Top story: ఇక జగన్‌కు చెక్ పడినట్లేనా..?

మార్ ముంత.. ఛోడ్ చింతా అంటున్నారు కూటమి కార్యకర్తలు. వరుస అరెస్టులతో మనసులోనే సంబరాలు చేసుకుంటున్నారు. హిట్ లిస్టులో ఉన్నోళ్లు ఒక్కోళ్లు అరెస్టు అవుతుంటే..

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 22, 2025 | 07:03 PMLast Updated on: Apr 22, 2025 | 7:04 PM

Is It Like Jagan Is In Check Now

మార్ ముంత.. ఛోడ్ చింతా అంటున్నారు కూటమి కార్యకర్తలు. వరుస అరెస్టులతో మనసులోనే సంబరాలు చేసుకుంటున్నారు. హిట్ లిస్టులో ఉన్నోళ్లు ఒక్కోళ్లు అరెస్టు అవుతుంటే.. బిగ్ బాస్ అరెస్ట్ త్వరలోనే అని అంచనాలు వేసుకుంటున్నారు. చదరంగంలో చుట్టూ ఉన్న ఒక్కో పావును లాగేసినట్లు.. జగన్ చుట్టూ ఉన్నవారిని ఒక్కోరిని ఒక్కో కేసులో లాగేస్తున్నారు. వర్చువల్ గా ఆల్ మోస్ట్ జగన్ ను పోలీసులు చుట్టుముట్టేసినట్లే కనపడుతోంది. ఇక ఎన్నో అడుగుల దూరం లేదనే అనిపిస్తోంది. రాంగోపాల్ వర్మ అమితాబ్ తో తీసిన సర్కార్ సినిమా గుర్తుంది కదా.. అందులో శత్రువును అంతం చేయాలంటే ముందు వాడి ఆలోచనను చంపాలి అనే డైలాగ్ ఉంటుంది. ఆలోచనను చంపడం అంటే వాడికి సలహాలిచ్చేవాడిని ముందు లేపాలి.. అప్పుడు వాడి ఆలోచన ఆగిపోతుంది.. అప్పుడు వీక్ అయిపోతాడు. అదే కాన్సెప్ట్. ఇప్పుడిదే స్ట్రాటజీని ఏపీ పోలీసులు అమలు చేసినట్లు కనపడుతోంది.

బాలీవుడ్ నటి జత్వానీ కేసు తెరపైకి వచ్చి చాలా రోజులైంది. అందులో మిస్టర్ సీతారామంజనేయులు నిందితుడని తెలుసు.. ఎఫ్ఐఆర్ లో కూడా పేరు పెట్టలేదు. తర్వాత కోర్టుకు చెప్పాల్సి వచ్చింది. చివరకు హైకోర్టు కూడా ఆయనను ఎందుకు అరెస్ట్ చేయలేదని అడగాల్సి వచ్చింది. ఏ జిందాల్ కోసం ఈ అరాచకం చేశారో.. ఆ జిందాల్ ప్రభావమో ఏమో గాని.. ఇప్పటివరకు అయితే అరెస్ట్ చేయలేదు. రఘురామకృష్ణరాజు కేసులో కూడా ఇంటరాగేషన్ లో టార్చర్ వ్యవహారం కూడా సీతారామాంజనేయులదే కథ స్క్రీన్ ప్లే అనేది ఆరోపణ. అందులోనూ అరెస్ట్ చేయలేదు. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణను కూడా గన్ చూపించి బెదిరించినట్లు కేసు బుక్ అయింది. ఇలా ఇన్ని కేసులున్నా ఇప్పటివరకు టచ్ చేయలేదు.. ఇప్పుడే ఎందుకు అరెస్ట్ చేశారు.?

