బ్రేకింగ్: ప్రియుడి కోసం భర్త హత్య ,36 సార్లు పొడిచి లవర్‌కు వీడియో కాల్
మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కేవలం నాలుగు నెలల క్రితం వివాహమై కొత్తగా జీవితం ప్రారంభించిన ఓ దంపతుల మధ్య.. ఓ ప్రేమ పిచ్చి చిచ్చు రేపింది.

మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కేవలం నాలుగు నెలల క్రితం వివాహమై కొత్తగా జీవితం ప్రారంభించిన ఓ దంపతుల మధ్య.. ఓ ప్రేమ పిచ్చి చిచ్చు రేపింది. నిండు ప్రాణం తీసింది. 25 ఏళ్ల గోల్డెన్ పాండే అలియాస్ రాహుల్‌ను అతని 17 ఏళ్ల భార్య, ఆమె ప్రియుడు యువరాజు, అతడి ఇద్దరు స్నేహితులతో కలిసి దారుణంగా హత్య చేసారు. 4 నెలల క్రితం రాహుల్‌కు పెళ్లైంది. కానీ రాహుల్ చేసుకున్న అమ్మాయి అప్పటికే యువరాజు అనే వ్యక్తితో లవ్‌లో ఉంది. లవర్‌తో జీవితం కొనసాగించేందుకు భర్తను చంపాలనుకుంది. యువరాజుతో కలిసి ప్లాన్ చేసింది.
భర్తతో బైక్ మీద వస్తున్న సమయంలో చెప్పు కిందపడిపోయిందని చెప్పింది. పడిపోయిన చెప్పు వెతుకుతూ రాహుల్ వెనక్కి వెళ్లాడు. అప్పటికే అక్కడ కాపు కాసిన యువరాజు స్నేహితులు బీర్ బాటిల్ పగలగొట్టి రాహుల్ మీద దాడి చేశారు. గాజు ముక్కలతో 36 సార్లు రాహుల్ పొడిచి అక్కడికక్క చంపేసి శవాన్ని పొలాల్లో పడేశారు. రక్తపు మడుగులో ఉన్న రాహుల్ శవాన్ని ప్రియుడు యువరాజ్‌కు వీడియో కాల్ చేసి చూపించింది రాహుల్ భార్య. ఈ కేసులో ఐదుగుర్ని అరెస్ట్ చేసిన పోలీసులు.. రాహుల్ భార్య మైనర్ కావడంతో ఆమెను జువైనల్ హోంకు తరలించారు.