సాయి రెడ్డికి ప్రాణ భయం.. కారులో నుంచే వాటర్ బాటిల్..?
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందం విజయసాయిరెడ్డిని విచారిస్తున్న సంగతి తెలిసిందే. లిక్కర్ కుంభకోణానికి సంబంధించి విజయసాయిరెడ్డి అ

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందం విజయసాయిరెడ్డిని విచారిస్తున్న సంగతి తెలిసిందే. లిక్కర్ కుంభకోణానికి సంబంధించి విజయసాయిరెడ్డి అప్పట్లో కీలకంగా వ్యవహరించారని ఆరోపణల నేపథ్యంలో పలు ఆధారాలను సేకరించిన అధికారులు.. ఆయనను శుక్రవారం సుదీర్ఘంగా విచారిస్తున్నారు. మూడు రోజుల క్రితం విజయసాయిరెడ్డికి నోటీసులు జారీ చేసిన అధికారులు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
ముందుగానే విజయవాడ చేరుకున్న విజయసాయిరెడ్డి.. ఓ హోటల్లో వైసీపీ నేతలను కలిశారు అనే ప్రచారం ఆసక్తికరంగా మారింది. కొంతమంది వైసీపీ నేతలు విజయసాయిరెడ్డి తో రాజీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. అప్పట్లో పలువురు వైసీపీ కీలక నేతలు మద్యం కుంభకోణంలో అత్యంత కీలకంగా వ్యవహరించారు. దీనితో వారందరిపై దర్యాప్తు అధికారులు ఫోకస్ పెట్టారు. వారిలో ఎవరి పేరు విజయసాయిరెడ్డి బయటపెట్టిన సరే వారు కచ్చితంగా చిక్కుల్లో పడాల్సిందే. దీనితో ఇప్పుడు విజయసాయిరెడ్డి తో రాజీ కోసం ప్రయత్నాల్లో భాగంగానే విజయవాడలో ఆయనను కలిసినట్లు తెలుస్తోంది.
కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి పాత్ర గురించి కూడా విజయసాయిరెడ్డి బయటపెట్టారు. ఓ ఎంపీ గురించి కూడా ఆయన బయటపెట్టే అవకాశం ఉందని ప్రచారం నేపథ్యంలో వైసీపీ నేతల్లో ఆందోళన మొదలైంది. ఇదిలా ఉంటే దర్యాప్తు అధికారులకు విజయసాయిరెడ్డి పూర్తిగా సహకరిస్తున్నట్టు తెలుస్తోంది. విచారణలో సిపి… విజయసాయిరెడ్డి ని కాఫీ తాగమని అడగగా తనకు మంచినీళ్లు చాలని విజయసాయిరెడ్డి తిరస్కరించారట. ఇక మంచినీళ్లు దర్యాప్తు అధికారులు ఇచ్చిన సరే తన కారులో నుంచి మాత్రమే మంచినీళ్లుతెప్పించుకుని తాగారు విజయసాయిరెడ్డి.
దర్యాప్తు అధికారులు స్నాక్స్ ఆఫర్ చేసిన సరే ఆయన మాత్రం తిరస్కరించారట. కసిరెడ్డికి మీకు సంబంధం ఏంటని.. మీరిద్దరికీ మధ్య మంచి సంబంధాలు ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయని.. అది నిజమేనా అంటూ విజయ సాయి రెడ్డిని దర్యాప్తు అధికారులు ప్రశ్నించారు. మీ బంధువుల కంపెనీలకు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి నుంచి 60 కోట్ల రూపాయలను మళ్ళించారనే ఆరోపణలు ఉన్నాయని అవి నిజమేనా అంటూ ప్రశ్నించినట్లు సమాచారం. అసలు 60 కోట్ల రూపాయలు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందని అధికారులు పలు ప్రశ్నలను సంధించారు.