Top story: పెద్దిరెడ్డి ఫ్యామిలీని కాపాడుతున్నపెద్దమనిషి ఎవరు?

ఏంటో వీళ్లు పట్టించుకోవడం లేదా.. లేక చేతకావడం లేదా.. లేక క్యాష్ కొట్టినోడిని క్షమించేస్తున్నారా.. ఇదే కూటమి ప్రభుత్వంపై ఆ పార్టీల కార్యకర్తలే విసురుతున్న మాటలు. మొదటి ఆరు నెలలు అయితే ఏకిపారేశారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 18, 2025 | 06:30 PMLast Updated on: Apr 18, 2025 | 6:30 PM

Who Is The Gentleman Protecting The Peddireddy Family

ఏంటో వీళ్లు పట్టించుకోవడం లేదా.. లేక చేతకావడం లేదా.. లేక క్యాష్ కొట్టినోడిని క్షమించేస్తున్నారా.. ఇదే కూటమి ప్రభుత్వంపై ఆ పార్టీల కార్యకర్తలే విసురుతున్న మాటలు. మొదటి ఆరు నెలలు అయితే ఏకిపారేశారు. తర్వాత కాస్త కేసులు ఒక్కోరిపై పెడుతున్న కొద్దీ .. కొంచెం కొంచెం చల్లబడ్డారు. కాని ఆ కేసులు నడుస్తున్న తీరు చూసి మళ్లీ ఫైరవుతున్నారు. అదేమంటే టీడీపీ నేతలేమో మేం పద్ధతిగా వెళుతున్నాం.. వైసీపీలాగా అరాచకంగా, కక్షగట్టి చేయం అంటూ సుభాషితాలు చెబుతున్నారు. లేటెస్టుగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వ్యవహారంలో ప్రభుత్వంపై ఇలాంటి విమర్శలే వస్తున్నాయి.

హైకోర్టు ముందస్తు బెయిల్ ఇస్తే.. సుప్రీంకోర్టులో కేవియెట్ ఎందుకు వేయలేదని.. అసలు బెయిల్ ఇచ్చే సమయంలో ప్రభుత్వం తరపు లాయర్ సరిగా వ్యవహరించలేదని.. సోషల్ మీడియాలో కూటమి కార్యకర్తల మధ్యే పెద్ద వార్ నడుస్తుంది. సమర్ధించుకునేవారు కొందరు.. ప్రశ్నించేవారు మరికొందరు.. మొత్తం మీద రచ్చ నడుస్తోంది. ఇప్పుడు మిథున్ రెడ్డి లిక్కర్ స్కామ్ కేసులో విచారణకు హాజరవుతున్నారు. తన విచారణను లాయర్ల సమక్షంలో చేయాలని.. వీడియో రికార్డింగ్ చేయించాలని హైకోర్టులో పిటిషన్ వేశారు మిథున్ రెడ్డి. దీనిపై కూడా ప్రభుత్వం తరపు లాయర్లు సరిగా వాదించలేదనేదే విమర్శ. అసలు పెద్దిరెడ్డి ఫ్యామిలీతో కుమ్మక్కయ్యారా అంటూ సోషల్ మీడియాలో సర్క్యులేషన్ నడుస్తోంది.

ఇక్కడ సమస్య ఏంటంటే… కేసులు ఎదుర్కొంటున్న వైసీపీ పార్టీ నేతలంతా క్యాష్ పార్టీలే. మామూలు క్యాష్ పార్టీలు కాదు… ఎవరిని కొట్టాలన్నా క్యాష్ తోనే కొట్టే బ్యాచ్. క్యాష్ కొడితే దెబ్బ తగిలినా నవ్వుతూ తీసుకునే బాపతు మన వ్యవస్ధలో చాలా ఎక్కువ మంది ఉన్నారు. పోలీసులు, లాయర్లు, అధికారులు.. అన్ని చోట్లా ఈ కల్చర్ ఉంది. బోరుగడ్డ అనిల్ విషయంలో అదే జరిగింది. పోలీసులు డబ్బులు తీసుకుని వాడికి రాచమర్యాదలు చేశారు.. ఆ వీడియోలు బయటకు రావడంతో జాగ్రత్తపడ్డారు. ఆఖరికి బోరుగడ్డ బెయిల్ కోసం పెట్టిన పేపర్లు కూడా ఫేక్ అని హైకోర్టు తేల్చింది కాని.. పోలీసులు కాదు.

అంతెందుకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై భూకబ్జా ఆరోపణలు ఎన్ని వచ్చాయి? అటవీ భూములు, అసైన్డ్ భూములు ఆక్రమించినట్లు కంప్లయింట్లు చాలామంది చేశారు. మదనపల్లి తహశీల్దార్ ఆఫీసులో అగ్ని ప్రమాదం జరిగితే హెలికాప్టర్ లో అధికారులను పంపిన ప్రబుత్వం.. తర్వాత మాత్రం దాని గురించి పెద్దగా పట్టించుకున్నది. నెలల తర్వాత పెద్దిరెడ్డికి నోటీసులు ఇవ్వడానికి వెళ్లారు.. ఆయన లేరని వెనక్కి వచ్చేశారు. అలా నడుస్తోంది వ్యవహారం. అసలు భూములు ఆ రేంజులో కొట్టేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని.. అది కూడా ఆయన భార్య పేరు మీద డాక్యుమెంట్లు దొరికాక కూడా .. ఆయనను టచ్ చేయకపోవడం ఎలాంటి సిగ్నల్స్ ఇస్తుందని కొందరు ప్రశ్నిస్తున్నారు.

పెద్దిరెడ్డి కుటుంబం వరకు టీడీపీలోనే ఓ పెద్ద ఫ్రెండ్ ఉన్నాడన్నది చాలామందికి తెలుసు. ఆయనో టీడీపీ అనుకూల మీడియా అధినేత. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే ఆయన చానెల్ లో పెద్దిరెడ్డిపై ఈగ వాలనివ్వలేదు. ఇక కూటమి వచ్చాక ఆయనను కాపాడే లాబీయింగ్ నడిపించారని ప్రచారం జరుగుతోంది. అయితే మరో పెద్ద టీడీపీ అనుకూల మీఢియా ఈ విషయం తెలిసి… పెద్దిరెడ్డిని టార్గెట్ చేసి వార్తలు వరుసగా ఇఛ్చింది. దీంతో అందరూ అది ఇవ్వక తప్పలేదు.. ప్రభుత్వం, అధికారులు స్పందించక తప్పలేదు. కాని పెద్దిరెడ్డి ఫ్రెండ్ లాబీయింగ్ గట్టిగానే పని చేస్తున్నట్లు ఉంది. అందుకే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని టచ్ చేయడం ఇంకా లేటు అవుతుంది.
మిథున్ రెడ్డి అంటే లిక్కర్ స్కామ్ కాబట్టే స్పీడుగా వ్యవహారం నడుస్తుంది.

ఎందుకంటే ఈ స్కామ్ లో జగన్ ను అరెస్ట్ చేయడమే కూటమి ప్రభుత్వ టార్గెట్. అందుకే అలా జరుగుతోంది. లేదంటే మిథున్ రెడ్డిని కూడా పెద్దాయన రామచంద్రారెడ్డి కోరిక మేరకు వదిలేసేవారేమో. ఏమైనా క్యాష్ కొడితే ఎలాంటివాడినైనా వదిలేస్తారు అనే నానుడి మాత్రం కూటమి ప్రభుత్వంలో గట్టిగా వినిపిస్తోంది. కాకపోతే క్రిమినల్ కేసులు మాత్రమే దానికి మినహాయింపు. అందులోనూ కొందరు నేతలకు మాత్రమే ఆ మినహాయింపు. మరి తప్పు చేసిన వైసీపీ నేతలకు శిక్షలు వేయించి తన ప్రాతివత్యం టీడీపీ నిరూపించుకుంటుందో లేదో చూడాలి మరి.