Home » Tag » TDP
తెలంగాణాలో బీఆర్ఎస్ పార్టీని టీడీపీ దెబ్బ కొడుతుందా...? తమ నాయకులను లాక్కున్న గులాబీ పార్టీకి షాక్ ఇవ్వడానికి చంద్రబాబు రోడ్ మ్యాప్ సిద్దం చేసారా...? బీఆర్ఎస్ లో ఉండలేక అధికార కాంగ్రెస్, మరో ప్రతిపక్షం బిజెపిలోకి వెళ్ళలేక సతమవుతున్న ఎమ్మెల్యేలను కారు దింపి, బాబు సైకిల్ ఎక్కిస్తారా...?
టీడీపీలోకి మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణ చేరిక దాదాపు ఖరారు అయిపోయింది. ఇటీవల వైసీపీకి & రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన మోపిదేవి వెంకటరమణా రావు... టీడీపీలో చేరే అంశంపై స్పష్టత రాలేదు.
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ వివాదం ఇప్పుడు టీడీపీ కేంద్ర కార్యాలయానికి చేరింది. ఆయనపై వచ్చిన ఆరోపణలను సీరియస్ గా తీసుకున్న అధిష్టానం విచారణ మొదలుపెట్టింది. ఫైవ్ మెన్ కమిటీ ముందుకు కొలికపూడి శ్రీనివాస్ వచ్చి వివరణ ఇచ్చారు.
తిరుమల లడ్డు వ్యవహారం ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య యుద్దానికి వేదిక కానుందా...? తమిళనాడు ఉప ముఖ్యమంత్రి స్టాలిన్ పై పవన్ వ్యాఖ్యలు చేసారు అంటూ కేసు పెట్టడం వెనుక కారణం ఏంటీ...? ఇప్పుడు పవన్ కూడా కేసు పెట్టి కౌంటర్ ఇస్తారా...?
వైసీపీ నేతలు ఒక్కొక్కరిగా జైలుకి వెళ్ళడంతో ఆ పార్టీ అగ్ర నాయకత్వంలో కూడా ఆందోళన మొదలైంది. గత ప్రభుత్వంలో అన్నీ తానై వ్యవహరించిన సజ్జల రామకృష్ణా రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి.
తిరుపతి వారాహీ బహిరంగ సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసారు. “నా కూతురును తిరుమలకు తీసుకొస్తే డిక్లరేషన్ ఇప్పించాను. ఏ దారిలో సంకెళ్లు ఉన్నా సవాలుగా తీసుకుని ముందుకు వెళతాను.
ఏపీ సిఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నెల 7న ఢిల్లీకి సిఎం చంద్రబాబు వెళ్ళే అవకాశం ఉందని టీడీపీ వర్గాలు ప్రకటించాయి. ప్రధాని మోదీ, అమిత్ షాలతో భేటీ అయ్యే అవకాశం ఉంది.
తిరుమల లడ్డు వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా ఏపీతో పాటుగా దేశ వ్యాప్తంగా పెద్ద దుమారమే రేపుతోంది. ఈ వ్యవహారంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దూకుడు అందరిని ఆశ్చర్యానికి గురి చేసిందనే చెప్పాలి.
ఆంధ్రప్రదేశ్ లో నూతన మద్యం పాలసి అమలులోకి రానుంది. మద్యం దుకాణాల లైసెన్స్ జారీ కి నోటిఫికేషన్ జారీ చేసింది ఏపీ సర్కార్. రెండేళ్ల కాల పరిమితితో ఈ అక్టోబరు 12 నుంచి 2026 సెప్టెంబరు 30 వరకూ లైసెన్సులు జారీకి ఏర్పాట్లు చేసింది.
పవిత్ర తిరుమల పుణ్యక్షేత్రం కేంద్రంగా రాజకీయం దిగజారుతోంది. లడ్డు వివాదం మరువక ముందే టికెట్ల అమ్మకం వ్యవహారం ఇప్పుడు కూటమి వెలుగులోకి తెచ్చింది. దేవుడితో రాజకీయాలు చేస్తున్నది ఎవరు అనే అంశం పక్కన పెడితే ప్రతీ రోజు రాజకీయ పార్టీలు సిగ్గు విడిచి పవిత్ర తిరుమల కొండను వేదికగా చేసుకుని తమ రాజకీయ వ్యూహాలు అమలు చేస్తున్నాయి.