ఆచితూచి ఖర్చు చేశాయి. మొత్తంగా రెండు రోజుల పాటు జ‌రిగిన మెగా వేలంలో 182 మంది ఆట‌గాళ్ల‌ను అన్ని ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి. వీరిలో 62 మంది విదేశీ ఆట‌గాళ్లు ఉన్నారు. ఇక ఎనిమిది మందిని జ‌ట్లు ఆర్టీఎమ్‌ ద్వారా సొంతం చేసుకున‌నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 29, 2024 | 11:37 AMLast Updated on: Nov 29, 2024 | 11:37 AM

Dhonis Mark Is Outstanding Chennai Team Is Balancing

ఐపీఎల్ మెగావేలంలో ఫ్రాంచైజీల మనీ పర్స్ పెరిగినా ఈ సారి ఆచితూచి ఖర్చు చేశాయి. మొత్తంగా రెండు రోజుల పాటు జ‌రిగిన మెగా వేలంలో 182 మంది ఆట‌గాళ్ల‌ను అన్ని ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి. వీరిలో 62 మంది విదేశీ ఆట‌గాళ్లు ఉన్నారు. ఇక ఎనిమిది మందిని జ‌ట్లు ఆర్టీఎమ్‌ ద్వారా సొంతం చేసుకున‌నాయి. అన్ని ప్రాంఛైజీలు కలిపి రూ.639.15 కోట్లు ప్లేయ‌ర్ల‌ కోసం ఖ‌ర్చు చేశాయి. ఇదిలా ఉంటే ఐపీఎల్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్స్ లో ఒకటిగా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ పక్కా ప్లానింగ్ తో బరిలోకి దిగి మంచి ప్లేయర్స్ ను కొనుగోలు చేసింది. వేలంలో కెప్టెన్ ధోనీ మార్క్ కనిపించిందంటూ ఫ్యాన్స్ వ్యాఖ్యానిస్తున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ ఐదుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. రుతురాజ్ గైక్వాడ్ 18 కోట్లు, మతీషా పతిరానా 13 కోట్లు, శివమ్ దూబే 12 కోట్లు, రవీంద్ర జడేజా 18 కోట్లు), ఎంఎస్ ధోనిని అన్ క్యాప్డ్ కేటగిరీలో 4 కోట్లకే దక్కించుకుంది. రిటైన్ ఆటగాళ్ల కోసం ఆ ఫ్రాంచైజీ 65 కోట్లు ఖర్చు చేసింది.

దీంతో 55 కోట్లతో వేలంలోకి వచ్చిన చెన్నై మరోసారి అనుభవానికే పెద్ద పీట వేస్తూ.. సీనియర్ ఆటగాళ్లనే కొనుగోలు చేసింది. అంతేకాకుండా జట్టు భవిష్యత్తు కోసం అనామక ఆటగాళ్లపై కూడా ఖర్చు పెట్టింది. తెలుగు తేజం షేక్ రషీద్‌తో పాటు అనేక మంది కుర్రాళ్లను తీసుకుంది. తమ పాత ఆటగాళ్లు అయిన డేవన్ కాన్వే, రచిన్ రవీంద్రలను తక్కువ ధరకే తిరిగి కొనుగోలు చేసింది. డెన్ కాన్వే ను 6.25 కోట్లు, రాహుల్ త్రిపాఠి 3.4 కోట్లు, రచిన్ రవీంద్రను 4 కోట్లు, కలీల్ అహ్మద్ ను 4.8 కోట్లు, విజయ్ శంకర్ ను 1.2 కోట్లకు కొనుగోలు చేసింది. నూర్ అహ్మద్ ను రూ.10 కోట్లకు కొనుగోలు చేయగా.. రవిచంద్రన్ అశ్విన్ ను రూ.9.75 కోట్లకు వేలంలో దక్కించుకుంది. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ సామ్ కరణ్‌‌ను తక్కువ ధరకే దక్కించుకుంది. భారత పేసర్లలో ఖలీల్ అహ్మద్, ముఖేష్ చౌదరీలను కొనుగోలు చేసింది. బ్యాటర్లలో వెటరన్ ప్లేయర్ దీపక్ హుడాను కొనుగోలు చేసింది. వేలంలో మొత్తం 20 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసి 25 మందితో జట్టును తయారు చేసుకుంది. ఐపీఎల్ రూల్స్ ప్రకారం ఒక జట్టులో గరిష్ఠంగా 25 మంది ఆటగాళ్లు, కనిష్ఠంగా 21 మంది ఆటగాళ్లు ఉండొచ్చు