Top story: కాశ్మీర్లో 26 మంది సామాన్యుల ప్రాణాలు పోవడానికి కారణం ఎవరు?
నిర్లక్ష్యం శత్రువు కన్నా ప్రమాదకరమైంది. వందకి 90 సార్లు మన ఓటమికి, మన వైఫల్యానికి మన నిర్లక్ష్యమే కారణం అవుతుంది. జమ్ము కాశ్మీర్లోని పహల్ గాం లో 26 మంది టూరిస్ట్లను టెర్రరిస్టులు దారుణంగా చంపేసి భారతదేశానికే ఛాలెంజ్ విసిరారు.

నిర్లక్ష్యం శత్రువు కన్నా ప్రమాదకరమైంది. వందకి 90 సార్లు మన ఓటమికి, మన వైఫల్యానికి మన నిర్లక్ష్యమే కారణం అవుతుంది. జమ్ము కాశ్మీర్లోని పహల్ గాం లో 26 మంది టూరిస్ట్లను టెర్రరిస్టులు దారుణంగా చంపేసి భారతదేశానికే ఛాలెంజ్ విసిరారు. ఇది కచ్చితంగా మన వైఫల్యమే. భారత ఇంటిలిజెన్స్ వైఫల్యమే. కాశ్మీర్లో సమస్యలన్నీ మటుమాయమైపోయాయని, ఆర్టికల్ 370 ఎత్తేసిన తర్వాత పరిస్థితులన్నీ చక్కపడ్డాయని దేశం మొత్తం నమ్మింది.
అందుకే అక్కడికి టూరిస్టులు స్వేచ్ఛగా వెళ్లగలిగారు. కానీ అదును చూసి, ఊహించని విధంగా టి ఆర్ ఎఫ్ ఉగ్రవాదులు దాడి చేసి 26 మందిని పొట్టను పెట్టుకున్నారు. ఎవరు అంగీకరించినా అంగీకరించక పోయినా ఇది కచ్చితంగా భారత ఇంటిలిజెన్స్ వైఫల్యమే. నిజానికి కొన్ని నెలలుగా కశ్మీర్లో పరిస్థితి అంతా నార్మల్గా అయిపోయిందని… ఛాయలే లేవని…. ఎవరు ఎప్పుడైనా వచ్చి వెళ్ళవచ్చు అని రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఇదొక్కటే కాదు కాశ్మీర్ పై సినిమాలు, వెబ్ సిరీస్ లు, దేశభక్తి గీతాలు, వాట్సాప్ మెసేజ్ లు ఒకటి కాదు దేశం మొత్తం ఇటీవల కాలంలో ఊగిపోతుంది. కాశ్మీర్ పూర్తిగా ఆధీనంలో ఉందంటూ, త్వరలోనే పిఓకే కూడా మన అధీనంలోకి వచ్చేస్తుందంటూ మోడీ, బిజెపి భజన సంగం ఊదరగొడుతుంది.
కానీ పెహల్గాం సంఘటన మన దేశ నిఘా వ్యవస్థ మొత్తం బయట పెట్టింది. ఎన్ఐఏ, ఇంటిలిజెన్స్, రా…. ఇతర ఆర్మీ విభాగాల కోసం ప్రతి ఏడాది వేల కోట్ల రూపాయలకు ఖర్చు పెడుతున్నాం. అవన్నీ ఏమైపోయాయి? ఒక టూరిస్ట్ ప్రాంతంలో సామాన్య ప్రజలపై అటాక్ జరుగుతుంటే తెలుసుకోలేనంత దారుణమైన మన ఇంటిలిజెన్స్ వ్యవస్థలు ఉన్నాయా? అంతేకాదు పెహల్ గాం ని ఇండియన్ స్విజర్లాండ్ అని పిలుస్తారు. అక్కడికి ఖచ్చితంగా ఈ సీజన్లో వందల వేలమంది టూరిస్టులు వచ్చి వెళ్తుంటారు. అలాంటి చోట సెక్యూరిటీ పెట్టాలని జమ్ము కాశ్మీర్ పోలీస్ కి అనిపించలేదా? ఈ దుర్ఘటన జరిగిన ప్రాంతంలో సైన్యం లేదు, పోలీసులు లేరు, సీసీ కెమెరాలు లేవు. అసలు అక్కడికి వాహనాలే పోవు. అలాంటి ప్రదేశాన్ని చాలా తెలివిగా ఎంచుకున్నారు ఉగ్రవాదులు.
