Top story: మతం అడిగి, ప్యాంట్లు విప్పి చూసి పహల్గాం మారణకాండలో దారుణాలు

ఒకరూ ఇద్దరూ కాదు.. ఏకంగా 26 మంది తమ ప్రాణాలు కోల్పోయారు. అంతలా వాళ్లు చేసిన తప్పేంటి అంటే హిందువులుగా పుట్టడం. యస్‌.. మీరు విన్నది నిజమే.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 23, 2025 | 08:56 PMLast Updated on: Apr 23, 2025 | 8:56 PM

The Atrocities In The Pahalgam Massacre Were Seen After Asking For Alms Taking Off Their Pants

ఒకరూ ఇద్దరూ కాదు.. ఏకంగా 26 మంది తమ ప్రాణాలు కోల్పోయారు. అంతలా వాళ్లు చేసిన తప్పేంటి అంటే హిందువులుగా పుట్టడం. యస్‌.. మీరు విన్నది నిజమే. పహల్గాం ఎటాక్‌లో హిందువులను టార్గెట్‌ చేసి మరీ చంపేశారు టెర్రరిస్టులు. అక్కడ జరిగిన సీన్‌ చూస్తే.. వాళ్లు టార్గెట్‌గా హిందువులను చంపేందుకు వచ్చినట్టే కనిపించింది. కులంతో పనిలేదు. వర్గంతో సంబంధం లేదు. జస్ట్‌ హిందువైతే చాలు లేపేయడమే. ఇదే పహల్గామ్‌లో జరిగింది. పహల్గామ్‌కు వెళ్లిన టూరిస్టులు హార్స్‌ రైడింగ్‌ పూర్తి చేసుకుని అక్కడే టిఫిన్‌ తింటున్నారు. ఇంతలో కొందరు ఇండియన్‌ ఆర్మీ జవాన్లు అక్కడికి వచ్చారు. అక్కడే ఉన్న ఓ వ్యక్తి పేరు అడిగారు. అతని హిందూ పేరు చెప్పడంతో గన్‌ తీసి కాల్చేశారు. అప్పుడే అందరికీ అర్థమైంది.. వాళ్లు జవాన్లు కాదు, మారువేశంలో ఉన్న టెర్రరిస్టులు అని.

ప్రాణ భయంతో పరుగులు తీశారు. కానీ వాళ్లంతా ఉన్న ప్రాంతం మెయిన్‌రోడ్డుకు చాలా దూరంలో ఉంటుంది. దీంతో టెర్రరిస్టులు మారణకాండ సృష్టించారు. ప్రతీ టూరిస్టును పట్టుకుని వాళ్ల పేర్లు అడిగారు. ముస్లిం పేర్లు చెప్పినవాళ్లు ప్యాంట్లు విప్పి వాళ్లు నిజంగా ముస్లింలా కాదా అని చెక్‌ చేశారు. హిందూ అని తెలిసిన ప్రతీ ఒక్కరినీ కాల్చేశారు. మగాళ్లను భార్యా పిల్లలనుంచి లాక్కొచ్చి మరీ చంపేశారు. తన భర్తను చంపొద్దని ఓ మహిళా కాళ్లావేళ్లా పడితే.. వెళ్లి మీ మోడీకి చెప్పుకోండి అంటూ కళ్ల ముందే ఆమె భర్తను చంపేశారు. పెళ్లి చేసుకుని కనీసం వారం, నెల కూడా అవ్వని రెండు జంటలను విడగొట్టి.. ఓ నేవీ ఆఫీసర్‌ని ఓ ఉద్యోగిని చంపేశారు. విహార యాత్రం కోసం వచ్చిన కుటుంబాలను చిన్నాభిన్నం చేశారు. కళ్ల ముందే కుటుంబ సభ్యుల ప్రాణాలు పోతుంటూ ఏం చేయలేని స్థితిలో వాళ్లు ఏడ్చిన ఏడుపులు అరణ్య రోదనగా మిగిలాయి. విషయం తెలుసుకుని అక్కడికి వచ్చిన ఇండియన్‌ ఆర్మీ సోల్జర్స్‌ను చూసి కూడా స్థానికులు వణికిపోయారు అంటే వాళ్లు సృష్టించిన మారణకాండ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

నెల్లూరుకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ మధుసూదన్‌ ఉగ్రదాడిలో చనిపోయాడు. మధుసూదన్‌ బాడీలో 42 బుల్లెట్లు ఉన్నట్టు డాక్టర్లు గుర్తించారని చెప్తున్నారు. అంటే ఆ దుర్మార్గులు హిందువుల మీద ఏ స్థాయిలో పగపట్టారో అర్థం చేసుకోవచ్చు. ఆ ఎటాక్‌ నుంచి హిందువులను కాపాడేందుకు ప్రయత్నించిన స్థానిక ముస్లింను కూడా చంపేశారు. ఇదీ వీళ్ల సైకో తనానికి పరాకాష్ట. కానీ పాకిస్థాన్‌ మాత్రం ఈ ఎటాక్‌తో తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్తోంది. ఆ మాట చెప్తూనే బోర్డర్‌లో భారీ స్థాయిలో సైన్యాన్ని యుద్ధ విమానలను మోహరించింది. ఈ దాడిలో సూత్రధారులుగా ఉన్న ముగ్గురిలో ఒకడు పాకిస్థాన్‌ ఆర్మీలో మాజీ జవాన్‌. దీన్ని బట్టే ఈ ఎటాక్‌ వెనక ఎవరున్నారో అర్థం చేసుకోవచ్చు. ఎంత కవర్‌ చేసుకున్నా.. ఎన్ని రోజుల తరువాతైనా పాకిస్థాన్‌ ఈ దాడికి మూల్యం చెల్లించుకోక తప్పదు.