Top story: రియల్ ఎస్టేట్ కన్నా బంగారమే బెస్ట్ ఇన్వెస్ట్ మెంటా?
ఇండియాలో బంగారం అంటే పిచ్చి. బంగారం మన సంస్కృతిలో భాగం. బంగారం మధ్య తరగతికి ఆర్థిక భద్రత. ధనికుడికి స్టేటస్ సింబల్.

ఇండియాలో బంగారం అంటే పిచ్చి. బంగారం మన సంస్కృతిలో భాగం. బంగారం మధ్య తరగతికి ఆర్థిక భద్రత. ధనికుడికి స్టేటస్ సింబల్. మనిషన్నాక.. ఓ ఆడపిల్లన్నాక .. వీసామెత్తు బంగారమైనా ఉండాలని.. మంగళసూత్రమైనా , పెళ్లి ఉంగరమైనా బంగారంతోనే చేయించుకోవాలనేది సంప్రదాయం. దేవుడి పెళ్లైనా, సామాన్యుడి పెళ్లైనా బంగారం ఉండాల్సిందే.
బంగారాన్ని తయారుచేయడం అన్నది ఎప్పటికీ సాధ్యం కాదు. సేకరించడం శుద్ధి చేయడం తప్ప…….. తయారు చేయడం సాధ్యంకాదు గనకే, బంగారానికి అంత విలువ. బంగారం విలువ పెరగడమే తప్పా.. తగ్గడమనేది చరిత్ర లో ఇప్పటి వరకు ఎప్పుడూ జరగలేదు. ఈ మధ్య కాలంలో.. ప్రతి ఇంటా.. ప్రతి నోటా … బంగారం గురించి చర్చే. దానికి కారణం పదిగ్రాముల బంగారం లక్షకు చేరువ కావడమే.
అంతర్జాతీయ మార్కెట్‌లో లభ్యత తగ్గిపోవడం.. దేశాలు వాటి బంగారు నిల్వలను పెంచుకోవడం.. సామాన్యుడు కూడా ఆర్థిక భద్రతగా బంగారాన్ని ఎంచుకోవడంతో రోజు రోజుకు మార్కెట్‌లో బంగారం డిమాండ్ , రేటు రెండు పెరిగిపోతున్నాయి. 2000 సంవత్సరంలో 4వేల రూపాయలు ఉన్న పది గ్రాముల బంగారం.. 2025 నాటికి అంటే 25 ఏళ్లలో లక్ష రూపాయలకు చేరువైంది. అంటే 25 ఏళ్ల కాలంలో నాలుగు వేల రూపాయలు.. లక్ష రూపాయలు అయ్యాయన్న మాట. దటీజ్ బంగారం. గోల్డ్ కొని పెట్టుకుంటే చాలు.. దాని విలువ దానంతట అదే పెరుగుతుంది. అదే బంగారానికి ఉన్న ప్రత్యేకత. ప్రపంచంలో మరే మూలకానికి ఆ విలువ రాదు.
2వేల సంవత్సరంలో తులం నాలుగువేలున్న బంగారం ఇప్పుడు లక్షకు చేరిందంటే, ఏ బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్ తో పోల్చుకున్నా, బంగారమే వందరెట్లు బెటర్. అప్పుడే కాదు, ఇప్పుడు బంగారం కొనుక్కున్న కూడా అదే రక్షణ. మాములుగా ఇండియాలో ఏ బ్యాంక్ అయినా ఆరు పర్సెంట్ మాత్రమే వడ్డీ ఇస్తుంది. అదే బంగారం… కొనుక్కొని పెట్టుకుంటే, బ్యాంకు వడ్డీతో పోల్చినపుడు.. అది 9 నుంచి 12 శాతం పెరుగుతుంది. అందువల్ల భారతదేశంలో సామాన్యుడి నుంచి సూపర్ రిచ్ వరకు ప్రభుత్వానికి కూడా బంగారమే బెస్ట్ ఇన్వెస్టిమెంట్. రియల్ ఎస్టేట్ పై ఇన్వెస్ట్ మెంట్ పెట్టాలంటే ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బులు కావాలి. అందువల్ల రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టడమనేది అందరికీ సాధ్యం కాదు. కానీ సామాన్యుడు పెట్టుబడి పెట్టేది బంగారం మాత్రమే.
చేతిలో 50వేల రూపాయల ఉన్నా బంగారం కొని దాచుకుంటే, దాని విలువ ఆటోమెటిక్ గా పెరుగుతూనే ఉంటుంది. 2020లో లక్ష రూపాయల బంగారం ఎవరైనా కొని పెట్టుకొని ఉంటే, ఈరోజు.. కళ్ల ముందే అది , ఐదేళ్లకే డబుల్ అయిపోయింది. బంగారం నేరుగా మాత్రమే కాక, బాండ్స్ ద్వారా కూడా ఇన్వెస్ట్ చేయవచ్చు. కానీ భారత దేశంలో సగటు మహిళలంతా బాండ్స్ కంటే నేరుగా బంగారాన్ని కొనుక్కోవడానికే ఆసక్తి చూపుతారు. అంతేకాదు, అన్నిటికంటే గొప్ప విషయం ఏటంటే మీరు బ్యాంకులో డబ్బు దాటుకుంటే దానిపై వచ్చే వడ్డీ కానీ, లాభం కానీ ఖచ్చితంగా ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది.
ఫిక్స్‌డ్ డిపాజిట్లపై పన్ను వేస్తారు. కానీ మీ ఇంట్లో మీరు బంగారం కొని పెట్టుకుంటే దాన్ని తిరిగి అమ్ముకునేటప్పుడు మీకొచ్చే లాభంపై ఎలాంటి ట్యాక్స్ ఉండదు. రియల్ ఎస్టేట్ రంగం కుదేలవుతున్న పరిస్థితుల్లో సామాన్యులైనా, ధనికులకైనా బెస్ట్ ఇన్వెస్ట్ మెంట్ ఇప్పటికీ బంగారమే. రియల్ ఎస్టేట్ పెట్టుబడులన్నీ రాబోయే ఐదేళ్లలో బంగారానికి మరలిపోయినా, ఆశ్చర్యం లేదు. 2030 నాటికి తులం బంగారం… లక్షన్నర అవుతుందని.. 2035 నాటికి పది గ్రాముల బంగారం రెండున్నర లక్షలకు చేరుకోవచ్చని అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. షేర్ మార్కెట్, రియల్ ఎస్టేట్ కన్నా, బంగారంలో పెట్టుబడులు పెట్టుకోవడమే.. స్థిరమైన భద్రతతో కూడిన ఇన్వెస్టిమెంట్.
బంగారాన్ని కేవలం ఆభరణంగానే చూడొద్దు. బంగారాన్ని ఇన్వెస్ట్మెంట్ గా చూడండి. బంగారం ఆభరణాలు కొనడం కన్నా, 24 క్యారెట్ బంగారం కొనుక్కోవడమే అన్నింటికన్నా మంచిది. చిన్న చిన్న బంగారం కొట్లలో … కొనే బంగారానికి .. నాణ్యత ఉండదు. విలువ ఉండదు. సో.. బంగారాన్ని ఆభణరంగా ఎంత ప్రేమిస్తారో.. ఇన్వెస్ట్‌మెంట్ గా పరిగణించినప్పుడే అది సామాన్యుడికి భద్రతనిస్తుంది.