సీఎం సార్ @ 75 చంద్రబాబు జీవితంలో ఎవరికీ తెలియని నిజాలు
అభివృద్ధిని పరుగులు పెట్టించిన స్వప్నకర్త. తెలుగు రాష్ట్రాలను ఐటీ వైపు నడిపించిన రూపకర్త. 40 ఏళ్ల రాజకీయ అనుభవం.. 14 ఏళ్లు సీఎంగా ప్రస్థానం.

అభివృద్ధిని పరుగులు పెట్టించిన స్వప్నకర్త. తెలుగు రాష్ట్రాలను ఐటీ వైపు నడిపించిన రూపకర్త. 40 ఏళ్ల రాజకీయ అనుభవం.. 14 ఏళ్లు సీఎంగా ప్రస్థానం. ఆర్థికశాస్త్రానికి పూనిక తోడించి, పాలనకు పునాది వేసిన తెలుగు జాతి నిర్మాత. ఆయన గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు.. ఆయన ప్రస్థానం గురించి రాయాలంటే పేజీలు సరిపోవు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా.. ఇండియన్ పొలిటికల్ సిస్టంలో వన్ ఆఫ్ ది టాలెస్ట్ లీడర్.. నారా చంద్రబాబు నాయుడు.
ఒకటి రెండు రాదు.. దాదాపు 5 దశాబద్ధాలు తెలుగు రాజకీయాల్లో వెలుగులీనిన ఆయన ప్రస్థానం.. అనన్య సామాన్యం. 75 ఏళ్ల వయసులో కూడా ఆయన ప్రచారం చేసే తీరు చూసి ప్రతీ ఒక్కరికీ ఆశ్చర్యం వేస్తుంది. యువకులు కూడా ఆయాసపడే ఎండలో నిలడబడి ఆయన ఇచ్చే స్పీచ్‌లు వింటే ప్రతీ ఒక్కరిలో ఆవేశం కట్టలు తెంచుకుంటుంది. దాదాపు 5 దశాబ్ధాల ఆయన రాజకీయ ప్రస్థానం అంత సులభంగా ఏం జరగలేదు. ఎన్నో అవమానాలు.. మరెన్నో అపజయాలు. ఆఖరికి నక్సల్స్ బాంబులు కూడా.. బాబు గుండెను భయపెట్టలేకపోయాయి.
2003 అక్టోబర్ 1న చంద్రబాబు మీద బాంబు దాడి జరిగింది. దాదాపు 10 అడుగుల మేర ఆయన ఉన్న కారు ఎగిరిపడింది. ఆ ఘటన చూస్తే ఎవరికైనా గుండె ఆగిపోతుంది. కానీ బాంబు దాడిలో చిద్రమైన కారు నుంచి రక్తమోడుతున్న బట్టలతో ఓ యోధుడిలా బయటికి వచ్చారు చంద్రాబాబు. ఇంతటి దాడి జరిగినా ఆయన స్వప్నం చెదరలేదు.. ఆ గుండె బెదరలేదు. ఇదొక్కటి చాలు.. ఆయన కమిట్‌మెంట్‌లో ఏంటో చెప్పడానికి.
20 ఏప్రిల్ 1950లో నారావారి పల్లెలో చంద్రబాబు జన్మించారు. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్‌లో డిగ్రీ చేశారు. అందుకే అనుకుంటా ఆయన ప్రతీది చాలా కాలిక్యులేడెట్‌గా చేస్తుంటారు. తెలుగు వాడు గర్వించే తెలుగు దేశం పార్టీని ముందుండి నడిపిస్తున్న చంద్రబాబు.. తన రాజకీయ ప్రస్థానాన్ని మాత్రం 1978లో కాంగ్రెస్‌లో మొదలు పెట్టారు. 1978లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 28 ఏళ్లకే మంత్రి పదవి చేబట్టారు. ఇంత చిన్న వయసులోనే మంత్రి అయ్యారంటే ఆయనకు ప్రజా సమస్యల మీద ఎలాంటి అవగాహన ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఆ సమయంలో టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ చూపు చంద్రబాబు మీద పడింది. ఇలాంటి వాడు నా పక్కనే ఉంటే బాగుండేది అనుకున్నారో ఏమో. ఏకంగా తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేశారు. 1980లో ఎన్టీఆర్ కూతురు భువనేశ్వరిని చంద్రబాబు పెళ్లి చేసుకున్నారు. 1983లో తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ అప్పటికీ ఇంకా చంద్రబాబు మాత్రం కాంగ్రస్‌లోనే ఉన్నారు. ఆ తరువాత మామగారి కోరిక మేరకు 1984లో తెలుగు దేశం పార్టీలో చేరారు. కానీ ఆ తరువాత నందమూరి కుటుంబంలో పరిస్థితులు మారిపోయాయి. అనుకోని పరిస్థితుల్లో చంద్రబాబు తన మామను కాదని టీడీపీ పగ్గాలు చెప్పట్టాల్సి వచ్చింది. అలా 1995లో మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు.