అసలు విషయం ఏంటంటే… టీడీపీ టైమ్ లో ఏబీ వెంకటేశ్వరరావు నడిపించినట్లుగా.. వైసీపీ హయాంలో సీతారామాంజనేయులు నడిపించాడనేది టాక్. ఒకప్పుడు రాయలసీమలో ఫ్యాక్షనిస్టుల గుండెల్లో నిద్రపోయాడనే పేరు ఉంది. మంచి ఆపీసర్ అనే టాక్. కాని కొన్ని వ్యవహారాల్లో వీక్ నెస్ ఉందనేది గట్టి టాక్. అలాంటిదాంట్లోనే ఒకప్పుడు వల్లభనేని వంశీ మనోడిని బుక్ చేశాడు.. కాల్ రికార్డులు చేసి ఇరుకున పెట్టాడు. అప్పుడు ట్రాన్సఫర్ అయిపోయాడు. పక్కన పెట్టాడు. కాని మళ్లీ వైసీపీ అధికారంలోకి రాగానే.. మొత్తం మీద తెరపైకి వచ్చేశాడు. నన్ను వాడుకోండి.. కావాల్సినట్లు వాడుకోండి అని ఓపెన్ ఆఫర్ ఇవ్వడంతో.. జగన్ టెంప్ట్ అయ్యారని అంటారు. దానికి తగ్గట్టే గట్టిగానే వాడారు. అన్ని విషయాల్లోనూ పైకి సీఐడీ చీఫ్ గా అప్పట్లో ఉన్నోళ్లు కనపడ్డారు గాని.. అన్నిటి వెనక కథ స్క్రీన్ ప్లే ఈ సీతారామాంజనేయులే అంటున్నారు.

జగన్ సజ్జలకు.. సజ్జల పీఎస్ఆర్ కు ఇలా డైరెక్షన్ వెళ్లిపోయేది. డీజీపీ ఉన్నోళ్లు డమ్మీయే.. అంతా ఈ పీఎస్ఆరే నడిపించాడని అంటున్నారు. అలాగే జత్వానీ వ్యవహారం కూడా నడిపించేశాడు. అయితే ప్రభుత్వం మారడంతో కథ అడ్డం తిరిగింది. కేసులు బుక్ అయ్యాయి. అయినా ఎలాగో మేనేజ్ చేశాడు. కాని అసలు కేసుల్లో ఇరుక్కున్న ప్రతి వైసీపీ నేతకు ఈయనే సలహాలిస్తున్నాడని.. దాని ప్రకారమే వాళ్లు ముందస్తు బెయిల్ పిటిషన్లు.. హైకోర్టు, సుప్రీంకోర్టు తిరిగేసి అరెస్టులను ఆపుకుంటున్నారని చాలా ఆలస్యంగా తెలుసుకున్నారు ఏపీ పోలీసులు. దీంతో కూటమి ప్రభుత్వం కూడా వ్యూహాత్మకంగా ముందు ఈయనను కంట్రోల్ లో పెడితే.. ఆటోమేటిక్ గా మిగతావారందరూ వీక్ అవుతారనే కాన్సెప్టుతో ఇప్పుడు అరెస్ట్ చేశారని అంటున్నారు.

ఒకవైపు కసిరెడ్డిని ఇంటరాగేట్ చేస్తున్నారు. మరోవైపు ఏబీవీ ఎంట్రీతో అనంత్ బాబును కేసును రీఓపెన్ చేసి మరీ అరెస్ట్ చేశారు. ఇప్పటికే గోరంట్ల మాధవ్ లోపలే ఉన్నాడు. వల్లభనేని వంశీ సీన్ సరేసరి. ఇక అరెస్ట్ కావాల్సింది సజ్జల, మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి.. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డే. ఇదే ప్రయారిటీ లిస్ట్ అని చెప్పుకుంటున్నారు. ఎందుకనో రోజా ఈ లిస్టులో మిస్ అయింది. ఇక కొడాలి నాని హార్ట్ ఆపరేషన్ కాబట్టి ప్రస్తుతానికి ఎస్కేస్ అయినట్లే అంటున్నారు. కాని మొత్తం మీద కూటమి పాలకుల స్ట్రాటజీ మాత్రం జగన్ చుట్టూనే తిరుగుతోంది. జగన్ అరెస్ట్ లక్ష్యంగానే అన్ని కేసులు కదులుతున్నట్లు కనపడుతోంది. కూటమి వచ్చి ఏడాది అవుతున్న టైమ్ లో పుంజుకుంటున్నట్లుగా వైసీపీ నేతలు డైలాగులు వదిలిన వారాల్లోనే కథ మొత్తం అడ్డం తిరిగింది. ఒక్కసారే ఆత్మరక్షణలో పడిపోయారు. మరి ఈ కేసుల ప్రభావం రాజకీయంగా ఎలా ఉంటుంది? ప్రజల్లో ఎలాంటి ఆలోచన వస్తుందనేది చూడాలి. కూటమి కార్యకర్తలైతే ఫుల్ హ్యాపీ ఫీలవుతున్నట్లు తెలుస్తోంది. ఏం చేయటం లేదని మొన్నటిదాకా అసంతృప్తిగా ఉన్నవారంతా ఇప్పుడు సాటిస్ ఫై అవుతున్నట్లు కనపడుతోంది.