మొత్తం చల్లబడిపోయింది అనే భ్రమలో ఉన్నారు సైన్యం, జే అండ్ కే పోలీస్. దానికి పెహల్ గామ్ లో మనం మూల్యం చెల్లించుకోవలసి వచ్చింది. దుర్ఘటన జరిగిన తీరు చూస్తే చుట్టుపక్కల ఎక్కడ…. పోలీస్ కానీ, మిలటరీ ఫోర్సెస్ కానీ కనిపించలేదు. సంఘటన జరిగిన గంటన్నర తర్వాత కానీ ఎవరు అక్కడికి చేరుకోలేకపోయారు. అన్నిటికన్నా దుర్మార్గం ఏంటంటే అసలు ఇలాంటి సంఘటన ఒకటి జరుగుతుందని ఊహించలేకపోవడం, కనీస సమాచారమైన లేకపోవడం మరీ దారుణం. ఇదంతా నిద్రాణంగా ఉన్న మన నిఘా వ్యవస్థల పుణ్యమే.
2019లో ఎన్నికలకు ముందు జరిగిన పుల్వామా ఘటన ఇంకా ఎవరూ మర్చిపోలేదు. సరిగ్గా కొన్ని నెలల క్రితం 2024లో ఇదే ఆర్ టి ఎఫ్ స్లీపర్ సెల్స్ బ్యాచ్ దాడికి పాల్పడ్డారు. అక్కడినుంచి జమ్మూ నుంచి కాశ్మీర్ కు షిఫ్ట్ అయిపోయారు. మళ్లీ ఇప్పుడు ఇలా ఊహించిన విధంగా దెబ్బతీశారు. మనం ఎన్ని కథలు చెప్పుకున్నా…. ఎన్ని సినిమాలు తీసిన…. ఇంకెన్ని వెబ్ సిరీస్ రూపొందించిన గ్రౌండ్లో మన నిర్లక్ష్యం పౌరుల ప్రాణాలు తీసింది.
బైసరంలోయను టెర్రరిస్టులు చాలా తెలివిగా తమ టార్గెట్ కోసం ఎంచుకున్నారు. వాస్తవానికి పహల్గాం నుంచి బైస్రాన్ వరకు ఐదు కిలోమీటర్లు మోటార్ వెహికల్స్ ను అనుమతించరు. అక్కడి పచ్చదనం కాపాడడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. నా లేదా గుర్రాల ద్వారా మాత్రమే ఈ ప్రాంతానికి చేరుకోవాలి. ఇక్కడ టూరిస్ట్ ల పై దాడి చేస్తే తిరిగి సైన్యం ప్రతిచర్లకు దిగడానికి చాలా ఆలస్యం అవుతుంది. అంతేకాదు ఉగ్రవాదులు తప్పించుకోవడానికి చాలా సమయం కూడా దొరుకుతుంది. ఇవన్నీ ఆలోచించుకొని టి ఆర్ ఎఫ్ టెర్రరిస్టులు టూరిస్ట్ లపైకి తెగబడ్డారు. జరిగిన నష్టాన్ని ఇప్పుడు ఎవరు పోర్చలేరు. ఆ కన్నీళ్లు జనం కన్నీళ్ళని తుడవటం కూడా సాధ్యం కాదు. మన నిర్లక్ష్యమే మన శత్రువుకి అవకాశం ఇచ్చిందని విషయాన్ని కేంద్రం, ఇంటిలిజెన్స్, పోలీస్ వర్గాలు గుర్తిస్తే…. భవిష్యత్తులో ఇలాంటి సంఘటన మళ్లీ జరగవు.