ఈ విషయంలో ఎన్నో విమర్శలు వచ్చాయి. కానీ ఆయన మాత్రం రాష్ట్ర అభివృద్ధి మీదే ఫోకస్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ను ఐటీ రంగంలో ముందుకు తీసుకువచ్చారు. ఐటీకి ఆమడ దూరంలో ఉన్న తెలుగు రాష్ట్రాలకు ఇంటర్నెట్‌ను పరిచయం చేశారు. సైబరాబాద్‌ను ఏర్పాటు చేసి ఐటీని పరుగులు పెట్టించారు. ఇవాళ తెలుగు రాష్ట్రాల నుంచి దేశ విదేశాలకు ఐటీ ఎగుమతులు ఈ స్థాయిలో జరుగుతున్నాయంటే ఎవరు అవునన్నా కాదన్నా.. అది చంద్రబాబు కృషే. శతృవులు కూడా ఈ విషయంలో చంద్రబాబును మెచ్చుకోక తప్పదు. ఆ స్థాయిలో ఐటీ కోసం కష్టపడ్డారు కాబట్టే ఆయనను అంతా “సైబర్‌బాబు” అని కూడా అంటారు.
రాష్ట్ర విభజన తరువాత 2014లో ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా తిరిగి ఎన్నికయ్యారు. అనుకోని రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో 2019లో అధికారాన్ని కోల్పోయారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన పడ్డ క్షోభ అంతా ఇంతా కాదు. తన అనుభవమంత వయసు కూడా లేని వాళ్లు తిడుతుంటే గంభీరంగా భరించారు. తన నీడలో ఎదిగిన నాయకులు విమర్శిస్తుంటే ఓపికగా సహించారు. ఆఖరికి జైలుకు కూడా వెళ్లారు. ఆ కసే ఆయనను మరింత కసిగా పని చేసేలా చేసింది. పులి లాంటి ఆయన బలానికి ఉక్కు పంజా లాంటి జనసేన తోడయ్యింది. వీళ్లిద్దరి సారధ్యంలో ఎన్నికలకు వెళ్లిన కూటమి.. ప్రత్యర్థి పార్టీని పటాపంచలు చేసింది. కారు కూతలు కూసినవాళ్లు కనుమరుగయ్యేలా చేసింది. ఆ ఎన్నికల్లో చంద్రబాబు విజయం చేసిన శబ్ధానికి దేశం మొత్తం ఆయన వైపు చూసింది. ఏ నాయకులు ఆయనను డోర్ దగ్గర నిలబెట్టారో.. అదే నాయకులు ఆయనను పిలిచి మరీ పక్కన కూర్చోబెట్టుకున్నారు.
ఇప్పుడు అదే స్పీడ్‌తో అమరావతి టార్గెట్‌గా పని చేస్తున్నారు చంద్రబాబు. గత ప్రభుత్వంలో ప్రజలు ఎలాంటి సమస్యలు పడ్డారో వాటన్నిటికీ చెక్ పెడుతూ వస్తున్నారు. ఆడబిడ్డలకు అనుక్షణం రక్షణగా ఉండే శక్తి యాప్‌ను లాంఛ్ చేసి మరోసారి తన విజన్‌ను ప్రంపంచానికి చాటి చెప్పారు. ఆడబిడ్డ ఆపదలో ఉంటే శక్తి యాప్ ఉన్న ఫోన్ షేక్ చేస్తే చాలు నిమిషాల్లో పోలీసులు అక్కడికి వెళ్లిపోతారు. ఇది మహిళ రక్షణ విషయంలో చంద్రబాబుకు ఉన్న కమిట్‌మెంట్. ఇలాంటి కమిట్‌మెంట్, ఇంతటి విజన్ ఉన్న నాయకుడు తెలుగు రాష్ట్రంలో పుట్టడం. రాష్ట్రాన్ని ముందుండి నడిపించే ముఖ్యమంత్రి పదవిలో ఉండటం ప్రతీ తెలుగువాడి అదృష్టం. ఇలాంటి నేత కలకాలం ఆరోగ్యంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ హ్యాపీ బర్త్ డే సీఎం సార్.